కైరో : ఈజిప్టు రాజధాని కైరో నగరంలోని పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం రాత్రి బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో పోలీసు కూడా ఉన్నాడని చెప్పారు. నగరంలోని అత్యంత జనసమర్థంగా ఉండే ప్రాంతం అజబాకియా పోలీస్ స్టేషన్ ఒకటి. అయితే గత రాత్రి స్టేషన్లో పోలీస్ వాహనాలు నిలిపి ఉంచే ప్రాంతంలో ఓ వాహనానికి తీవ్రవాదులు బాంబు అమర్చారని ఉన్నతాధికారి తెలిపారు. దీంతో పోలీసు స్టేషన్ వద్ద పేలుడు సంభవించిందన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే పోలీస్ స్టేషన్లో తీవ్రవాదులు మరిన్ని బాంబులు అమర్చి ఉంటారని... వాటి కోసం శోధిస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 2011 నాటి నుంచి ఈజిప్ట్లో చోటు చేసుకున్న విధ్వంసం కారణంగా 600 మంది భద్రత సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే.