అబ్బురపడేలా భలేగా క్యాచ్‌ పట్టారు.. | Five Year Old Fell From Third Floor, Heroic Cop Saved | Sakshi
Sakshi News home page

అబ్బురపడేలా భలేగా క్యాచ్‌ పట్టారు..

Published Thu, Feb 22 2018 5:35 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

Five Year Old Fell From Third Floor, Heroic Cop Saved - Sakshi

పై నుంచి పడిపోతున్న బాలుడిని అందుకునేందుకు సిద్ధంగా ఉన్న పోలీసులు

కైరో : ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడో అంతస్తు. దానికింద ఓ బ్యాంకు.. ఆ బ్యాంకు ముందు ముగ్గురు పోలీసులు. వారు ఏదో చర్చించుకుంటుండగా రోడ్డుపై వెళుతున్న కొంతమంది పైకి చూసి అయ్యయ్యో అంటున్నారు. దాంతో ఏం జరిగిందా అనుకుంటూ పోలీసులు కూడా పైకి చూశారు. ఇంకేముంది వారు షాకయ్యారు. ఎందుకంటే మూడో అంతస్తులో ఓ ఐదేళ్ల బాలుడు వేలాడుతున్నాడు. తన ఇంటి బాల్కనీలో నుంచి జారిన పిల్లాడు కాస్త మూడో అంతస్తుపై వేలాడుతున్నాడు. ఎలాగైనా అతడిని కాపాడాలని పోలీసులు తాపత్రయపడ్డారు.

ఓ దుప్పటి లాంటి తెప్పించి కింద ముగ్గురు పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. అది చాలదన్నట్లు మరో పోలీసు వేరే వస్తువు తీసుకొచ్చేందుకు వెళ్లగా అనూహ్యంగా బాలుడు జారిపోయాడు. దీంతో అప్పటికే అప్రమత్తంగా ఉన్న ఓ పోలీసు బంతిని క్యాచ్‌ పట్టినట్లుగా బాలుడిని పట్టుకున్నాడు. దీంతో చిన్నగాయం కూడా అవకుండానే బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన ఫుటేజీని విడుదల చేయగా అది ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఘటన ఈజిప్టులో చోటు చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement