
భార్య తనతో వచ్చేందుకు నిరాకరించిందన్న అక్కసుతో కత్తితో దాడి చేసి పారిపోయాడు ఆమె భర్త. ఈ ఘటన రాజస్తాన్ ధోలపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకాం....ఈ జంట ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకుసుని బారీ అనే పట్టణంలో నివసిస్తున్నారు. అయితే జైపూర్‌లో ఉంటున్న భర్త కుటుంబసభ్యులు ఆ మహిళతో సహా తిరిగి ఇంటికి వచ్చేయమని బలవంతం చేశారు.
ఈ నేఫథ్యంలోనే దంపతులు రైలు ఎక్కేందుకు రైల్వేస్టేషన్‌కి వచ్చారు. కానీ ఆమె అతడి కుటుంబసభ్యుల వద్దకు తిరిగి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. తనతో వచ్చేందకు ఒప్పుకోవడం లేదన్న కోపందో ఆమె భర్త కోపంతో కత్తితో దాడి చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమె తాను చనిపోతానన్న భయంతో బెంచ్ మీద రక్తంతో తల్లిదండ్రుల మొబైల్ నెంబర్లను రాసింది. ఆ తర్వాత ఆమె ఒక జీఆర్‌పీ జవాన్ సాయంతో ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
(చదవండి: మొదటి భర్త ఘాతుకం...తనని కాదని మరో పెళ్లి చేసుకుందని పెట్రోల్‌తో...)
Comments
Please login to add a commentAdd a comment