కైరో: ఈజిఫ్టులో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు ఈజిఫ్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తర కైరోలోని బన్హాలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు వంద మందికి పైగా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని రక్షించడానికి అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్యాసింజర్ రైలులో ఉన్న ప్రయాణిలకు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీశారు.
రైలు దేశ రాజధాని కైరో నుంచి మన్సౌరాకు వెళుతున్న సమయంలో నాలుగు బోగీలు హఠాత్తుగా పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటపై ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ ఫట్టా అల్ సిసి విచారం వ్యక్తంచేశారు. రైలు ప్రమాద ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే రైలు పట్టాలకు తప్పడానికి గల కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. రైలు డ్రైవర్, ఇతర రైలు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: అమెరికాలో మళ్లీ కాల్పులు
Comments
Please login to add a commentAdd a comment