లండన్: లండన్‌లోని ‘లండన్ బ్రిడ్జి’పై శుక్రవారం కత్తితో పొడిచి ఇద్దరిని హతమార్చిన ఉగ్రవాది ఉస్మాన్‌ఖాన్(28) గతంలో ఉగ్రవాద నేరాలపై ఏడేళ్ల క్రితం శిక్ష అనుభవించిన విషయాన్ని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు వెల్లడించారు. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజిపై బాంబు దాడికి యత్నించినందుకు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని నడిపినందుకు ఉస్మాన్‌ఖాన్‌కు గతంలో జైలుశిక్ష పడింది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఉస్మాన్.. పెరోల్‌పై బయటికొచ్చి శుక్రవారం లండన్ బ్రిడ్జిపై పేట్రేగిపోయాడు. కత్తితో పొడిచి ఇద్దరిని హతమార్చిన ఉస్మాన్ మరో ముగ్గురిని గాయపరిచాడు. ఉస్మాన్‌కు ఉగ్రనేరాలపై 2012లో శిక్ష పడింది. 2018లో లైసెన్స్ (పెరోల్)పై జైలు నుంచి విడుదలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment