#IranAttack: ఇరాన్‌ దాడులు.. అమెరికా వ్యూహం ఫలించిందా? | Iran Launched Explosive Drones And Fired Missiles At Israel | Sakshi
Sakshi News home page

#IranAttack: ఇరాన్‌ దాడులు.. అమెరికా వ్యూహం ఫలించిందా?

Published Sun, Apr 14 2024 7:41 AM | Last Updated on Sun, Apr 14 2024 2:59 PM

Iran Launched Explosive Drones And Fired Missiles At Israel - Sakshi

Live Updates..

ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ తాజా వార్నింగ్‌.. 

ప్రతీకార చర్యలో భాగంగా ఇజ్రాయెల్‌పై శనివారం రాత్రి డ్రోన్లు, మిసైళ్ల వర్షం కురిపించిన ఇరాన్‌, ఆ దేశానికి ఆదివారం( ఏప్రిల్‌ 14)  మళ్లీ వార్నింగ్‌ ఇచ్చింది.  ఈ మేరకు అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇరాన్‌ను హెచ్చరించారు. తాము చేసిన డ్రోన్‌ దాడులకు ఇజ్రాయెల్‌ ఎలాంటి ప్రతి దాడులకు దిగినా తమ స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. 

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ..‘ఇరాన్‌ భీకర దాడులను ఇరాన్‌ ఎదుర్కోని వారిపై విజయం సాధించింది. శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్‌ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించింది. దీంతో శత్రువులు ఇజ్రాయెల్‌ణు ఏమీ చేయలేరని వెల్లడించినట్లైంది. ఇజ్రాయెల్‌ రక్షణకు అమెరికా కట్టుబడి ఉంది. ఇరాన్‌ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడానికి సాయం చేశాం. మా సైనికులు అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించారు. భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తాం. ఈ దాడులను నేను ఖండిస్తున్నాను’ అని కామెంట్స్‌ చేశారు. 

300 డ్రోన్స్‌ ప్రయోగించిన ఇరాన్‌..
ఇరాన్‌ దాదాపు 300 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్‌ పేర్కొంది. వాటిల్లో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే తమ భూభాగాన్ని తాకాయని వెల్లడించింది. ఈ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఐడీఎఫ్‌ స్థావరం తీవ్రంగా దెబ్బతినగా.. ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఇరాన్‌ తన భూభాగంపై నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే తొలిసారి.

ఇరాన్‌ డ్రోన్లను కూల్చిన అమెరికా..
అమెరికా దళాలు ఇరాన్‌ ప్రయోగించిన దాదాపు 70కిపైగా డ్రోన్లు, మూడు బాలిస్టిక్‌ క్షిపణులను కూల్చివేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. మధ్యధరా సముద్రంలోని తమ యుద్ధ నౌకలు స్పందించాయని పేర్కొన్నారు. ఇరాన్‌ మొత్తం 100కుపైగా బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిందన్నారు.

ఇరాన్‌ ఆపరేషన్‌ సక్సెస్‌.. 

ఇరాన్‌ పార్లమెంట్‌లో సంబురాలు..

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ బలాబలాలు ఇలా..

ఇరాన్​, ఇజ్రాయెల్ దాడులపై స్పందించిన భారత్‌..
ఇజ్రాయెల్‌పై దాడుల నేపథ్యంలో భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రాంతంలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లడంపై ఆందోళన వ్యక్తపరిచింది. ఈ సందర్భంగా 'తక్షణమే ఇరు పక్షాలు వెనక్కు తగ్గాలని, సంయమనం పాటించాలని, హింస నుంచి వెనుదిరిగి, దౌత్య మార్గానికి తిరిగిన రావాలని పిలుపునిస్తున్నాం. మేము పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఆయా దేశాల్లో ఉన్న భారతీయులతో మా రాయాబార కార్యాలయాలు టచ్​లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వం ఉండేలా చూడటం చాలా ముఖ్యం' అని భారత్​ విదేశాంగ శాఖ పేర్కొంది. 

అప్రమత్తమైన యూకే..
ఇజ్రాయెల్​పై ఇరాన్ దాడి నేపథ్యంలో యూకే అప్రమత్తమైంది. దాడులను నిరోధించడానికి ఎయిర్​ఫోర్స్ జెట్​లు, ఎయిర్ రీఫ్యూయలింగ్ ట్యాంకర్​లను సిద్ధం చేసింది. మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న హెజ్​బొల్లా గ్రూపు ఇజ్రాయెల్ రక్షణ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని డజన్ల కోద్దీ రాకెట్లను ప్రయోగించింది.

ఇజ్రాయెల్‌పై దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ ఖండించారు. ప్రపంచం మరో యుద్ధాన్ని భరించే స్థితిలో లేదని తేల్చిచెప్పారు. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలన్నారు. ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.

ఐరాస చార్టర్‌లోని ఆర్టికల్‌ 51 ప్రకారమే తాము దాడి చేసినట్లు తెలిపింది. మళ్లీ ఇజ్రాయెల్‌, అమెరికాలు తమపై దాడులు చేస్తే మాత్రం ఈసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్‌ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇరాన్‌ జాతీయ జెండాలు పట్టుకుని రహదారులపై ర్యాలీలు నిర్వహించారు.


ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు మొదలయ్యాయి. దాదాపు రెండు వందలకుపైగా డ్రోన్స్‌, మిస్సైల్స్‌ను ఇరాన్‌ ప్రయోగించింది. దీంతో, రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇక, ఇరాన్‌ దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. 

కాగా, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు ప్రారంభించింది. ఆకాశంలో ఇజ్రాయెల్‌వైపుగా రెండు వందలకుపైగా డ్రోన్స్‌, మిస్సైల్స్‌ను ప్రయోగించినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వెల్లడించింది. ఇక, ఈ డ్రోన్స్‌ ఇజ్రాయెల్‌ గగనతలంలోకి రాగానే సైరన్‌ శబ్ధంతో అట్టుడుకుపోయింది. అయితే, వీటిల్లో కొన్నింటిని సిరియా లేదా జోర్డాన్‌ మీదుగా ఇజ్రాయెల్‌ కూల్చివేసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, లెబనాన్‌, ఇరాక్‌ తమ గగనతలాన్ని మూసివేశాయి. ఈ క్రమంలో సిరియా, జోర్డాన్‌ తమ వైమానిక దళాలను అప్రమత్తం చేశాయి. ఇరాన్‌లో డ్రోన్‌ దాడుల్లో ఒక బాలిక గాయపడినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా.. ఇరాన్‌ నుంచి వచ్చే డ్రోన్స్‌ ఇజ్రాయెల్‌కు రావడానికి గంటల కొద్దీ సమయం పడుతుందిని వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. మరోవైపు.. ఇరాన్‌ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దేశానికి సమీపంగా క్షిపణి విధ్యంసక యుద్ధ నౌకలను మోహరించింది.


ఇజ్రాయెల్‌ నౌకలో భారతీయులు..
మరోవైపు.. 17 మంది భారతీయ నావికులు ఉన్న ఇజ్రాయెల్‌ కంటైనర్‌ షిప్‌ను ఇరాన్‌ పారామిలటరీ రివల్యూషనరీ గార్డు కమాండోలు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పర్షియన్‌ గల్ఫ్‌లోని హొర్మూజ్‌ జలసంధిలో ఈ ఘటన జరిగింది. నౌకను ప్రస్తుతం ఇరాన్‌ జలాల వైపు మళ్లిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఎంఎస్సీ ఏరీస్‌ అనే పేరున్న ఈ నౌకపై పోర్చుగీస్‌ జెండా ఉంది. 

ఇది ఇజ్రాయెల్‌లోని జొడియాక్‌ గ్రూప్‌నకు చెందిన నౌక. ఇరాన్‌ కమాండోలు సోవియట్‌ కాలం నాటి మిల్‌ ఎంఐ–17 హెలికాప్టర్‌ నుంచి తాడు సహాయంతో నౌకపై దిగిన  దృశ్యాలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇరాన్‌ కమాండోల దుశ్చర్యపై ఇజ్రాయెల్‌ తీవ్రంగా స్పందించింది. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చవద్దని హెచ్చరించింది. ఇరాన్‌ కమాండోలు స్వాధీనం చేసుకున్న కంటైనర్‌ నౌకలో ఉన్న 17 మంది భారతీయ నావికుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని భారత వర్గాలు తెలిపాయి. దౌత్యమార్గాల్లో ఇరాన్‌ను అధికారులను సంప్రదిస్తున్నామని పేర్కొన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement