రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఓవైపు ఉక్రెయిన్‌పై ఆధిపత్యం కోసం మాస్కో దళాలు క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు రష్యా సైన్యాలను ధీటుగా ఎదుర్కొంటూనే సమయం చిక్కినప్పుడల్లా ప్రత్యర్థి దేశంపై బాంబుల దాడికి దిగుతోంది ఉక్రెయిన్.. తాజాగా రష్యా ఆక్రమిత ప్రదేశాలపై ఉక్రెయిన్ తన ప్రతాపం చూపించింది.
రష్యా ఆధీనంలో ఉన్న ఖర్కీవ్ ప్రాంతంలో డ్రాగన్ డ్రోన్లతో థర్మైట్ బాంబులను ఉక్రెయిన్ జారవిడిచింది. కొన్ని రష్యన్ సైనిక స్థావారాలను లక్ష్యంగా చేసుకొని నిప్పుల వర్షం కురిపించింది. దీంతో స్థానికంగా ఉన్న కొన్ని వందలాది చెట్లు కాలి బూడిదయ్యాయి. . రష్యా మిలటరీకి చెందిన కొన్ని వాహనాలు కూడా ధ్వంసమైనట్లు సమాచారం.
అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ.. ఖోర్న్ గ్రూప్ పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ ఈవీడియోలను బయటపెట్టింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటి ద్వారా చాలా తక్కువ ఎత్తులో నుంచి ఓ డ్రాగన్ డ్రోన్ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
The Ukrainian military began using the Dragon drone, which burns the area underneath with thermite 🥰🥰🥰 Thermite is a mixture of burning granules of iron oxide and aluminum. About 500 grams of thermite mixture can be placed under a standard FPV drone. The chemical reaction is… pic.twitter.com/3XIzc3LLHN
— Anastasia (@Nastushichek) September 5, 2024
అత్యంత ప్రమాదకరమైన థర్మైట్ బాంబులు..
థర్మైట్ బాంబులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలుగా పరిగణిస్తారు. అల్యూమినియం పొడి, ఐరన్ ఆక్సైడ్ కలిసిన ఈ థర్మైట్ బాంబులు అత్యధికంగా 2500 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి.
ఇవి చెట్లు, కోటలే కాకుండా ఇనుప లోహాలను, సైతం ఇవి క్షణాల్లో కరిగించగలవు. 2023లో రష్యా కూడా ఉక్రెయిన్ పట్టణం వుహ్లెదర్‌పై ఈ థర్మైట్ బాంబులను ఉపయోగించింది. అయితే వీటిని జనాలు, సైన్యం నివసించే ప్రాంతాల్లో వీటిని జారవిడిస్తే పెనువిపత్తు సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment