రష్యా ఆయిల్‌ టెర్మినల్‌పై ఉక్రెయిన్ డ్రోన్‌ దాడి Ukrainian drone attacks on Russian oil refineries and infrastructure. Sakshi
Sakshi News home page

రష్యా ఆయిల్‌ టెర్మినల్‌పై ఉక్రెయిన్ డ్రోన్‌ దాడి

Jun 19 2024 7:22 AM | Updated on Jun 19 2024 9:23 AM

Ukrainian drone attacks on Russian oil refineries

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ రష్యాలోని   ఆయిల్‌ రిఫైనరీలను టార్గెట్‌ చేస్తూ దాడులకు దిగుతోంది.  మరోసారి ఉక్రెయిన్‌  రష్యా ఆయిల్‌ టెర్మినల్‌పై డ్రోన్‌ దాడి చేసింది. దాడి జరిగిన విషయాన్ని రష్యా, ఉక్రెయిన్‌ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఆయిల్‌ ట్యాంక్‌లే లక్ష్యంగా  రష్యాలోని దక్షిణ పోర్టు అజోవ్‌లో ఉన్న ఆయిల్‌  టెర్మినల్‌పై దాడి చేయటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 

భారీగా చెలరేగిన మంటలను అదుపు చేసినట్లు రష్యా మినిస్ట్రీ ఆఫ్‌ ఎమర్జెన్సీ తెలిపింది. మంగళవారం జరిగిన ఆయిల్‌ రిఫైనరీ దాడిలో.. పలు ట్యాంకుల్లో మెథనాల్‌ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే  ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారలు తెలిపారు. ఇక.. తామె ఈ డ్రోన్‌ దాడులు చేసినట్లు సెక్యూరిటీ సర్వీస్‌ ఆఫ్‌ ఉక్రెయిన్‌ పేర్కొంది. అజోవ్‌ పోర్టు సమీపంలో రెండు  ఆయిల్‌ టెర్మినల్స్‌ ఉన్నాయి. ఈ రెండు ఆయిల్‌ టెర్మినల్స్‌  సుమారు 220,000 టన్నుల  ఆయిల్‌ ఉత్పత్తి చేసి 2024 జనవరి నుంచి మే వరకు  ఎగుమతి చేసింది.మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ ఉత్తర పర్యటనలో సమయంలో ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడటం గమనార్హం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement