నేడు ప్రిక్వార్టర్స్‌లో రాజస్తాన్‌తో తమిళనాడు, హరియాణాతో బెంగాల్ ‘ఢీ’
బెంగళూరు: ‘అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకుంటే ప్రతి ఒక్కరూ దేశవాళీల్లో ఆడాల్సిందే’ అని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్న మాటలను భారత ఆటగాళ్లు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో పరాజయం అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన భారత ఆటగాళ్లలో పలువురు విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్‌ల్లో పాల్గొననున్నారు.
ఈ టోర్నీలో భాగంగా గురువారం జరుగనున్న ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌తో తమిళనాడు, హరియాణాతో బెంగాల్ తలపడనున్నాయి. వీటితో పాటు ఇక మీద జరగనున్న మ్యాచ్‌ల్లో పలువురు భారత స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన ప్రసిధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, సుందర్ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడనున్నారు.
ఆ్రస్టేలియాతో సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆడిన కేఎల్ రాహుల్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. అయితే ఆ తర్వాత ఈ నెలాఖరున తిరిగి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌ల్లో రాహుల్ పాల్గొనే అవకాశం ఉంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టార్ ఆటగాళ్లు రేపటి నుంచి వారివారి రాష్ట్రాల జట్లతో కలవనున్నారు.
తమిళనాడు జట్టు విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్‌కు చేరితే స్పిన్ ఆల్‌రౌండర్ సుందర్ బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్‌లాడిన సుందర్ 114 పరుగులు చేసి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక సిడ్నీ వేదికగా కంగారూలతో జరిగిన చివరి టెస్టులో మెరుగైన ప్రదర్శన చేసిన ప్రసిధ్ కృష్ణ కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
రంజీ ట్రోఫీలో నితీశ్ రెడ్డి...
‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో అద్వితీయ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి... రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు ఆడనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోవడంతో అతడికి వన్డే టోర్నీలో ఆడే అవకాశం లేకుండా పోయింది. ఇక ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ రెండో దశలో పోటీల్లో ఆంధ్ర జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడనుంది.
వాటిలో నితీశ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నాడు. మెల్‌బోర్న్ టెస్టులో ప్రతికూల పరిస్థితుల మధ్య చక్కటి సెంచరీతో సత్తా చాటిన నితీశ్ రెడ్డి... ఈ నెల 23 నుంచి పుదుచ్చేరితో, 30 నుంచి రాజస్తాన్‌తో ఆంధ్ర జట్టు ఆడే మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నాడు. గ్రూప్ ‘బి’లో భాగంగా ఆంధ్ర జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లో మూడింట ఓడి, మరో రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని 4 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment