దంగల్ మూవీతో క్రేజ్ దక్కించుకున్న నటి సన్యా మల్హోత్రా(Sanya Malhotra). ఈ చిత్రంలో బబితా కుమారి పాత్రలో ఆడియన్స్‌ను మెప్పించింది. ఇటీవల వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన బేబీ జాన్ చిత్రంలో మెరిసింది. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కథను అందించగా.. నిర్మాత ఆయన భార్య వ్యవహరించారు. ఈ మూవీ ద్వారానే కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఇదిలా ఉండగా అయితే దంగల్ నటి సన్యా మల్హోత్రాపై నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రముఖ వాద్యకారుడు రిషబ్ రిఖిరామ్ శర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. ఇటీవల ఓ ఫోటో షూట్‌లో రిషబ్, సన్యా కలిసి ఓ అభిమానితో ఫోటోలకు పోజులిచ్చారు. ఓకే ఈవెంట్‌లో ఇద్దరు అదే వ్యక్తితో కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అవీ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట ఎంత అద్భుతంగా ఉంది.. సన్యా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని ఒకరు కామెంట్ చేశారు. 'ఇద్దరూ చాలా ప్రతిభావంతులు..మీరు డేటింగ్‌లో ఉంటే ఇంకా మంచిది' అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.
రిషబ్ రిఖిరామ్ శర్మ ఎవరంటే?
రిషబ్ రిఖిరామ్ శర్మ.. రిఖీ రామ్ కుటుంబానికి చెందిన సితార్ ప్లేయర్, సంగీత స్వరకర్త. పురాణ సితార్ వాద్యకారుల కోసం వాయిద్యాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు. అతను దిగ్గజ పండిట్ రవిశంకర్ చివరి శిష్యుడు. సితార్ ఫర్ మెంటల్ హెల్త్, ఉచిత మ్యూజిక్ థెరపీ ద్వారా మానసిక ఆరోగ్యం కోసం సెషన్స్ నిర్వహిస్తుంటారు. రిషబ్ తన ప్రదర్శనల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో అమెరికాలోని వైట్ హౌస్‌లో నిర్వహించిన మొట్టమొదటి దీపావళి వేడుకలో సోలో ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత పారిస్‌లో జరిగిన 2024 వేసవి ఒలింపిక్స్ ముగింపు వేడుకలో తన ప్రదర్శనతో భారతీయ అథ్లెట్లను అలరించాడు.
ఇక సన్యా మల్హోత్రా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సన్నీ సంస్కారీ కి తులసి కుమారి విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమాకు శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కరణ్ జోహార్ నిర్మించారు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, రోహిత్ సరాఫ్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 18, 2025న థియేటర్లలోకి రానుంది.
కాగా.. 2016లో వచ్చిన దంగల్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రముఖ రెజ్లర్ మహావీర్ పొగట్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటివరకు దంగల్ మూవీ కలెక్షన్స్‌ను ఏ సినిమా కూడా దాటలేకపోయింది. ఈ చిత్రంలో ఫాతిమా సనా షేక్, సుహానీ భట్నాగర్, జైరా వాసీం,సాక్షి తన్వర్, అపరశక్తి ఖురానా కీలక పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment