ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) మూడు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. పంత్ 12వ స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన చివరి టెస్ట్‌లో పంత్ మెరుపు అర్ద శతకం బాదాడు. ఈ ప్రదర్శన కారణంగానే పంత్ ర్యాంకింగ్ మెరుగుపడింది. బ్యాటర్ల టాప్-10లో పంత్ ఒక్కడే వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఉన్నాడు.
భారత్ నుంచి పంత్‌తో పాటు యశస్వి జైస్వాల్ టాప్-10లో ఉన్నాడు. జైస్వాల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ మాజీ సారధి కేన్ విలియమ్సన్, ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ మూడు, ఐదు స్థానాల్లో నిలిచాడు.
తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. లంక ప్లేయర్ కమిందు మెండిస్ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరాడు.
భారత్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో ఆశించినంతగా రాణించిన లేకపోయిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. తాజాగా సౌతాఫ్రికా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 12వ ప్లేస్‌కు చేరగా.. జింబాబ్వే జరిగిన రెండో టెస్ట్‌లో సూపర్ సెంచరీ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మత్ షా 26 స్థానాలు మెరుగుపర్చుకుని 26వ స్థానానికి చేరాడు.
జింబాబ్వే ఆటగాడు క్రెయిగ్ ఎర్విన్ 10 స్థానాలు మెరుగపర్చుకుని 37వ స్థానానికి చేరగా.. సౌతాఫ్రికాపై సెంచరీ చేసిన పాక్ కెప్టెన్ షాన్ మసూద్ 12 స్థానాలు మెరుగుపర్చుకుని 45వ ప్లేస్‌కు చేరాడు. పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారీ డబుల్ సెంచరీతో విరుచుకుపడిన దక్షిణాఫ్రికా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ఏకంగా 48 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ స్థానానికి చేరాడు. బ్యాటర్ల టాప్-100 ర్యాంకింగ్స్‌లో ఇవే చెప్పుకోదగ్గ మార్పులు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించి (908) అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా సారధి కమిన్స్, సౌతాఫ్రికా పేసర్ రబాడ తలో స్థానం మెరుగుపర్చుకుని రెండు, మూడు స్థానాలకు చేరారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో 10 వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ ఏకంగా 29 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ స్థానానికి చేరాడు. జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 11 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 54వ స్థానానికి ఎగబాకాడు.
భారత్ నుంచి బుమ్రాతో పాటు రవీంద్ర జడేజా టాప్-10 బౌలర్ల జాబితాలో ఉన్నాడు. జడ్డూ తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో అద్భుతంగా రాణించిన భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ 42 స్థానాలు మెరుగుపర్చుకుని 93వ స్థానానికి చేరాడు.
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా ఆటగాడు మార్కో జన్సెన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment