ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ ప్రధాన భాషగా మారింది. భారతదేశంలో కూడా హిందీతో పాటు ఇతర భాషలకన్నా ఇంగ్లీషుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఏ దేశాల్లో ఇంగ్లీషు అధికంగా మాట్లాడతారో తెలుసా? ఈ విషయంలో భారత్ ర్యాంక్ ఎంత?
ఇప్పుడున్న రోజుల్లో ఆంగ్లం అన్నిరంగాల్లో ప్రధాన భాషగా ఉంది. ఇంగ్లీషు(English)వస్తే ప్రపంచంలోని ఏ దేశానికైనా వెళ్లవచ్చని, అక్కడివారితో మాట్లాడవచ్చని అంటారు. ఇంగ్లీష్ మాట్లాడే విషయంలో భారతదేశం ప్రపంచ సగటుకు మించి ఉంది. దేశంలోని ఢిల్లీ ఆంగ్ల భాషణలో ముందంజలో ఉంది. ఈ విషయాన్ని ఒక నివేదిక వెల్లడించింది.
పియర్సన్ గ్లోబల్ ఇంగ్లిష్ ప్రొషిషియన్సీ(Pearson Global English Proficiency) నివేదిక ప్రకారం ఢిల్లీలోని ప్రజలకు ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యం ఉత్తమంగా ఉంది. రాజస్థాన్, పంజాబ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికంగా ఇంగ్లీష్ మాట్లాడేవారి విషయంలో ఢిల్లీకి 63 మార్కులు వచ్చాయి. ఆ తర్వాత రాజస్థాన్‌కు 60 పాయింట్లు, పంజాబ్‌కు 58 పాయింట్లు వచ్చాయి.
బ్రిటన్‌లో గరిష్టంగా 98.3 శాతం మందికి ఇంగ్లీషు బాగా వచ్చు. అమెరికాలో 95 శాతం మందికి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలుసు. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుండి అందిన డేటా ప్రకారం బ్రిటన్‌లోని జిబ్రాల్టర్‌లో 100 శాతం మంది ప్రజలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడతారు. ఇక్కడి జనాభా 32,669 మాత్రమే.
భారతదేశంలో 20 శాతం మంది ప్రజలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలరు. జనాభా పరంగా చూస్తే, భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వారి సంఖ్య ప్రపంచంలో టాప్ 5 దేశాలలో ఉంది. పియర్సన్స్ గ్లోబల్ ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారిలో రాజధాని ఢిల్లీ(Delhi) ముందంజలో ఉంది. కాగా చైనాలో ఇంగ్లీష్ మాట్లాడేవారి సంఖ్య చాలా తక్కువ. ఇక్కడ 0.9 శాతం మంది మాత్రమే ఇంగ్లీషులో మాట్లాడతారు. చైనీస్ ప్రజలు వారి మాతృభాషలోనే సంభాషిస్తారు. చైనాలో చైనీస్, మంగోలియన్, టిబెటన్, ఉయ్ఘర్, జువాంగ్ భాషల్లో మాట్లాడుతుంటారు.
ఇది కూడా చదవండి: Winter Travel Ideas: శీతాకాలంలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు
Comments
Please login to add a commentAdd a comment