people representatives
-
ప్రజల వద్దకే ఎల్ఎల్ఆర్ టెస్ట్
సాక్షి, కర్నూలు : రవాణా శాఖ సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఆ శాఖ అధికారులు జిల్లాలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం ఉత్తర్వుల మేరకు ఆ శాఖ కర్నూలు అధికారులు ప్రజల వద్దకు ఎల్ఎల్ఆర్ టెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సంకల్పించారు. ఇందుకు సంబంధించి తాండ్రపాడు శివారు రవాణా శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఉపకమిషనర్ బసిరెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. ఈనెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఎల్ఆర్ మేళాకు కార్యాచరణ రూపొందించారు. మొదటి రోజు ఈ నెల 18వ తేదీన కర్నూలు సి.క్యాంప్ సెంటర్, బనగానపల్లె, డోన్ పట్టణాలతోపాటు ఆదోని దగ్గర బైచిగేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామీణులంతా సద్వినియోగం చేసుకునేలా చూడాలని బసిరెడ్డి సూచించారు. గ్రామాల్లోని కామన్ సర్వీస్ సెంటర్ (పౌర సేవా కేంద్రం) వద్ద పేరు నమోదు చేసుకుని రుసుం చెల్లిస్తే నిర్ణీత తేదీల్లో రవాణా శాఖ అధికారులే గ్రామానికి వచ్చి పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అక్కడే ఎల్ఎల్ఆర్ జారీ చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధార్ కార్డు, వయసు, నివాస ధృవీకరణ పత్రాలతోపాటు ఒక వాహనానికైతే రూ.260, రెండింటికైతే రూ.410 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. -
ఎల్లలు లేని ఇఫ్తార్ సంబరం
సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : రంజాన్ పర్వదినం చేరువవుతున్న శుభతరుణాన.. భారీ ఎత్తున జరిగిన ఇఫ్తార్ ఆనందాతిశయానికి నెలవైంది. ఆధ్యాత్మిక భావన ఉప్పొంగిపోగా.. సౌభ్రాతృత్వం వెల్లువైంది. వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.హెచ్. ఫరూఖీ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ అద్భుతమనిపించింది. ఈ ఇఫ్తార్‌లో సుమారు 5 వేల మంది ముస్లిం సోదరులు పాల్గొని విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఇంత మందితో కలిసి ఇఫ్తార్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పార్టీ కార్యకర్తలకైనా, ప్రజలకైనా ఎలాంటి సమస్య ఉన్నా పార్టీ కార్యాలయానికి వచ్చి వివరిస్తే వారిని అందుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పార్లమెంట్లో మాట్లాడి వైద్యానికి అయ్యే ఖర్చు మంజూరయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు. మైనార్టీల అభివృద్ధి కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా పథకాలను ప్రవేశపెట్టారని, జగన్ సీఎం అయితే అదే తరహాలో పథకాలను అమలవుతాయని హామీ ఇచ్చారు. ముస్లిముల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ముస్లింలంతా రంజాన్‌ను సంతోషంగా చేసుకోవాలని కోరారు. ఇన్ని వేల మందికి ఇఫ్తార్ ఇచ్చిన ఫరూకీని అభినందించారు. కార్యక్రమంలో ముందు ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్ర«ధాన కార్యదర్శులు గొల్ల బాబురావు, ప్రసాద్ రాజ్, కరణం ధర్మశ్రీ , పార్లీ నగర విభాగం అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, గురువులు, రామకృష్ణ మూర్తి, తిప్పల నాగిరెడ్డి, ఉషాకిరణ్, చంద్రమౌళి, కొయ్య ప్రసాదరెడ్డి, నగర మైనార్టీ సెల్ అ«ధ్యక్షుడు షరీఫ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పక్కి దివాకర్, నాయకులు జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక చెఫ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇఫ్తార్ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక చెఫ్స్‌ను తీసుకొని వచ్చారు. వీరు తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించి వహ్వా అనిపించారు. ఇఫ్తార్ జరిగిన ప్రదేశానికి వెలుపల కూడా హలీమ్ పంపిణీ చేశారు. -
కాసులున్నా.. రోడ్లు సున్నా
మచిలీపట్నం సబర్బన్ : గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ విడుదల చేసిన కోట్లాది రూపాయలు స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగమవుతున్నాయి. నిధులు విడుదలై ఏడాది కావస్తున్నా పనులను పూర్తి చేయటంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమనే విమర్శలున్నాయి. తారు రోడ్ల అభివృద్ధికి నిధులిస్తే... మండల పరిధిలోని పెదయాదర, పోలాటితిప్ప, వాడపాలెం గ్రామాల్లో అంతర్గత రహదారులను బీటీ (తారు) రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు గతేడాది కేంద్ర ప్రభుత్వం ఎన్సీఆర్ఎంపీ, ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేసింది. పెదయాదలో రోడ్ల అభివృద్ధి నిమిత్తం ఎన్సీఆర్ఎంపీ నిధులు రూ 75 లక్షలు, పోలాటితిప్పలో ఎన్సీఆర్ఎంపీ నిధులు 75 లక్షలు, పోలాటితిప్ప గ్రామ పంచాయతీ శివారు కొత్తకాలనీలో రోడ్ల అభివృద్ధికి ఎన్సీఆర్ఎంపీ నిధుల రూ 1.16 కోట్లు, వాడపాలెంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ 45 లక్షలు మంజూరు చేసింది. మొత్తం రూ.3.10 కోట్లు వచ్చాయి. ఈ పనులను 2015 డిసెంబర్ నెలలో మంత్రి కొల్లు రవీంద్ర అట్టహాసంగా శిలాఫలకాన్ని ప్రారంభించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డుపై కేవలం డస్ట్, కంకరతో కూడిన ఒక లేయర్ పోసి పత్తా లేకుండా పోయాడు. దాదాపు ఆరు నెలలుగా పనులు ఊసేఎత్తడం లేదు. పాలకుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం రహదారుల అభివృద్ధి విషయంపై అమ్మ పెట్టనూ పెట్టదు.. అడుక్కుతిననివ్వదూ అనే మోటు సామెతలాగ ప్రభుత్వ వైఖరి ఉందని గ్రామస్తులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వడం లేదని, కేంద్రం విడుదల చేసిన నిధులనూ సద్వినియోగం చేయడం లేదని ఆరోపిస్తున్నారు. సగం వేసిన రోడ్డుపై మెనతేలిన కంకర రాళ్లు గుచ్చుకుని కాళ్లకు పుళ్లు పడుతున్నాయని, వాహనాలకు పంచర్లు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏన్నో ఏళ్లుగా మట్టి రోడ్లపైనే నడకసాగిస్తూ నరకయాతన అనుభవించిన తాము నిధులు విడుదలవగానే సంతోషించామని, పాలకుల కుటిల రాజకీయాలవల్లే రోడ్ల అభివృద్ధి నిలిచిపోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.