ఎల్లలు లేని ఇఫ్తార్‌ సంబరం | No Boundaries To Iftar Celebrations | Sakshi
Sakshi News home page

ఎల్లలు లేని ఇఫ్తార్‌ సంబరం

Published Mon, Jun 11 2018 12:29 PM | Last Updated on Mon, Jun 11 2018 12:29 PM

No Boundaries To Iftar Celebrations - Sakshi

విందుకు హాజరైన ముస్లింలు

సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : రంజాన్‌ పర్వదినం చేరువవుతున్న శుభతరుణాన.. భారీ ఎత్తున జరిగిన ఇఫ్తార్‌ ఆనందాతిశయానికి నెలవైంది. ఆధ్యాత్మిక భావన ఉప్పొంగిపోగా.. సౌభ్రాతృత్వం వెల్లువైంది. వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.హెచ్‌. ఫరూఖీ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ అద్భుతమనిపించింది. ఈ ఇఫ్తార్‌లో సుమారు 5 వేల మంది ముస్లిం సోదరులు పాల్గొని విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఇంత మందితో కలిసి ఇఫ్తార్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.  పార్టీ కార్యకర్తలకైనా, ప్రజలకైనా ఎలాంటి సమస్య ఉన్నా పార్టీ కార్యాలయానికి వచ్చి వివరిస్తే వారిని అందుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పార్లమెంట్‌లో మాట్లాడి వైద్యానికి అయ్యే ఖర్చు మంజూరయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు.

మైనార్టీల అభివృద్ధి కోసం వైఎస్‌ రాజశేఖర రెడ్డి చాలా పథకాలను ప్రవేశపెట్టారని, జగన్‌ సీఎం అయితే అదే తరహాలో పథకాలను అమలవుతాయని హామీ ఇచ్చారు. ముస్లిముల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ముస్లింలంతా రంజాన్‌ను సంతోషంగా చేసుకోవాలని కోరారు. ఇన్ని వేల మందికి ఇఫ్తార్‌ ఇచ్చిన ఫరూకీని అభినందించారు. కార్యక్రమంలో ముందు ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలు చేశారు. జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కావాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్ర«ధాన కార్యదర్శులు గొల్ల బాబురావు, ప్రసాద్‌ రాజ్, కరణం ధర్మశ్రీ , పార్లీ నగర విభాగం అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, గురువులు, రామకృష్ణ మూర్తి, తిప్పల నాగిరెడ్డి, ఉషాకిరణ్, చంద్రమౌళి, కొయ్య ప్రసాదరెడ్డి, నగర మైనార్టీ సెల్‌ అ«ధ్యక్షుడు షరీఫ్, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పక్కి దివాకర్, నాయకులు జాన్‌ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.


హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక చెఫ్స్‌
ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇఫ్తార్‌ కోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక చెఫ్స్‌ను తీసుకొని వచ్చారు. వీరు తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించి వహ్వా అనిపించారు. ఇఫ్తార్‌ జరిగిన ప్రదేశానికి వెలుపల కూడా హలీమ్‌ పంపిణీ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement