హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక స్టార్ స్పిన్నర్ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. కివీస్ ఇన్నింగ్స్ 35 ఓవర్‌లో ఆఖరి రెండు బంతులకు వరుసగా రెండు వికెట్లు తీసిన మహేశ్ తీక్షణ.. ఆ తర్వాత 37వ ఓవర్ తొలి బంతికి మరో వికెట్ పడగొట్టి వన్డేల్లో తన తొలి హ్యాట్రిక్‌ను అందుకున్నాడు.
న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్‌ను తొలుత ఔట్ చేసిన ఈ లంక మిస్టరీ స్పిన్నర్.. ఆ తర్వాత వరుసగా నాథన్ స్మిత్, మాట్ హెన్రీని ఔట్ చేసి ఈ మైలు రాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 8 ఓవర్లు బౌలింగ్ చేసిన తీక్షణ 44 పరుగులిచ్చి 4 వికెట్లను పడగొట్టాడు.
కాగా ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(79) టాప్ స్కోరర్‌గా నిలవగా.. చాప్‌మన్(62), మిచెల్(38) పరుగులతో రాణించారు.
లంక బౌలర్లలో తీక్షణతో పాటు హసరంగా రెండు, మలింగ, ఫెర్నాండో తలా వికెట్ సాధించారు. లక్ష్య చేధనలో శ్రీలంక పోరాడుతోంది. 26 ఓవర్లు ముగిసే సరికి లంక 7 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో కమిందు మెండిస్(63) పరుగులతో ఉన్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు సాధించిన తీక్షణ ఓ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో హ్యాట్రిక్ సాధించిన ఏడో శ్రీలంక బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో శ్రీలంక దిగ్గజ బౌలర్ చమిందా వాస్ ఉన్నాడు. 2001లో జింబాబ్వేపై వాస్ తొలిసారి హ్యాట్రిక్ సాధించాడు. తర్వాత 2003లో బంగ్లాదేశ్‌పై వాస్ మరో హ్యాట్రిక్ నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment