నెల్సన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరీరా విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో పెరీరా అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కుశాల్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. పెరీరా కేవలం 46 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఈ వెటరన్ క్రికెటర్‌కు ఇదే తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీ. అదే విధంగా 2025 ఏడాదిలో తొలి అంతర్జాతీయ సెంచరీ కుశాల్ బ్యాట్ నుంచి వచ్చినదే కావడం విశేషం. ఇక అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.
అతడితో పాటు కెప్టెస్ అసలంక(24 బంతుల్లో 46 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కివీస్ బౌలర్లలో ఫోల్క్స్, శాంట్నర్, మిచెల్, హెన్రీ, ఢపీ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన పెరీరా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
తొలి శ్రీలంక ప్లేయర్‌గా
👉14 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ టీ 20ల్లో సెంచరీ బాదిన తొలి శ్రీలంక బ్యాటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా, జయవర్ధనే (2010), దిల్షాన్ (2011) తర్వాత అతి తక్కువ ఫార్మాట్‌లో సెంచరీ కొట్టిన మూడో శ్రీలంక బ్యాటర్‌గా నిలిచాడు. చివరగా తిలకరత్నే దిల్షాన్(2011) టీ20ల్లో లంక తరపున సెంచరీ చేశాడు. మళ్లీ ఇప్పుడు పెరీరా ఈ ఫీట్ నమోదు చేశాడు.
👉అదే విధంగా అంతర్జాతీయ టీ20ల్లో 2000 పరుగులు మైలు రాయిని అందుకున్న తొలి శ్రీలంక బ్యాటర్‌గా కుశాల్ చరిత్ర సృష్టించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 77 టీ20 మ్యాచ్‌ల్లో 134.11 స్ట్రైక్ రేట్‌తో 2056 పరుగులు చేశాడు. ఈ జాబితాలో పెరీరా తర్వాత కుశాల్ మెండిస్ ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment