శ్రీలంక ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్‌.. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్‌ ఫిప్టి | Kusal Perera smashes 22 ball half-century in NZ vs SL match | Sakshi
Sakshi News home page

World cup 2023: శ్రీలంక ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్‌.. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్‌ ఫిప్టి

Published Thu, Nov 9 2023 3:38 PM | Last Updated on Thu, Nov 9 2023 5:30 PM

Kusal Perera smashes 22 ball half-century in NZ vs SL match - Sakshi

వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌పై శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరెరా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కివీస్‌ బౌలర్లపై పెరెరా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్‌ ఫిప్టి చేసిన ఆటగాడిగా పెరీరా నిలిచాడు.

కాగా ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ పేరిట ఉండేది. ఈ మెగా టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హెడ్‌ కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. తాజా మ్యాచ్‌తో హెడ్‌ రికార్డును కుశాల్‌ బద్దలు కొట్టాడు.

ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 51 పరుగులు చేసిన పెరీరా.. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 19 ఓవర్లలో కేవలం 105 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్‌ బౌలర్లలో ఇప్పటివరకు ట్రెంట్‌  బౌల్ట్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్‌ రెండు, సౌథీ, ఫెర్గూసన్‌ తలా వికెట్‌ సాధించాడు.
చదవండి: అందుకే కోహ్లిని ప్రతిసారి ‘సెల్ఫిష్‌’ అంటున్నావా?: పాక్‌ మాజీ కెప్టెన్‌కు కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement