ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్(Newzeland(తో జరిగిన మూడో వన్డేలో 140 పరుగుల తేడాతో శ్రీలంక(Srilanka) ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ వైట్ వాష్ నుంచి లంక తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
శ్రీలంక బ్యాటర్లలో నిస్సాంక(66) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కుశాల్ మెండిస్(54), లియాంగే(53), కమిందు మెండిస్(46) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ శాంట్నర్ రెండు, నాథన్ స్మిత్, బ్రెస్‌వెల్ తలా వికెట్ సాధించారు.
నిప్పులు చెరిగిన లంకేయులు..
అనంతరం 291 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను లంక బౌలర్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. అసితా ఫెర్నాండో, తీక్షణ, మలింగ దాటికి న్యూజిలాండ్ కేవలం 22 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆ సమయంలో మార్క్ చాప్‌మన్ కివీస్‌ను అదుకునే ప్రయత్నం చేశాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి చాప్‌మన్ మాత్రం బౌండరీలు బాదుతూ కివీస్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. లంకేయులపై కౌంటర్ ఎటాక్ దిగిన చాప్‌మన్ ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు.
దీంతో లక్ష్య చేధనలో బ్లాక్ క్యాప్స్ 150 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో చాప్‌మన్(81 బంతుల్లో 81, 10 ఫోర్లు, ఒక సిక్స్) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. లంక బౌలర్లలో అసితా ఫెర్నాండో,తీక్షణ, మలింగ తలా మూడు వికెట్లు సాధించారు.
మూడు వికెట్లతో సత్తాచాటిన అసితా ఫెర్నాండోకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన న్యూజిలాండ్ సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ఈ సిరీస్ అసాంతం అద్బుత ప్రదర్శన కనబరిచిన మాట్ హెన్రీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా అంతకంటే ముందు కివీస్‌తో టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో లంక కోల్పోయింది. ఇక శ్రీలంక తమ తదుపరి సిరీస్‌లో ఆస్ట్రేలియాతో రెండు టెస్టులు ఆడనుంది.
చదవండి: రవీంద్ర జడేజా రిటైర్మెంట్..! హింట్ ఇచ్చిన స్టార్ ఆల్‌రౌండర్
Comments
Please login to add a commentAdd a comment