ఒట్టావా: కెనడా (canada)ను అమెరికా(usa)లో విలీనం చేసేందుకు ఆర్థిక శక్తిని ఉపయోగిస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ (donald trump) చేసిన వ్యాఖ్యలకు కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (justin trudeau) స్పందించారు. ఆ పప్పులేం ఉడకవు అంటూ పరోక్షంగా హెచ్చరించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం తర్వాత ట్రంప్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చేయాలంటూ తన మాటలతో కవ్విస్తున్నారు. ఇప్పుటికే ఇదే అంశంపై పలు మార్లు సోషల్ మీడియాలో ప్రస్తావనకు తెచ్చారు. ఓ సందర్భంలో జస్టిన్ ట్రూడో మాట్లాడారు. ట్రూడో మాత్రం ఆశించిన స్థాయిలో ట్రంప్‌కు బదులివ్వలేకపోయారు.
ఒక్కసారి ఆలోచించండి
అయితే ఇటీవల అధికార లిబరల్ పార్టీకి, ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్లు ట్రూడో ప్రకటించారు. ఈ తరుణంలో ఫ్లోరిడా మార్ ఎ లాగో హోమ్‌లో విలేకరుల సమావేశంలో ట్రంప్ కెనడా గురించి తన మనసులో మాట భయటపెట్టారు. ‘మీకు మీరుగా గీసిన గీతను చెరిపేయండి. అమెరికాకు కెనడా రాష్ట్రంగా అవతరిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ నిర్ణయం జాతీయ భద్రతకు కూడా మంచిది’ అని అన్నారు.
There isn’t a snowball’s chance in hell that Canada would become part of the United States.
Workers and communities in both our countries benefit from being each other’s biggest trading and security partner.— Justin Trudeau (@JustinTrudeau) January 7, 2025
ఇది చాలా అన్యాయం
దీంతో పాటు సైన్యంపై కెనడా పెట్టే ఖర్చుపై ఆందోళన వ్యక్తం చేశారు. కెనడాకు తగినంత సైన్యం లేదు. సైన్యం కోసం మా మీద ఆధారపడతారు. అంతా బాగానే ఉంది. కానీ, మా సైన్యం ఉపయోగించుకున్నందుకు కెనడా మాకు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఇది చాలా అన్యాయం కదా అంటూ మాట్లాడారు.
ఆర్థిక శక్తిని ఉపయోగిస్తా
ఆ సమయంలో కెనడాను అమెరికా రాష్ట్రంగా మార్చేందుకు మీరు సైన్యాన్ని ఉపయోగిస్తారా? అన్న ప్రశ్నకు లేదు..లేదు.. ఆర్థిక శక్తిని ఉపయోగిస్తానంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై కెనడా మాజీ ప్రధాని ట్రూడోతో పాటు, అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్థిక శక్తిని ఉపయోగించి దేశాల్ని విలీనం చేసే అవకాశం లేదని ట్రూడో సూచించారు. మన రెండు దేశాల్లోని కార్మికులు, సంఘాలు ఒకరికొకరు అతిపెద్ద వాణిజ్యం, భద్రతా భాగస్వామిగా ఉండటం వల్ల ప్రయోజనం పొందుతాయి’అనే అభిప్రాయ పడ్డారు.
ట్రూడోకు మద్దతుగా కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ నిలిచారు. డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల నుంచి కెనడా వెనక్కి తగ్గబోదని, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. మా ప్రజలే మా బలవంతులు. బెదిరింపుల నేపథ్యంలో మేం ఎప్పటికీ వెనక్కి తగ్గం’ అని ట్రంప్‌ను హెచ్చరించారు.
👉చదవండి : అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా: ట్రంప్
Comments
Please login to add a commentAdd a comment