ఆరు జనరేటర్లతో కొనసాగుతున్న విద్యుదుత్పాదన
శ్రీశైలం ప్రాజెక్టు:
శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో మొత్తం ఆరు జనరేటర్లతో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతోంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 5 జనరేటర్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఒక జనరేటర్‌తో విద్యుత్ ఉత్పాదన చేస్తూ దిగువ నాగార్జునసాగర్‌కు 28,319 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి 16వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 47.5230 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 828 అడుగులకు చేరుకుంది.