విద్యుదుత్పత్తికి అంతరాయం
ముంచంగిపుట్టు : ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ఆరో నంబర్ జనరేటర్‌లో సాంకేతిక లోపంతో 23 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఇక్కడ 74 మెగావాట్లకు విద్యుదుత్పత్తి పడిపోయింది. ఇక్కడి ఆరు జనరేటర్లతో 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అయ్యేది. అయిదో నంబర్ జనరేటర్ ఆరు నెలల క్రితం మూలకు చేరింది. నాటి నుంచి 1,2,3,4,6 నంబర్ల జనరేటర్లతో 97 మెగావాట్ల విద్యుత్ ఉత్పతి అవుతోంది.
ఈ క్రమంలో శనివారం రాత్రి ఆరో నంబర్ జనరేటర్‌కు సంబంధించిన గవర్నర్‌లో సాంకేతిక లోపం తలేత్తడంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీనిని వినియోగంలోకి తేవడానికి సిబ్బంది ఆది, సోమవారాలు శ్రమించినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రస్తుతం 1,2,3,4 నంబర్ల జనరేటర్లతో 74 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు.