ఇదో అద్భుతమైన ట్రెడ్‌ మిల్‌: బరువు తగ్గడం ఖాయం | Treadmill works without power Amazing says TS minister KTR | Sakshi
Sakshi News home page

Amazing Treadmill: అద్భుతం, బరువు తగ్గడం ఖాయమే?!

Published Fri, Mar 18 2022 3:37 PM | Last Updated on Fri, Mar 18 2022 4:29 PM

Treadmill works without power Amazing says TS minister KTR - Sakshi

బుర్ర ఉండాలేగానీ నూతన ఆవిష్కరణలకు కొదవ ఉండదు. తాజాగా ఒక వ్యక్తి పవర్‌ అవసరం లేకుండా నడిచే  ఒక ట్రెబ్‌మిల్‌ను రూపొందించారు.  చెక్కపలకల సాయంతో విద్యుత్‌ అవసరం లేకుండానే  పనిచేసేలా రూపొందించారు. ఈ ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నపుడు దానికి అమర్చిన ప్రత్యేక  స్ప్పింగుల  ద్వారా దానికదే రోల్‌ అవ్వడం దీని స్పెషాల్టీ. దీన్ని చూసిన నెటిజన్లు వావ్‌..వాట్‌ ఏ ఇన్నోవేషన్‌ అంటూ అభినందిస్తున్నారు.

అలాగే తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ దృష్టిని కూడా ఈ మెషీన్‌ ఆకర్షించింది. దీన్ని పరిశీలించి, సాయం చేయాల్సిందిగా టీఎస్‌ వర్క్స్‌ హైదరాబాద్‌  ట్విటర్‌ హ్యాండిల్‌కి ట్యాగ్‌ చేశారు కేటీఆర్‌. దీన్ని మరింత మెరుగుపర్చడం అవసరమని ఒక యూజర్‌, ఇలాంటి ఐరన్‌తో స్పింగులతో ఒకటి చూశానని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ ట్రెడ్‌మిల్‌ను ఒకసారి చూడండి అంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రకు విజ్ఞప్తి చేయడం విశేషం. మరి ఆ అద్భుతం ఏంటో మీరు చూసేయండి ఒకసారి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement