Treadmill
-
ఇలాంటి జిమ్ సెంటర్లకి వెళ్లకపోవడమే మేలు...!
ఇటీవల ఫిట్నెస్ మీద దృష్టిసారిస్తోంది యువత. అందుకోసమని యోగా, ఏరోబిక్, జిమ్ వంటి పలు రకాల సెంటర్లకి వెళ్లి మరీ వర్కౌట్లు చేస్తున్నారు. అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే.. ఆ జిమ్ సెంటర్ ఫేమస్? కాదా అన్నది చూస్తారు గానీ ఆ సెంటర్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది గమనించారు. పాపం అలానే ఇక్కడొక మహిళ జిమ్ సెంటర్ పరిస్థితిని గమనించకపోవడంతో ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది.వివరాల్లోకెళ్తే..ఇండోనేషియాలోని జిమ్‌లో 22 ఏళ్ల మహిళ మూడో అంతస్తులో ఉన్న ట్రెడ్‌మిల్‌పై నుంచి జారిపడి.. నేరుగా కిటికిలోంచి కిందపడి దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం ఇండోనేషియాలోని కాలిమంటన్‌లోని పోంటియానాక్లో జూన్ 18న చోటు చేసుకుంది. ఆ మహిళ ట్రెడ్మీల్పై నడుస్తూ ఉండగా అనూహ్యంగా బ్యాలెన్స్ కోల్పోయింది. అయితే వెనుక ఎంతో మేర ప్రదేశం లేకపోవడం ..దీనికి తగ్గట్టు అక్కడ ఉన్న గోడ మాదిరి అద్దంలాంటి విండో తెరిచి ఉండటంతో వెంటనే నేరుగా పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అయక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదం ఆమె తన ప్రియుడితో కలిసి జిమ్ చేసేందుకు వచ్చినప్పుడూ చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియ పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా..ట్రెడ్‌మిల్‌కి కిటికి మధ్య దూరం కేవలం 60 సెంటిమీటర్ల దూరం ఉన్నట్లు తేలింది. పోస్ట్‌మార్టం రిపోర్టు కూడా తలకు తీవ్ర గాయలవ్వడంతోనే మృతి చెందిదని పేర్కొంది. నిజానికి ట్రెడ్‌మిల్‌పై ఎవరైనా కిందపడిపోవటం కామన్ అని, అయితే తగురీతిలో అక్కడ భద్రత లేకపోవడమే బాధకరమని అన్నారు ఇండోనేషియా పోలీసులు.అలాగే సదరు జిమ్ యజామనిని ఇలా ఎందుకు ఏర్పాట్లు చేశారని ప్రశ్నించగా..అద్దానికి వ్యతిరేకంగా చేస్తే దృష్టి మరలదని ఇలా ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. అలాగే విండోలు క్లోజ్ చేసేలా వ్యక్తిగత పర్యవేక్షకులు పరివేక్షిస్తుంటారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడూ ఒకరూ లీవ్‌లో ఉండటంతోనే ఇది జరిగిందని చెప్పాడు సదరు యజమాని. ప్రస్తుతం పొలీసులు సదరు జిమ్ నిర్వహణ అనుమతిపై కూడా విచారణ చేపడుతున్నారు.(చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జాన్వీ స్టైలిష్ లుక్..గజగామిని మాదిరి..!) -
ట్రెడ్మిల్ వర్సెస్ వాకింగ్: ఏది బెటర్?
వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ట్రెడ్మిల్ కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. సమతుల్య వ్యాయామ నియమావళిలో భాగంలో ఏ వ్యాయామం బెటర్‌గా ఉంటుందనే ప్రశ్న అందరికి వచ్చే కామన్ సందేహం. ఈ విషయంలో ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే.నడక అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వ్యాయామానికి సంబంధించిన అత్యంత సులభమైన వర్కౌట్. ఇది అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా గుండెజబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు, టైప్2 డయాబెటిస్ వంటి వివిధ సమస్యలను ఎదుర్కొనడంలో సహాయపడుతుంది. శారీరక ప్రయోజనాలే కాకుండా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతేగాదు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మరి ఇలాంటి ప్రయోజనాలు ట్రెడ్‌మిల్‌పై నడిచినా లభిస్తున్నాయి కదా మరీ రెండింటిలో ఏది బెటర్ అనే సందేహం అందిరిలో మెదిలే ప్రశ్న. రెండు కూడా శరీరానికి మంచి ప్రయోజనాలే అందిస్తాయి. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటే బెస్ట్ అంటే..ట్రెడ్‌మిల్‌పై నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు..ట్రెడ్‌మిల్‌పై నడవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వైద్యులు ఏమంటున్నారంటే..నియంత్రిత వాతావరణంలో ట్రెడ్‌మిల్‌పై నడవడం జరుగుతుంది. వర్షం, మంచు లేదా వేడి వాతావరణాల్లో బయటకు రానివాళ్లకు, లేదా పడనివాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. అదీగాక ఆధునిక ట్రెడ్మిల్లు వివిధ సెట్టింగులతో వస్తున్నాయి. ఇవన్నీ మంచి వర్కౌట్లకు అనుగుణంగా ఉన్నాయి. శరీరానికి తగిన వ్యాయామం లభించినట్లు అవుతోంది కూడా. ట్రెడ్మిల్లు కుషన్డ్ ఉపరితలాలు కలిగి ఉంటాయి. అందువల్ల బహిరంగ ఉపరితలాలపై నడవడం కంటే దీనిపై నడవడం వల్ల కీళ్లకు మేలు చేస్తాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్లకు లేదా ఆర్థోపెడిక్ సర్జరీల నుంచి కోలుకుంటున్న వారికి ఈ ఫీచర్ కీలకం.ముఖ్యంగా భద్రత ఉంటుంది. ఇంటిలోపలే ట్రెడ్‌మిల్‌పై నడవడం వల్ల ట్రాఫిక్ వంటి సమస్యలు ఎదురవ్వవు. ఎలాంటి ప్రమాదాలు ఎదురుకావు. ఆరుబయట నడవడం వల్ల కలిగే లాభాలు..ఆరుబటయ నడవడం వల్ల సహజమైన వాతావరణ వైవిధ్యం లభిస్తుంది. శరీరానికి ఆహ్లాదం తోపాటు చక్కటి వ్యాయామం లభిస్తుంది. తాజాగాలి, సూర్యకాంతి, ప్రకృతికి బహిర్గతం అవుతాం. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పచ్చటి ప్రదేశాల్లో నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మానసిక స్థితి మెరుగుపడుతుంది. మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బహిరంగంగా నడవడం వల్ల మన చుట్టు ఉన్నవాళ్లతో పరిచయాలు ఏర్పడతాయి. చక్కటి సామాజిక సంబంధాలు మానసిక ఉత్సాహాన్ని అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే బయట నడవడం వల్ల ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఏది మంచిదంటే..ట్రెడ్మిల్ లేదా ఆరుబయట నడవడం అనేది వ్యక్తిగత పరిస్థితులు, ప్రాధాన్యత ఆధారంగా ఇది నిర్ణయించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భద్రతా సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ట్రెడ్మిల్ మంచిదని, ప్రకృతితో సాన్నిత్యం కోరుకునేవారికి, మానసిక ఆరోగ్యం కోసం అయితే బహిరంగంగా వాకింగ్ చేయడం సరియైనదని నిపుణులు సూచిస్తున్నారు.(చదవండి: రక్తదానం చేయడం మంచిదేనా? ఏడాదికి ఎన్నిసార్లు చెయ్యొచ్చు..) -
జిమ్‌లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగ..పాపం..! ఇలా వర్క్ట్లు..
ఓ దొంగ జిమ్‌లో చోరీ చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. ఏదో పట్టుకుపోదామనుకుని వచ్చి ఇలా దొరికిపోతానని ఊహించని దొంగను యజమాని ఏం చేశాడో వింటే షాకవ్వుతారు. పట్టుబడిన ఆ దొంగకు జిమ్ యజమాని ఎవ్వరూ ఊహించని ఓ శిక్ష వేసి మరీ పోలీసులకు అప్పగించాడు. ఇంతకీ ఆ జిమ్ యజమాని ఏం చేశాడంటే..ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో చోటు చేసుకుంది. ఓ దొంగ జిమ్ సెంటర్లోకి వెళ్లి చోరీ చేయాలని అనుకున్నాడు. అక్కడ ఉన్న షట్టర్‌ని ఏదో విధంగా ఓపెన్ చేసి లోపలకి వెళ్లి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో ఇంట్లో ఉన్న జిమ్ యజమానికి అర్థరాత్రి హఠాత్తుగా మెలుకువ వచ్చి ఫోన్ చెక్ చేసుకుంటాడు. జిమ్ సెంటర్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా..అక్కడ ఓ దొంగ పచార్లు కొడుతున్నట్లు కనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా జిమ్‌కి వెళ్లి ఆ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు యజమాని. దీంతో భయాందోళనకు గురైన దొంగ ఏం చేయాలో తోచక బిత్తరచూపులు చూశాడు. అయితే ఆ జిమ యజమాని దొంగని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తమంటూ శిక్ష విధించి మరీ పోలీసులకు అప్పగించాడు. పాపం దొంగలించడానికి వచ్చి ఇలా వర్క్ట్లు చేసి మరీ జైలుకి వెళ్తానని ఊహించి ఉండడు కదా..!. ఇలాంటి ఫన్నీ ఘటనే గతవారం ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగింది. ఓ దొంగ దొంగతనం చేయడానికి చవ్చి ఏసీ ఆన్ చేసుకుని మరీ నేలపై ప్రశాంతగా నిద్రపోయాడు. కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ పోలీసులు ఉండటంతో కంగుతిన్నాడు. అతడు మద్యం మత్తులో ఉండటంతో ఇలా నిద్రపోయాడని పోలీసులు చెప్పారు. (చదవండి: ద్రౌపది ముర్ము మోదీకి దహీ-చీనీని తినిపించడానికి రీజన్! ఏంటీ స్వీట్ ప్రాముఖ్యత) -
కన్నబిడ్డపై తండ్రి కర్కశం, ప్రాణం పోయే దాకా : తల్లడిల్లిన తల్లి
బిడ్డలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు. మానసికంగా, శారీరంగా బలహీనంగా ఉన్నా, లోపాలతో పుట్టినా అపూరూపంగా సాదుకుంటారు. కానీ ఒక తండ్రి శాడిస్ట్‌లా ప్రవర్తించాడు. లావుగా ఉన్నాడంటు కన్న కొడుకు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తండ్రి క్రూరత్వంగా ఆరేళ్ల బాలుడిని పొట్టనపెట్టుకున్నాడు. అమెరికాలోని న్యూజెర్సీలోని ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన వివరాలు..న్యూజెర్సీలో నివసించే క్రిష్టోపర్ గ్రెగర్ ఆరేళ్ల తన కుమారుడు కోరీ కొంచెం బొద్దుగా ఉండటంతో జిమ్‌కు తీసుకెళ్లాడు. కుమారుడితో ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తించాడు. బలవంతంగా ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తించడంతో బాలుడు పరిగెత్త లేకపోయాడు. పదే పదే కిందపడిపోయాడు. అయినా ఏమాత్రం కనికరం లేకండా కర్కశంగా ప్రవర్తించాడు. క్రిష్టోపర్. ఉన్మాదిలో మారి మళ్లీ మళ్లీ ఒత్తిడి చేసి, చాలా వేగంగా కదులుతున్న ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తించాడు. దీంతో కోరీ డస్సి పోయి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మాటలు తడబడటం, సంయమనం కోల్పోవడం, వికారం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాల కారణంగా కోరీని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలొదిలాడు. తీవ్ర గాయాలు, గుండె, కాలేయ పల్మనరీ కంట్యూషన్, సంబంధిత కారణాలతో చనిపోయినట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్లోతేలింది. కోరీ మూర్ఛ వచ్చి మరణించినట్టు సీటీ స్కాన్ రిపోర్ట్‌లో వెల్లడైంది.NEW: Mother breaks down in court as she watches her son’s father abuse her child by making him run on the treadmill because he was “too fat.”New Jersey father Christopher Gregor is accused of killing his 6-year-old son Corey Micciolo.New footage shows the boy repeatedly face… pic.twitter.com/aVKknkOGd5— Collin Rugg (@CollinRugg) May 1, 2024 ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ కోరీది హత్యగా నిర్ధారించారు. ఈ దారుణ ఘటన 2021, మార్చిలో అట్లాంటిక్ హైట్స్ క్లబ్ హౌస్ ఫిటినెస్ సెంటర్లో జరిగింది. కన్నకొడుకును హత్య చేశాడన్న ఆరోపణలపై 2022 మార్చి 9న గ్రెగర్ను అరెస్టు చేశారు. బాండ్ లేకుండా ఓషన్ సిటీ జైలులో ఉంచారు. తాజాగా జరిగిన కోర్టు విచారణలో న్యూజెర్సీ ఓషన్ సిటీలోని సుపీరియల్ కోర్టులో ఈ చిన్నారికి సంబంధించిన వీడియోను కోర్టులో ప్రదర్శించారు. ఈ దృశ్యాలు చూసిన తల్లి బ్రె మిక్కియోలో తల్లడిల్లిపోయింది. దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
క్రేజీ..చెక్కతో ట్రెడ్ మిల్
-
ఎంత విషాదం.. జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ కుప్పకూలిన యువకుడు
న్యూఢిల్లీ: యువతలో ఆకస్మిక మరణాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు, హార్ట్ఎటాక్లు.. కారణాలేవైనా నూరేళ్ల జీవితం అనుభవించాల్సిన యంగ్‌స్టర్స్.. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అర్ధాంతరంగా ఎంతో ఆరోగ్యంగా ఉండే వారు సైతం ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తుండగా విద్యుద్ఘాతానికి గురై ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. నగరంలోని రోహిని ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బీటెక్ పూర్తి చేసిన 24 ఏళ్ల యువకుడు సాక్షం పృథి.. గురుగ్రామ్‌కు చెందిన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోహిణి సెక్టార్ 19లో నివాసముంటున్నాడు. ఇతడు స్థానికంగా సెక్టార్ 15లో ఉన్న జిమ్‌ప్లెక్స్ ఫిట్నెస్ జోన్లో తరుచుగా వ్యాయామానికి వెళ్తుంటాడు. ఇదే క్రమంలో గత మంగళవారం జిమ్‌కు వెళ్లాడు. ఉదయం 7.30 సమయంలో ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటివారు, సిబ్బంది.. యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో విద్యుదాఘాతమే బాధుతుడి మృతికి కారణమని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. జిమ్ మేనేజర్ అనుభవ్ దుగ్గల్‌ను అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. చదవండి: యాక్సిడెంట్‌ను చూడబోతే.. 9 మంది మృతి -
ఎల్లలు దాటిన తెలుగోడి ఖ్యాతి.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వడ్రంగి కడిపు శ్రీనివాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. కరెంటుతో అవసరం లేకుండా అతను రూపొందించిన ట్రెడ్మిల్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎలాంగి హంగు ఆర్భాటాలు లేకుండా అతను రూపొందించిన వుడ్ ట్రెడ్‌మిల్‌ని ఇప్పటికే కేటీఆర్, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు మెచ్చుకోగా ఇప్పుడా జాబితాలో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా చేరారు. దేశం మారుమూలలో ఎక్కడ టాలెంట్ ఉన్న సరే తన దృష్టికి వస్తే చాలు నాలుగు మంచి మాటలు చెప్పడానికి, తన వంతు సాయం అందించేందుకు ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు మార్కెట్లో అనేక వస్తువులు అందుబాటులో ఉన్నా అందులో అధిక శాతం కరెంటు ఆధారంగా పని చేసేవే ఉన్నాయి. కానీ ఈ చేతివృత్తి నిపుణుడు రూపొందించిన ట్రెడ్మిల్ అందుకు విరుద్ధం. నిజానికి దీన్ని వుడ్ ట్రెడ్మిల్ అనే కంటే ఓ నిపుణుడు సృష్టించిన కళారూపంగా చూడాలి అంటూ పేర్కొన్నారు. అంతేకాదు నాకు ఈ కళాఖండం కావాలంటూ ట్విట్టర్ వేదికగా కోరారు ఆనంద్ మహీంద్రా. In a world of commoditised, energy hungry devices, the passion for craftsmanship, the hours of dedicated efforts in hand-making this device makes it a work of art, not just a treadmill. I want one… pic.twitter.com/nxeGh6a2kf — anand mahindra (@anandmahindra) March 24, 2022 ఆనంద్ మహీంద్రా ఇలా ట్విట్టర్లో పోస్ట్ చేశాడో లేదో నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే వేల కొద్ది లైకులు, వందల కొద్ది రీట్వీట్లు వచ్చి పడ్డాయి. కడిపు శ్రీనివాస్ రూపొందించిన వుడ్ ట్రెడ్‌మిల్‌కి పేటెంట్ ఇప్పించాలని కొందరు, అతని ప్రొడక్టును భారీగా తయారు చేసేందుకు సాయం చేయాలంటూ మరికొందరు కామెంట్ చేశారు. కానీ నూటికి తొంభై శాతం మంది భారత్‌లో మరుగునపడి ఉన్న ప్రతిభకు కడిపు శ్రీనివాస్ ఓ ఉదాహారణ చెబుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఇదో అద్భుతమైన ట్రెడ్ మిల్: బరువు తగ్గడం ఖాయం
బుర్ర ఉండాలేగానీ నూతన ఆవిష్కరణలకు కొదవ ఉండదు. తాజాగా ఒక వ్యక్తి పవర్ అవసరం లేకుండా నడిచే ఒక ట్రెబ్మిల్ను రూపొందించారు. చెక్కపలకల సాయంతో విద్యుత్ అవసరం లేకుండానే పనిచేసేలా రూపొందించారు. ఈ ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నపుడు దానికి అమర్చిన ప్రత్యేక స్ప్పింగుల ద్వారా దానికదే రోల్ అవ్వడం దీని స్పెషాల్టీ. దీన్ని చూసిన నెటిజన్లు వావ్..వాట్ ఏ ఇన్నోవేషన్ అంటూ అభినందిస్తున్నారు. అలాగే తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ దృష్టిని కూడా ఈ మెషీన్ ఆకర్షించింది. దీన్ని పరిశీలించి, సాయం చేయాల్సిందిగా టీఎస్ వర్క్స్ హైదరాబాద్ ట్విటర్ హ్యాండిల్‌కి ట్యాగ్ చేశారు కేటీఆర్. దీన్ని మరింత మెరుగుపర్చడం అవసరమని ఒక యూజర్, ఇలాంటి ఐరన్‌తో స్పింగులతో ఒకటి చూశానని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ ట్రెడ్‌మిల్‌ను ఒకసారి చూడండి అంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రకు విజ్ఞప్తి చేయడం విశేషం. మరి ఆ అద్భుతం ఏంటో మీరు చూసేయండి ఒకసారి. Wow! 👏👏 @TWorksHyd please connect & help him scale up https://t.co/FVgeHzsQx8 — KTR (@KTRTRS) March 18, 2022 -
ట్రెడ్మిల్ మీద వాకింగ్! 12 గంటల్లో ఏకంగా..
లక్నో: సాధారణంగా చాలా మంది యువత.. సరైన శరీరాకృతి, ఆరోగ్యం కోసం జిమ్‌లలో వ్యాయామాలు చేస్తుంటారు. దీని కోసం ప్రత్యేకంగా ట్రేడ్ మిల్, డంబెల్స్, సైక్లింగ్స్ మొదలైన ఎక్విప్మెంట్ ఉంటాయి. ఈ క్రమంలో వాటితో గంటల కొలది వ్యాయమం చేసి శరీరంలోకి కొవ్వును తగ్గించుకుంటారు. వీటిని జిమ్‌లో ట్రైనర్ సమక్షంలో చేస్తుంటారు. అయితే, యూపీకి చెందిన జైనూల్ అబేదిన్ అనే వ్యక్తికి జిమ్ చేయడం అంటే ఇష్టం. ఇతడిని గ్రామస్థులు ‘మొరాదాబాద్ ఎక్స్‌ప్రెస్’ అని పిలుస్తారు. ఇతనికి ట్రెడ్‌మిల్‌పై నడవటం అంటే ఎంతో ఇష్టం. తాజాగా, ఇతను ట్రెడ్‌మిల్‌పై 12 గంటలపాటు ఏకధాటిగా 66 కిలోమీటర్లు నడిచి రికార్డు సృష్టించాడు. దీంతో ప్రస్తుతం ఇతను వార్తల్లో నిలిచాడు. ఇతడి ట్రెడ్మిల్ విన్యాసాన్ని చూడటానికి జిల్లాల నుంచి అధికారులు పెద్దఎత్తున యూపీకి తరలివచ్చారు. ఈ క్రమంలో జైనూల్‌ను ఉత్సాహపరిచారు. గెలవగానే అతనిపై సభ్యులు పూలవర్శం కురిపించారు. ఇప్పటికే జైనూల్.. న్యూఢిల్లీలోని ఇండియాగేట్ నుంచి ఆగ్రా, జైపూర్‌కు ప్రయాణించి మరల ఢిల్లీ చేరుకున్నాడు. ఈ పోటీని ఇతను 7 రోజులు 22 గంటలలో పూర్తిచేశాడు. ఈ అరుదైన ఘనతతో.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అదే విధంగా కరోనా లాక్డౌన్ కాలంలో పోలీసుల గౌరవార్థం 50 కిలోమీటర్లు నడక సాగించిన విషయం తెలిసిందే. -
టోక్యో ఒలింపిక్స్ 2020: ఓడిన ఓ ‘విజేత’ కథ
ఏడాది ఆలస్యం తర్వాత ప్రారంభమైన క్రీడా సంబురం ఒలింపిక్స్.. ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే మొదలైంది. టోక్యో వేదికగా జరుగుతున్న విశ్వక్రీడల సమరాన్ని ఆసక్తిగా తిలకించబోతున్నారు కోట్లాది ప్రజలు. అయితే నిన్న ఆరంభ వేడుకల్లో జరిగిన ఓ ఈవెంట్.. ఎవరికీ అంతుబట్టని రీతిలో జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పక్క డ్యాన్సులు కొనసాగుతున్న టైంలో.. ఆ వెలుగుల జిగేలులో ట్రెడ్‌మిల్‌పై ఓ మహిళ పరుగులు తీసి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమె ఎవరు? ఎందుకలా చేసింది? అనే ప్రశ్నలతో పాటు ఆ ట్రెడ్మిల్ వీడియో సోషల్ మీడియాలో మీమ్‌లా వైరల్ అవుతోంది. ఆమె పేరు అరిస సుబాటా. వయసు 27 ఏళ్లు. జపాన్‌కే చెందిన ఆమె ఒక ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తోంది. కానీ, పిడిగుద్దులతో బాక్సర్‌గా కూడా ఆమెకు మాంచి గుర్తింపు ఉంది ఈ దేశంలో. ఒలింపిక్స్ అర్హత కోసం ఏడాదిన్నరగా కష్టపడిందామె. కానీ, కరోనా ఆమెను ఘోరంగా ఓడించింది. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ రద్దు చేయడంతో ఆమెకు అవకాశం దక్కలేదు. అయితే ఆమె విజ్ఞప్తి మేరకు ఇలా టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ట్రెడ్‌మిల్‌పై సందడి చేసింది. పేద కుటుంబంలో పుట్టిన సుబాటా కెరీర్లోకి అడుగుపెట్టి మూడేళ్లే అయ్యింది. అయితేనేం జపాన్ బాక్సింగ్ ఛాంపియన్‌గా ఎదిగింది. కరోనా టైంలో ఆటగాళ్లంతా ఐసోలేషన్‌లో మెగా టోర్నీని సన్నద్ధం అవుతుంటే.. ఆమె మాత్రం నర్సుగా తన విధుల్ని నిర్వహిస్తూనే మరోవైపు ఒలింపిక్స్ కోసం రేయింబవళ్లు కష్టపడింది. కానీ, ఆ కష్టం వృథా అయ్యింది. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల్ని రద్దుచేసేసింది ఐవోసీ. అంతేకాదు 2017 నుంచి ప్రపంచ ర్యాంకింగ్‌ల ఆధారంగా 53 బాక్సర్లను మాత్రమే టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపిక చేసింది. తనకు అవకాశం దక్కకపోవడంపై ఆమె నిరాశ చెందింది. అయితేనేం మిగతా ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ చెబుతోంది. ‘ట్రెడ్‌మిల్‌పై నేను చూపించింది నా కష్టం మాత్రమే కాదు.. వేలమంది అథ్లెట్ల కష్టానికి ప్రతీక. వాళ్లందరికీ ఆల్‌దిబెస్ట్ చెబుతున్నా. తన చేష్టలను చాలామంది నవ్వుకోవచ్చు. కొందరు మెచ్చుకోవచ్చు. కానీ, మిగతా ఆటగాళ్లను అందరూ ప్రోత్సహించండి. ఏదో ఒకనాటికి ఛాంపియన్ అయ్యి తీరుతా’ అని కన్నీళ్లతో మీడియాతో మాట్లాడిందామె. -
దారుణం: పిల్లాడిని లాగేసుకున్న ట్రెడ్మిల్
వాషింగ్టన్: ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా ఓ కంట వారిని కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే చిన్నారులు తమ కళ్ల ముందు కనిపించే ప్రతిదాన్ని తాకి చూడాలని.. వీలైతే ఆయా వస్తువులతో ఆడుకోవాలని భావిస్తారు. అలాంటప్పుడు వారికి అందేంత ఎత్తులో కానీ.. కింద కానీ ఎలాంటి ప్రమాదకర వస్తువులు ఉంచకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థుతుల్లో ఉంచాల్సి వచ్చినా.. చిన్నారులను ఆ సమక్షంలోకి రానివ్వకూడదు. అలా కాదని మనం ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా.. ఇదిగో ఈ వీడియోలో చూపించినటువంటి భయంకర అనుభవం ఎదుర్కొవాల్సి వస్తుంది. దీనిలో ఇద్దరు పిల్లలు ట్రెడ్మిల్ వద్ద ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో ఓ చిన్నారి చేతులోని బెలూన్ ట్రెడ్‌మీల్ పడిపోవడంతో దాన్ని అందుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో చిన్నారి ట్రెడ్‌మీల్ కిందకు పూర్తిగా వెళ్లిపోతాడు. చివరకు ఎలాగో అలా బయటపడతాడు. ఇందుకు సంబంధించిన వీడియోని అమెరికాకు చెందిన కన్జుమర్ ప్రొడక్ట్ సేప్టీ కమిషన్(సీపీఎస్సీ) తన ఫేస్బుక్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు చిన్నారులు ఇంట్లో ట్రెడ్‌మీల్ వద్ద ఆడుకుంటూ ఉంటారు. అప్పటికి అది ఆన్ చేసి ఉంటుంది. వీరిలో పాప ట్రెడ్మిల్ మీద నడుస్తుండగా.. మరో చిన్నారి చేతిలో బెలూన్‌తో ట్రెడ్మిల్ పక్కన ఆడుకుటుంటూ ఉంటాడు. ఇంతలో ఆ పిల్లాడు తన చేతిలోని బెలూన్ని ట్రెడ్మిల్ మీద పెట్టగా.. అది అలా వెళ్లిపోతుంది. దాన్ని లాక్కోవడం కోసం పిల్లాడు ట్రెడ్మిల్ మీద చేతులు పెడతాడు. దాంతో బెలూన్‌తో పాటు చిన్నారి చేతులు కూడా ట్రెడ్మిల్ కింద ఇరుక్కుంటాయి. అది చూసిన పాప తన తల్లిదండ్రులను పిలిచేందుకు ఇంట్లోకి పరిగెడుతుంది. ఈ లోపు పిల్లాడు ఎంతో కష్టపడి చేతులను బయటకు లాక్కున్నా.. రెండోసారి మళ్లీ ట్రెడ్మిల్ అతడిని లాగేసుకుంది. ఈ సారి పూర్తిగా ట్రెడ్మిల్ కిందకి వెళ్లిపోయాడు. ఆ బాధను తట్టుకోలేక విలవిల్లాడాడు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. చివరికి ఆ పిల్లాడు తనంతట తానే దాన్ని విడిపించుకుని ఏడుస్తూ వెళ్లిపోవడం కనిపించింది. ట్రెడ్మిల్ ఇళ్లల్లో ఉంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పేందుకే ఈ వీడియోను షేర్ చేశారు. ఇప్పటివరకు ఇలాంటి ట్రెడ్మిల్ వల్ల ఒకరు చనిపోగా, కొంతమంది పిల్లలు దాని కింద నలిగి గాయపడ్డారని సీపీఎస్పీ పేర్కొంది. ఇలాంటి ఘటనలకు సంబంధించి సుమారు 39 ఫిర్యాదులు తమకు అందాయని తెలిపింది. ఇంట్లో ఇలాంటి ట్రెడ్మిల్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. చదవండి: వైరల్ వీడియో: దీని నటనకు ఆస్కార్ ఇచ్చినా తక్కువే.. -
ఇదేం వ్యాయామం రా నాయనా!
వ్యాయామం చేసేటప్పుడు మీలో చాలా మంది ట్రెడ్మిల్ చూసే ఉంటారు. రోడ్డు మీద పరిగెత్తే అవసరం లేని వాళ్లు ఈ ట్రెడ్‌మిల్‌ను ఉపయోగించి చెమటలు కక్కుతుంటారు. ట్రెడ్‌మిల్‌ను మనం ఎంత స్పీడ్ పెంచితే అంత వేగంగా పరిగెడతాం. అయితే ఇక్కడ మాత్రం ఒక అమ్మాయి ట్రెట్మిల్ను ఉపయోగించకుండా సైకిల్ తొక్కుతున్న మనుషులను ట్రెడ్మిల్గా చేసుకొని వారి మీద నుంచి పరిగెత్తడం ఆశ్యర్యం కలిగిస్తుంది. వీడియోలో స్లైక్లింగ్ చేస్తున్న వారిపై ఒక అమ్మాయి జీన్స్ వేసుకొని మెరుపువేగంతో పరిగెత్తడం కనిపించంది. దాదాపు 5 సెకండ్ల నిడివి ఉన్న ఈ క్లిప్ చూస్తే అచ్చం ట్రెట్‌మిల్ పైన పరిగెడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోనూ మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ ట్విటర్లో షేర్ చేశాడు. ' ప్రజలు నమ్మశక్యం లేకుండా ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తారు' అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఈ వీడియోను 1.4 మిలియన్ల మంది వీక్షించారు. ఇలాంటి సాహసాన్ని మునుపెన్నడు చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. People are absolutely insanely innovative and incredible... pic.twitter.com/kk2ZZBfAkh — Rex Chapman🏇🏼 (@RexChapman) July 2, 2020 -
ట్రెడ్ మిల్ అమ్మబోతే..!
సాక్షి, సిటీబ్యూరో: ఓఎల్ఎక్స్ ద్వారా సెకండ్ హ్యాండ్ ట్రెడ్ మిల్ విక్రయించాలని ప్రయత్నించిన నగర వాసిని సైబర్ నేరగాళ్ళు నిండా ముంచారు. ఈయనకు క్యూఆర్ కోడ్స్ పంపిన క్రిమినల్స్ రూ.1.5 లక్షలు కాజేశారు. ఆదివారం బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన ఓ న్యాయవాది తన ఇంట్లో ఉన్న పాత ట్రెడ్ మిల్‌ను విక్రయించాలని భావించారు. దీంతో దాని ఫొటో, తన ఫోన్ నెంబర్ ఇతర వివరాలను ఓఎల్ఎక్స్లో పొందుపరిచారు. దీనికి స్పందిస్తున్నట్లు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ఆర్మీలో పని చేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఎదుటి వ్యక్తి మాటలు నమ్మిన న్యాయవాది బేరాలు కూడా పూర్తి చేశారు. సదరు ట్రెడ్ మిల్‌ను రూ.10 వేలకు అమ్మడానికి రేటు ఖరారైంది. ఆపై అసలు కథ ప్రారంభించిన సైబర్ నేరగాడు తన ఫోన్‌కు గూగుల్ పే ద్వారా రూ.5 పంపాలని, ఆ వెంటనే రూ.10 వేలు మీ ఖాతాలోకి వస్తాయంటూ చెప్పాడు. న్యాయవాది అలానే చేయడంతో ఆయన ఖాతాలోకి డబ్బు వచ్చింది. ఇలా తమకు రూ.5 వేలు పంపిస్తే రూ.10 వేలు ఖాతాలోకి వస్తాయంటూ నమ్మించారు. పలు దఫాలుగా క్యూఆర్ కోడ్స్ పంపిన సైబర్ నేరగాళ్ళు న్యాయవాది ఖాతా నుంచి రూ.1.5 లక్షలు కాజేశారు. ఈయన సెల్‌ఫోన్ నెంబర్‌కు గూగుల్ పే ఖాతాకు మూడు బ్యాంకు ఖాతాలు అనుసంధానించి ఉన్నాయి. వాటిలో రెండు ఖాతాల నుంచి ఈ డబ్బు పోయింది. అయితే తాను సైబర్ నేరగాళ్ళు సూచించినట్లు చేయలేదని, అయినా డబ్బు పోయిందని బాధితుడు పోలీసుల ఎదుట వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
పావురం సిక్స్ ప్యాక్ ట్రైనింగ్ అదిరింది
బుర్రకు దెబ్బ తగిలి సంజయ్ రామస్వామి గతాన్ని మర్చిపోయి గజినీ అయినట్లు. ఈ పావురం ఎగరటం మర్చిపోయి సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోయింది. హోమ్ జిమ్ చేయాలనుకునే వారికి స్పూర్తిగా నిలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఓ పావురం ఎగరటం మార్చిపోయినట్లు ఎస్కలేటర్ హ్యాండ్డ్రేల్ను పైకి వెళ్లటానికి ఉపయోగించుకుంది. మొదట దానిపై కూర్చుని కిందకు జారిన అది ఆ తర్వాత ట్రేడ్‌మిల్‌పై మనిషి పరిగెత్తినట్లు, హ్యాండ్డ్రేల్పై పరిగెత్తింది. చివరకు అలుపొచ్చి ఎడమవైపు దానిపైకి దూకింది. అక్కడకూడా పరుగులు పెట్టి, చివరగా కుడివైపు హ్యాండ్డ్రేల్పైకి వచ్చేసింది. అప్పుడు మాత్రం తను అనుకున్న గమ్యస్థానం వైపు అది వెళుతున్నందుకు గమ్మున ఉండిపోయింది. ( ఏమి ఆట: కరోనా కాలంలో బొమ్మలాట! ) ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల సంఖ్యలో వీక్షణలు, దాదాపు 700 కామెంట్లు సంపాదించుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ పావురం ఎగరటం మర్చిపోయిందా?.. పావురం సిక్స్ ప్యాక్ ట్రైనింగ్ అదిరింది.. నేను ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్ వీడియో ఇదే!.. పావురానికి ట్రెడ్మిల్గా మారిన ఎస్కలేటర్‌ను చూడండి.’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
పావురం ఎగరటం మర్చిపోయిందా?
-
దిండు లేకపోయుంటే పరిస్థితి ఏంటో!
పిచ్చి పరాకాష్టకు చేరిందనడానికి ఈ వీడియోనూ ఉదాహరణగా చెప్పవచ్చు. లాక్డౌన్ సమయాన్ని వృధా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కొంతమంది ఏది పడితే అది చేసి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పైగా తాము చేసే ప్రతీ పనిని టిక్‌టాక్‌లో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా జెస్సీ రింగ్ అనే యువతి ట్రెడ్‌మిల్‌పై లాండ్రీ బాస్కెట్‌తో చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నవ్వులు పూయిస్తుంది. ఆ వీడియోలో జెస్సీ తలకు హెల్మెట్ ధరించి లాండ్రీ బాస్కెట్లో కూర్చుని మొదటిసారి గంటకు 1 కిమీటర్ వేగంతో ట్రెడ్మిల్ నుంచి కిందకు జారింది. (ఫుట్‌బాల్‌ను రఫ్ఫాడించింది, అదీ హీల్స్‌తో!) అలా ట్రెడ్‌మిల్‌పై నుంచి జారే ముందు ప్రతీసారి గంటకు ఒక్కో కి.మీ వేగం పెరిగేలా మొత్తం 7 సార్లు టైమర్‌ను సెట్ చేసింది. దాంతో పాటు ట్రెడ్‌మిల్‌పై వేగం పెరిగే ప్రతీసారి కిందపడే అవకాశం ఉండడంతో ముందస్తుగానే గోడకు సన్నని దిండులను పక్కాగా అమర్చుకుంది. అయితే ట్రెడ్‌మిల్‌పై లాండ్రీ బకెట్ గంటకు 7 మైళ్ల వేగంతో జారుతుండగా జెస్సీ ఒక్క సారిగా తలకిందులుగా పడి గోడకు వెళ్లి బలంగా గుద్దుకుంది. కాకపోతే గోడకు దిండు అడ్డుగా ఉండడంతో ఏం కాలేదు. ఈ వీడియోనూ జెస్సీ తన టిక్‌టాక్‌లో షేర్ చేయడంతో దాదాపు ఒక్కరోజులోనే 12.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ' ఎందుకీ పిచ్చి పనులు'.. 'దిండు లేకపోయుంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో' అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. -
పీసీవోడీకి చికిత్స ఉందా?
నా భార్య వయసు 36 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? వివరించండి. రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీవోడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. లక్షణాలు: నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానకలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
అమ్మాయి... ఆమె... అమ్మ!
మహిళగా పుట్టడమే ఒక అదృష్టం. కుటుంబానికి ఆమే మూలం. కూతురిగా, తల్లిగా, భార్యగా ఆమె సేవలు నిరుపమానం. ఆమె ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్యం కోసం కుటుంబసభ్యులంతా కనిపెట్టుకొని ఉండాలి. ఓ అమ్మాయి... తొలుత యువతిగా, ఆ తర్వాత మహిళగా, పెద్దవయసావిడగా మారుతుండే క్రమంలో ఆమెకు వచ్చే వైద్యపరమైన సమస్యలన్నీ చాలా ప్రత్యేకంగానే ఉంటాయి. మహిళల్లోని హార్మోన్ మార్పులు చాలా సంక్లిష్టమైనవి కావడంతో వారికి ఆరోగ్యపరమైన చిక్కులూ, సమస్యలూ ఎన్నో వస్తుంటాయి. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనేక దశల్లో మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలూ, అవసరమైన పరీక్షలూ, పరిష్కారాలను తెలుసుకునేందుకే ఈ ప్రత్యేక కథనం. దాదాపు పదేళ్ల వయసు వచ్చేవరకు అబ్బాౖయెనా, అమ్మాౖయెనా వారికి వచ్చే ఆరోగ్య సమస్యల్లో పెద్దగా తేడాలు ఉండవు. సాధారణంగా వచ్చే జ్వరం, జలుబూ, చికెన్ పాక్స్ వంటి సమస్యలు మామూలే. అయితే ఒక అమ్మాయి... తొలుత కౌమారప్రాయంలో రుతుక్రమం వచ్చి యువతిగా, ఆ తర్వాత మహిళగా, అటు పిమ్మట మధ్యవయస్కురాలిగా ఇలా తన జీవితంలో దశలు మారుతున్న కొద్దీ మహిళలకు వచ్చే సమస్యలెలా ఉంటాయో చూద్దాం. ఓ బాలిక... యువతిగా మారుతోందనడానికి స్పష్టమైన విభజన రేఖ ఆమెకు తొలుత రుతుస్రావం రావడం. రుతుస్రావం రావడం గురించి చాలా మంది అమ్మాయిలు బిడియంగా ఫీలవుతుంటారు. ఇందులో సిగ్గుపడాల్సిందీ, బిడియపడాల్సిందేమీ లేదు. ముందుగా చెప్పుకున్నట్లు ఓ అమ్మాయి... ఆరోగ్యకరమైన మహిళగా ఎదుగుతుందనడానికి ఇదో మంచి సూచన మాత్రమే. అయితే మహిళగా రూపొందుతున్న ఆ సమయం నుంచి ఆమెకే ప్రత్యేకమైన కొన్ని ఆరోగ్యసమస్యలు మొదలవుతుంటాయి. రుతుసంబంధమైన సమస్యలేమిటో, అవి ఎలా బాధిస్తాయో, వాటికి పరిష్కారాలేమిటో తెలుసుకుందాం. రుతు సంబంధిత సమస్యలు (మెనుస్ట్రువల్ డిజార్డర్స్): ఇవి యువతి రోజువారీ పనులకు నిత్యం అడ్డుపడుతుంటాయి. వాటి గురించి క్లుప్తంగా... ∙ప్రైమరీ అమెనోరియా : కొంతమంది అమ్మాయిల్లో 16 ఏళ్లు దాటుతున్నప్పటికీ రుతుక్రమం మొదలుకాదు. ఈ కండిషన్‌ను ప్రైమరీ అమెనోరియా అంటారు. ఇలాంటి వారు డాక్టర్‌ను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఇలా జరగడానికి చాలా కారణాలే ఉంటాయి. వాటిని డాక్టర్లు అన్వేషించి, కారణాలను బట్టి దానికి తగిన చికిత్స అందిస్తారు. ∙డిస్మెనూరియా: రుతుసంబంధిత సమస్యల్లో రుతు సమయాల్లో నొప్పి కూడా ఒకటి. దీన్ని డిస్మెనూరియా అంటారు. ఈ సమస్య ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు రుతుసమయాల్లో నొప్పి వచ్చినప్పుడు వారు సూచించిన మోతాదులో నొప్పి నివారణ మందులు వాడుకోవచ్చు. రెండుకు మించి వాడాల్సివస్తే డాక్టర్‌ను సంప్రదించాలి. ∙పరిష్కారం: సాధారణంగా రుతు సమయంలో వచ్చే నొప్పి ఒక వయసు వచ్చాక చాలామందిలో అదే తగ్గిపోతుంది. కొన్ని న్యూట్రిషనల్ సప్లిమెంట్లు కూడా డిస్మెనూరియాతో బాధపడుతున్నవారికి ఉపశమనం కలిగించవచ్చు. సంతానం కలిగాక దాదాపుగా రాకపోవచ్చు. కానీ అలా తగ్గకపోతే మాత్రం డాక్టర్‌ను సంప్రదించాలి. ∙మెనొరేజియా: కొందరిలో రుతు సమయంలో అధికంగా రక్తస్రావం అవుతుంటుంది. ఇది వారిని ఎంతో చికాకు పెట్టడమే కాకుండా... రక్తహీనతకూ దారితీస్తుంది. ∙పరీక్షలూ, పరిష్కారం: ఇలాంటి సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు అవసరమైనప్పుడు కొన్ని హార్మోనుల పరీక్షలు చేయించుకొని అవసరాన్ని బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. ∙ప్రి మెనుస్ట్రువల్ సిండ్రోమ్ : కొంతమంది మహిళల్లో రుతుస్రావం మొదలు కావడానికి కొద్ది రోజులు ముందర శారీరకంగా కొన్ని సమస్యలు కనిపిస్తుంటాయి. ఆ సమయంలో వాళ్లకు రొమ్ముల్లో సలపరం, బాధ /నొప్పి, భావోద్వేగాలు వెంటవెంటనే మారిపోవడం (మూడ్స్ స్వింగింగ్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలతో కనిపించే సమస్యను ప్రీ–మెనుస్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ∙పరిష్కారం : ఈ సమయంలో కలిగే ఇబ్బందులను అధిగమించడానికి తగినన్ని నీళ్లు తాగాలి. ఆకుకూరలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలి. ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలై, వాటి వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. ఇలాంటి వారు పొగతాగడం, కెఫీన్ డ్రింక్స్ (ఆల్కహాల్, శీతల పానీయాలు కోలా డ్రింక్స్), ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఉప్పు ఎక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆహారంలోనూ ఉప్పు తగ్గించాలి. కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలను వీలైనంతగా తగ్గించాలి. అప్పటికీ ప్రయోజనం కనిపించకపోతే డాక్టర్‌ను సంప్రదించి, కొన్ని హార్మోన్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. పరీక్షల్లోని ఫలితాలను బట్టి అవసరమైన చికిత్స తీసుకోవాలి. ∙ రక్తహీనత : ఇంతకు మునుపు చెప్పుకున్నట్లే మహిళకు రుతుసమయంలో చాలా ఎక్కువగా రక్తస్రావం అయ్యే మెనొరేజియా కండిషన్ కారణంగా రక్తహీనత రావడం చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇంకా చెప్పాలంటే... మనదేశంలో దాదాపు 85 శాతం మహిళల్లో రక్తహీనత ఉన్నట్లు అంచనా. ∙పరిష్కారం: మహిళలకు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి. రుతుస్రావం మొదలయ్యాక వారు ఐరన్ కోల్పోతుంటారు కాబట్టి మాంసాహారం తినేవాళ్లయితే (శరీరం త్వరగా ఐరన్‌ను గ్రహించే హీమ్ ఐరన్ అన్నది మాంసాహారంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి) మాంసాహారం ఇవ్వడం మంచిది. మాంసాహారంలోనూ లివర్ వంటి వాటిల్లో హీమ్ ఐరన్ ఎక్కువ. ఈ హీమ్ ఐరన్ డ్రైఫ్రూట్స్‌లోనూ ఎక్కువే. అయితే ఈ వయసు పిల్లలు డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే మళ్లీ బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి పరిమితంగా తీసుకోవాలి. రుతుసమయంలో కోల్పోయే ఇనుము పాళ్ల భర్తీ కోసం ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం... అంటే వూంసాహారం తినేవాళ్లయితే చికెన్, వేటవూంసం, చేపలు, వూంసాహారంలో లివర్, శాకాహారులైతే తాజా ఆకుకూరలు, ఎండుఖర్జూరం, అటుకులు, అంజీర, రాగి, పుచ్చకాయ వంటి పదార్థాలు పీరియడ్స్‌కు వుుందే తీసుకుంటూ ఉండండి. దానివల్ల కోల్పోయే ఐరన్ భర్తీ అయ్యే అవకాశాలు ఎక్కువ. ∙గర్భధారణ సమస్యలు : సంతానం కలగడంలో పురుషుడు, మహిళ... ఈ ఇద్దరి పాత్ర ఉన్నప్పటికీ, మహిళ భూమిక చాలా కీలకమైనది. శిశువు తొమ్మిదినెలల పాటు మహిళ గర్భంలోనే పెరగడమే కాకుండా, ఆ తర్వాత దాదాపు రెండున్నర, మూడేళ్ల వయసు వచ్చే వరకు అమ్మపాలమీదే ఆధారపడుతుంటాడు. అందుకే గర్భధారణకు ముందూ... గర్భధారణ తర్వాత కూడా మహిళలు చాలా సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. వాటిలో కొన్నింటిని చూద్దాం. గర్భధారణకు ముందు... గర్భధారణ అనేది మహిళల సంపూర్ణ ఆరోగ్యాన్ని సూచించే మరో అంశం. ఇది ఎంతమాత్రమూ అనారోగ్యం కాకపోయినప్పటికీ, ఈ సందర్భంలో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, కాబోయే తల్లే కొన్ని మాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది. పరీక్షలూ / పరిష్కారాలు : కౌమార వయసులో అంటే టీనేజీలోనే గర్భం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళలు గర్భధారణకు కనీసం రెండు మూడు నెలల ముందునుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవాలి. దీంతో పిల్లల్లో పుట్టుకతో వచ్చే అనేక సమస్యల (కంజెనిటల్ అనామలీస్)ను, వెన్నుపూస లోపాల (న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్)ను నివారించవచ్చు. కొన్ని మందులు గర్భవతికీ, ఆమెలోని పిండానికీ హాని చేస్తాయి. డాక్టర్‌ను సంప్రదించకుండా ఏ రకమైన మందులూ వాడకూడదు. ఏవైనా సమస్యలున్నవారు డాక్టర్ సలహా మేరకే మందులు వాడాలి. ఇక గర్భంతో ఉన్న మహిళ ఎక్స్–రే వంటి పరీక్షలను అస్సలు చేయంచుకోకూడదు. ప్రసవం తర్వాత కూడా అన్నిరకాల పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు ఐరన్, క్యాల్షియమ్ సప్లిమెంట్లను కనీసం ఆర్నెల్ల పాటు వాడాలి. ప్రసవం తర్వాత పోస్ట్‌పార్టమ్ బ్లూస్ : ఇది మహిళల్లో ప్రసవం తర్వాత వచ్చే ఒక రకం మానసిక రుగ్మత. ఇందులో గర్భధారణ సమయంలో మహిళపై పడే ఒత్తిడి, ప్రసవం తాలూకు వేదన, కొత్తగా పుట్టిన బిడ్డ తాలూకు బాధ్యతల భారం... ఇలా అన్నీ కలగలసి మహిళపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి. అలా కలిగిన ఒత్తిడి ఆమెకు మానసిక సమస్యలను తెచ్చిపెడుతుంది. పరిష్కారాలు : పోస్ట్‌పార్టమ్ బ్లూస్‌ను అధిగమించడానికి కుటుంబ సభ్యులందరి సమష్టి ప్రోత్సాహం అవసరం. ఆమె ఆందోళన తొలగేలా ఆమెకు ధైర్యం చెబుతూ, తామెప్పుడూ అండగా ఉంటామనే భరోసాను ఆమెలో కలిగించాలి. అవసరమైతే డాక్టర్/సైకియాట్రిస్ట్ సలహామేరకు కొన్ని యాంటీ సైకోటిక్ మందులు వాడాల్సి రావచ్చు. మహిళలకు వచ్చే సాధారణ గైనిక్ సమస్యలు ఎండోమెట్రియాసిస్: గర్భాశయం లోపలి పొరను ఎండోమెట్రియమ్ అంటారు. రుతుస్రావం తర్వాత గర్భాశయం లోపలి గోడలపై ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావంతో అక్కడ ఎండోమెట్రియమ్ అనే పొర మొదటి 14 రోజులపాటు వృద్ధి చెంది, 15వ రోజు నుంచి విడుదల అయ్యే ప్రోజెస్టిరాన్ అనే హార్మోన్ ప్రభావం వల్ల పొర మరింత మందమవుతుంది. అక్కడ సన్నటి రక్తనాళాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అప్పుడు ఓవరీస్‌లో విడుదలైన అండం శుక్రకణంతో కలవడం జరగకపోతే 14 రోజుల తర్వాత ప్రోజెస్టరాన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దాంతో ఎండోమెట్రియమ్‌లో అభివృద్ధి చెందిన రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా ఎండోమెట్రియమ్ పొర గర్భాశయం గోడ నుంచి ఊడిపోయి సన్నటి ముక్కలుగా రక్తంలో కలిసి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అదే రుతుస్రావం. అయితే కొందరిలో ఎండోమెట్రియమ్ కణాలు గర్భాశయంలోపలి వైపునకు కాకుండా, కడుపులోకి వివిధ అవయవాలపైన అంటే... అండాశయాలపైనా, ట్యూబ్స్‌పై, గర్భాశయంపై పొరపై, పొత్తికడుపులోని గోడలపై, పేగులపై, మూత్రాశయంపై, ఇంకా చాలా అరుదుగా ఊపిరితిత్తుల్లో, మెదడులో కూడా ఏర్పడవచ్చు. హార్మోన్ల ప్రభావం వల్ల అది రుతుచక్రంలో ఎలాంటి మార్పులకు లోనవుతుందో... అవి పెరిగిన చోట కూడా అలాంటి మార్పులే కనిపిస్తాయి. బహిష్టు సమయంలో ఆ అవయవాల్లో కూడా కొద్దిపాటి బ్లీడింగ్ అవుతుంటుంది. వీటిని ఎండోమెట్రియల్ ఇంప్లాంట్స్ అంటారు. ఈ కండిషన్‌ను ఎండోమెట్రియాసిస్ అంటారు. వివిధ అవయవాలపై ఉన్న ఎండోమెట్రియమ్ ఇంప్లాంట్స్‌లో రక్తస్రావం జరిగి అది బయటకు వెళ్లడానికి మార్గం లేక కొందరిలో రక్తం అక్కడ కరిగిపోతుంది. అయితే కొందరిలో రక్తం గూడు కట్టడం జరగవచ్చు. కొందరిలో ఒక అవయవానికి, మరో అవయవానికి మధ్య ఈ రక్తపు కణాలతో కండలాంటిది పెరగవచ్చు. వాటిని అడ్హెషన్స్ లేదా ఫైబ్రోసిస్ బ్యాండ్స్ అంటారు. అలా పెరిగిన కణజాలం నుంచి విడుదల అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ హార్మోన్స్‌తో పాటు ఇతర రసాయన పదార్థాల వల్ల ఒక్కొక్కరిలో ఒక్కోలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో నడుం, పొత్తికడుపులో నొప్పి, సంతానలేమి, పేగులు అతుక్కుపోవడం, మూత్రనాళాలు, పేగుల్లో అడ్డంకులు వంటి అనర్థాలు కనిపిస్తాయి. పరిష్కారం : ఈ సమస్యకు ఈస్ట్రోజెన్, ప్రోజెస్టరాన్ వంటి హార్మోన్ మాత్రలతో చికిత్స అందిస్తారు. కొందరికి శస్త్రచికిత్స అవసరమవుతుంది. ∙పీసీఓఎస్ / పీసీఓడీ : ఈ సమస్యను వైద్యపరిభాషలో పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ లేదా డిజార్డర్ అని వ్యవహరిస్తారు. ఈ సమస్య ఉన్నవారిలో అండాశయంలో నీటితిత్తులు (సిస్ట్స్) కనిపిస్తాయి. చాలా సందర్భాల్లో అవి హానికరం కాదు, గర్భధారణకు అంతరాయం కూడా కాదు. మహిళల అండాశయం నుంచి ప్రతి నెలా ఒక ఫాలికిల్ (అండం పెరిగే నీటి తిత్తి) కనిపిస్తుంది. దీని పరిమాణం 18 నుంచి 20 మిల్లీమీటర్లకు చేరాక ఇది పగిలి దాని నుంచి అండం విడుదల అవుతుంది. అయితే కొంతమందిలో ఫాలికిల్స్ 5–10 మిల్లీమీటర్లకు చేరగానే అంతకు మించి పెరగకుండా... చిన్న చిన్న నీటి బుడగలాగా మారిపోతాయి. అవి పది, పన్నెండు కంటే ఎక్కువగా ఉన్న కండిషన్‌ను పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. ఇవి ఏర్పడానికి స్పష్టమైన కారణం తెలియదు. ఆధునిక జీవనశైలితో పాటు కొన్ని ఆహారపు అలవాట్లు, మానసిక, శారీరక సమస్యలు ఉన్నప్పుడు, హార్లోన్లలో అసమతౌల్యత, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఇవి కనిపిస్తాయి. ఈ సమస్య ఉన్న మహిళల్లో బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, పీరియడ్స్ సక్రమంగా లేకపోవడం, సంతానలేమి, గర్భధారణ సమస్యలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. పరీక్షలు/పరిష్కారాలు : కొన్ని రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలతో సమస్యను నిర్ధారణ చేయవచ్చు. దీని చికిత్స అందరిలో ఒకేలా ఉండదు. లక్షణాలు, రక్తపరీక్షల ఆధారంగా చికిత్స కూడా మారుతుంది. బరువు తగ్గించుకోవడం, అవసరాన్ని బట్టి మెట్ఫార్మిన్ వంటి మందులు, హార్మోన్లు వాడాల్సి ఉంటుంది. సమస్య తీవ్రతను బట్టి ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్సా అవసరం కావచ్చు. ∙క్యాండిడియాసిస్ / ఫంగల్ ఇన్ఫెక్షన్స్: ఇది చాలా సాధారణ సమస్య. మహిళల శరీరాల్లో చెమటలు పట్టే ప్రదేశాలు, చర్మం ముడతలు ఉండే ప్రాంతాల్లో తగినంత గాలి, వెలుతురు సోకే అవకాశాలు తక్కువ. దాంతో అక్కడ ఉక్కపోతలతో చెమట, చెమ్మ పెరగడం వల్ల క్యాండిడియాసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ. ఇక కొందరు మహిళల్లో గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఈ సమస్యలు కనిపించడం చాలా సాధారణమే. డయాబెటిస్ ఉన్నవారికీ, రోగనిరోధక శక్తి తగ్గిన వారికి, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడే వారికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తరచూ కనిపిస్తుంటాయి. పరీక్షలు / పరిష్కారాలు : సాధారణ ఫిజికల్ ఎగ్జామినేషన్‌తోనే ఈ సమస్యను చాలావరకు తెలుసుకోవచ్చు. దీనికి చికిత్సగా శరీరంపైన సోకిన ఫంగస్ రకాన్ని బట్టి పైపూతగా వాడాల్సిన (టాపికల్) యాంటీఫంగల్ మందులతో పాటు, నోటి ద్వారా కూడా కొన్ని మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ∙మూత్రసంబంధ సమస్యలు : మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు పురుషులతో పోలిస్తే మహిళల్లోనే చాలా ఎక్కువ. చాలా సాధారణం కూడా. ఆమె శరీర నిర్మాణమే ఇందుకు కారణం. తరచూ మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లకు గురయ్యేవారు ఎక్కువగా నీళ్లు తాగడం, ద్రవాహారం పుష్కలంగా తీసుకోవడం, ప్రతి మూడు గంటలకోమారు మూత్రవిసర్జనకు వెళ్లి, మూత్రాశయాన్ని ఖాళీ చేసుకోవడం, భార్యాభర్త కలియక తర్వాత మూత్ర విసర్జనకు వెళ్లడం (ఈ సమయంలో ఒకింత వేగంగా మూత్రవిసర్జన చేయాలి), ప్రైవేటు పార్ట్స్‌ను శుభ్రంగా కడుక్కోవడం, అక్కడ శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యను నివారించవచ్చు. ∙స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ : సాధారణంగా మహిళల్లో మానసిక ఒత్తిళ్లు చాలా ఎక్కువ. దాంతో వారిలో కొందరు మూత్రంపై నియంత్రణను కోల్పోతుంటారు. ఈ సమస్య ఉన్న మహిళల్లో వారు చిన్నగా దగ్గినా, తుమ్మినా, ఏదైనా వస్తువును ఎత్తినా లేదా నవ్వినా కూడా వారి పొట్టపై కండరాలు మూత్రాశయంపై ఒత్తిడి కలిగించి... అసంకల్పితంగానే కొన్ని మూత్రం చుక్కలు పడిపోయేలా చేస్తాయి. ఈ సమస్య ప్రసవం తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. ప్రసవం తర్వాత మహిళల పొట్ట కండరాలు బలహీనం కావడంతో వారి మూత్ర విసర్జన స్ఫింక్టర్‌పై నియంత్రణను కోల్పోతారు. దానికి బలం చేకూరే వరకు ఈ తరహా సమస్య వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. పరిష్కారాలు : ఈ సమస్య ఉన్నవారు డాక్టర్ సూచించిన కొన్ని ప్రసవానంతర వ్యాయామాలు, కెగెల్స్ ఎక్సర్సైజ్ల ద్వారా మూత్రవిసర్జనపై నియంత్రణ సాధించవచ్చు. ఈ ఇబ్బందులున్నవారు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. మధ్యవయసులో వచ్చేవి... మధ్యవయసు మహిళల్లో సాధారణ సమస్యలివి... ఒక వయసు దాటాక ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులు మహిళల్లో ఎక్కువ. వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో ఎముక సాంద్రతా, బలం క్రమంగా తగ్గుతూ పోతాయి. తమ వ్యాధినిరోధక శక్తి తమపైనే ప్రతికూల ప్రభావం చూపే ఎముక సంబంధితమైన రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్‌ఎల్‌ఈ వంటి వ్యాధులు మహిళ్లోనే ఎక్కువ. అందుకే మహిళల్లో ఎముకల బలాన్ని పెంచడానికి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండే పొట్టుతీసిన ధాన్యాలైన (గోధువు, జొన్న, మెుక్కజొన్న, రాగులు, ఓట్స్)తో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. తాజా పండ్లు, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే రాగులు, తాజా ఆకుపచ్చ కూరలు తీసుకోవడం, పాలు తాగడం చాలా మంచిది. మెనోపాజ్ సమస్యలు : దాదాపు 45 ఏళ్లు వచ్చాక మహిళకు రుతుక్రమం ఆగిపోవడమూ ఒక సమస్యగానే పరిణమిస్తుంది. రుతుక్రమం ఆగే సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గినందున వారికి ఒంట్లోంచి వెచ్చటి ఆవిర్లు రావడం, భావోద్వేగాల్లో వేగంగా మార్పులు (మూడ్స్ స్వింగింగ్), ఆస్టియోపోరోసిస్‌తో ఎముకలు బలహీనం కావడం, ఈస్ట్రోజెన్ వల్ల గుండెకు కలిగే సహజ రక్షణ తొలగిపోవడం వల్ల గుండెజబ్బులకు తేలిగ్గా గురికావడం, యోని పొడిగా మారడం, గర్భసంచి కిందికి జారడం వంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. పరిష్కారం : రుతుక్రమం ఆగిన మహిళల్లో ఏవైనా సమస్యలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లక్షణాలను బట్టి డాక్టర్లు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) వంటి చికిత్సలను సూచిస్తారు. క్యాల్షియమ్, విటమిన్ ’డి’ ఇవ్వడం వల్ల మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఎముకల ఆరోగ్యం పటిష్టంగా ఉండటమే కాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించవచ్చు. క్యాన్సర్‌ను పారదోలండి! క్యాన్సర్ చికిత్సలో రెండు అంశాలు ప్రధానం... మొదటిది క్యాన్సర్‌తో పోరాడేలా రోగికి ప్రోత్సాహం అందించడం... కుదరకపోతే కనీసం వారికి హాని జరగకుండా చూసుకోవడం. క్యాన్సర్ రోగులు ప్రధానమైనవి చాలా కోల్పోతుంటారు. ‘‘మీకు క్యాన్సర్ ఉంది’’ అని చెప్పగానే వారు జీవితం మీద అదుపు కోల్పోతారు. వెంటనే వాళ్ల రోజువారీ దిన చర్యలో డాక్టర్లను సంప్రదించడమే ఒక కార్యక్రమంగా ఉంటుంది. దీర్ఘకాలిక చికిత్సతో వాళ్లలో కలిగే దుష్ప్రభావాలతో తమకు ఆనందాన్నిచ్చే పనుల్లో వాళ్లు పాలుపంచుకోలేరు.సరైన సమయానికి జబ్బును కనుగొంటే అటు సంప్రదాయ చికిత్సతో పాటు ఇటు ప్రత్యామ్నాయ చికిత్సతో రోగికి నయమయ్యేలా చేయవచ్చు. సకాలంలో చేసే చికిత్సతో రోగుల ఆయుఃప్రమాణాన్ని పెంచవచ్చు. క్యాన్సర్ ఒంట్లోని ఇతర అవయవాలకు పాకే మెటాస్టేసిస్ కండిషన్ అయిన స్టేజ్ 4 దశలో ఉన్న రోగులను పూర్తిగా ఆశ వదులుకున్న కేసుల వారికీ చికిత్స ఇవ్వవచ్చు. స్ఫూర్తినిచ్చే శారదాదేవి ఉదంతం వైద్యపరీక్షల్లో శారదాదేవి అనే మహిళకు గాల్‌బ్లాడర్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. మరోసారి పరీక్షల్లోనూ అదే నిర్ధారణ అయ్యింది. సాధారణ చికిత్సతో ఒకింత ఉపశమనం అనిపించినా, దుష్ప్రభావాలూ కనిపించాయి. పరిస్థితి మొత్తాన్ని సమీక్షించినప్పుడు ఆమెలో మెరుగుదల ఏమీ కనిపించలేదు. పరిస్థితి బాగా విషమించింది. జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. ఆకలి మందగించి, ఆమె బరువు చాలా వేగంగా తగ్గిపోయింది. రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గడంతో వ్యాధి విజృంభించసాగింది. ఆమె చికిత్సకు ఏమాత్రం తట్టుకోలేకపోతోంది. ఆ పరిస్థితుల్లో 1996 జూలైలో ఆమె ‘డీఎస్ఆర్సీ’కి వచ్చింది. చికిత్సకు బాగా స్పందించింది. వేగంగా ఆరోగ్యం పుంజుకొని 6 – 8 నెలల్లోనే 17 కేజీల బరువు పెరిగింది. తన రోజువారీ పనులు మామూలుగానే చేసుకోసాగింది. గాల్‌బ్లాడర్‌లోని క్యాన్సర్‌గడ్డ దాదాపుగా తగ్గిపోయింది. పధ్నాలుగు నెలల తర్వాత స్కానింగ్ చేయిస్తే... కాలేయం, ప్యాంక్రియాస్, ప్లీహం, మూత్రపిండాలు... అన్నీ నార్మల్‌గా ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. ఇక 21 నెలల తర్వాత రోగిలో క్యాన్సర్ తాలూకు లక్షణాలేవీ కనిపించలేదు. ఇప్పుడు శారదాదేవి పూర్తిగా సాధారణ ఆరోగ్యవంతమైన జీవనం గడుపుతోంది. ఇప్పుడామెకు క్యాన్సర్ లేదు! ఇలాంటి కేసులను పరిశీలించడం వల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. వాళ్ల వల్ల ఇతర క్యాన్సర్ రోగులకూ ఎంతో మనోబలం చేకూరుతుంది. తమ భయాలను, ఆందోళనను వదిలేసి, మంచి పట్టుదలతో క్యాన్సర్‌తో పోరాడటానికి ఇలాంటి ఉదంతాలు స్ఫూర్తినిస్తాయి. రండి... క్యాన్సర్‌పై పోరాటంలో మాతో చేతులు కలపండి. మరింత సమాచారం కోసం 91009 43142కు ఫోన్ చేయండి. లేదా www.dsresearchcentre.com సైట్‌ను సంప్రదించండి. హిస్టరెక్టమీ: కొందరు మహిళలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారు తమ చివరి కాన్పు తర్వాత గర్భసంచిని (యుటెరస్‌ను) ఓ ఉపయోగపడని అవయవంగా భావించి దాన్ని తొలగించమని కోరుతుంటారు. దానివల్లనే నొప్పులు, రక్తస్రావాలు, తెలుపు కావడం (వైట్ డిశ్చార్జీ) వంటివి జరుగుతున్నాయనే అపోహ వారిది. గర్భసంచి తొలగించే శస్త్రచికిత్సకే ‘హిస్టరెక్టమీ’ అని పేరు. ఇక మరికొందరు వైద్యులు యుటెరస్‌తో పాటు అండాశయాలు (ఓవరీస్) కూడా తొలగిస్తుంటారు. ఇది ఎంతమాత్రమూ మంచిది కాదు. మెనోపాజ్ తర్వాత స్త్రీలో శారీరకంగా, మానసికంగా ఏ మార్పులు వస్తాయో... అచ్చం అలాంటి మార్పులే గర్భసంచిని తొలగించాకా కనిపించవచ్చు. ఉదాహరణకు... ఒంట్లోంచి ఆవిర్లు రావడం (హాట్ ఫ్లషెస్), యోని పొడిబారడం (డ్రై వెజైనా), కలయికలో విపరీతమైన నొప్పి (డిస్పరూనియా), నిద్ర, మూడ్స్‌లో అంతరాయాలూ (స్లీప్ అండ్ మూడ్స్ డిస్టర్బెన్సెస్) వంటివి రావచ్చు. అంతేకాదు... ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు, గుండెజబ్బులకు దారితీసే పరిస్థితులూ ఏర్పడతాయి. అందుకే డాక్టర్లు మరీ మరీ తప్పనిసరి అని చెప్పిన పరిస్థితుల్లో తప్ప... మామూలుగానైనా తమ యుటెరస్‌ను అందునా ఓవరీస్‌ను తొలగించుకోకూడదు. తొలగించమని డాక్టర్లను కోరకూడదు. పరిస్థితిని బట్టి డాక్టర్లేపేషెంట్ కండిషన్‌ను రోగి సంబంధితులకు పూర్తిగా వివరించి, మరీ అవసరమైతేనే తొలగింపునకు సూచనలు చేస్తారు.చివరగా... ఈరోజుల్లో మహిళలు ఇటు ఇంటిపనులతో పాటు ఇప్పుడు అటు బయటి పనులు కూడా సంభాళించుకుంటున్నారు. అందుకే వారిపై పనిభారం, ఒత్తిడి ఎక్కువ. అందువల్ల ఆమెకు భర్త నుంచి కుటుంబ సభ్యుల నుంచి తగినంత సహాయ సహకారాలు ఎప్పుడూ అవసరమని గుర్తుంచుకోండి. ఎండోక్రైనల్ సమస్యలు ఇందులో రెండు రకాలు ప్రధానం. మొదటిది హైపోథైరాయిడిజమ్. థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం లేదా చాలా తక్కువగా పనిచేయడాన్ని హైపోథైరాయిడిజమ్ అంటారు. స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఈ కండిషన్ కనిపించినా సాధారణంగా ఇది కూడా మహిళల్లోనే ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థలో వచ్చే లోపాల వల్ల హైపోథైరాయిడిజమ్ కనిపిస్తుంది. తీవ్రమైన అలసట/ మందకొడిగా ఉండటం, డిప్రెషన్, బరువు పెరగడం, చర్మం పొడిగా మారడం, మలబద్దకం, రుతుక్రమం సక్రమంగా రాకపోవడం వంటి లక్షణాలతో కనిపిస్తుంది. యుక్తవయస్కుల్లో హైపోథైరాయిడిజమ్ వచ్చినప్పుడు సక్రమంగా చికిత్స అందించకపోతే వారు అలసిపోయినట్లుగా ఉండి నిత్యజీవన వ్యవహారాల్లో చాలా మందకొడిగా ఉండవచ్చు. కొందరిలో ఈ కండిషన్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగి అవి హృద్రోగాలకు దారితీయవచ్చు. ఒక్కోసారి మైక్సిడిమా కోమా అన్న కండిషన్‌కు దారితీసి ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. గర్భిణుల విషయంలో థైరాక్సిన్ పాళ్లు తగ్గుతున్నాయేమో జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ పరీక్షలు చాలా అవసరం. గర్భిణుల్లో హైపోథైరాయిడిజం అన్నది బిడ్డ మానసిక వికాసానికి కొద్దిగా అంతరాయం కలిగించవచ్చు. అందుకే గర్భిణుల విషయంలో హైపోథైరాయిడిజమ్ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. లెవో థైరాక్సిన్ సోడియమ్ వంటి మందుల ద్వారా దీనికి చికిత్స చేస్తారు. మహిళలకు వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మహిళల క్యాన్సర్లు : గర్భాశయ ముఖద్వార (సర్విక్స్), ఎండోమెట్రియల్, ఒవేరియన్, రొమ్ము క్యాన్సర్ల వంటివి కేవలం మహిళలకే వచ్చే క్యాన్సర్లు. (రొమ్ము క్యాన్సర్ అన్నది కొందరు పురుషుల్లోనూ కనిపించినా అది కాస్తంత అరుదు). సర్విక్స్ క్యాన్సర్ : ఇది మహిళల్లో చాలా ఎక్కువ. ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్ల వస్తుంది. దీని లక్షణాలు... అది అభివృద్ధి చెందడానికి దాదాపు పదేళ్ల ముందే కనిపిస్తాయి కాబట్టి దీన్ని చాలా ముందుగానే కనుక్కోవచ్చు. పరీక్ష/పరిష్కారం : పాప్‌స్మియర్ అనే పరీక్షతో దీన్ని తెలుసుకోవచ్చు. సర్విక్స్ క్యాన్సర్‌ను చాలా ముందుగానే తెలుసుకునేందుకు అవకాశం ఉంది కాబట్టి చికిత్స ద్వారా పూర్తిగా తగ్గించుకునేందుకు ఆస్కారం ఉంది. పైగా ఇప్పుడు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా నివారించుకోవచ్చు. సర్వికల్ క్యాన్సర్‌ను నివారించే వ్యాక్సిన్ 9 నుంచి 45 ఏళ్ల వయసున్న వారు తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్‌ను కలయిక జరగకముందే (యాక్టివ్ సెక్స్ లైఫ్‌కు ముందే) తీసుకోవడం మేలు. అప్పుడు దాని ప్రభావం చాలా ఎక్కువ. రొమ్ము క్యాన్సర్ : దీన్ని నివారించుకోవడం చాలా సులభం. బిడ్డకు రొమ్ముపాలు పట్టడం వల్ల దీన్ని చాలావరకు నిరోధించవచ్చు. పరీక్షలు/పరిష్కారాలు : ప్రతి మహిళా పీరియడ్స్ తర్వాత స్వయంగా చేసుకోదగ్గ రొమ్ము పరీక్ష (సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్) ద్వారా దీన్ని తెలుసుకోవడం చాలా తేలిక. ఒకవేళ ఇది కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఉంటే... ఆ కుటుంబానికి చెందిన మహిళలు తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి సోనోమామోగ్రఫీ వంటి పరీక్షలతో దీన్ని తెలుసుకుంటూ ఉండాలి. 35 ఏళ్ల వయసు తర్వాత ప్రతి మహిళా ఈ పరీక్షను ప్రతి ఏడాదీ విధిగా చేయించుకోవడం మంచిది. బహిష్టుకీ, బహిష్టూకీ మధ్యగాని, సెక్స్ తర్వాత గాని, మెనోపాజ్ తర్వాత చాలా కాలానికి మళ్లీ రక్తస్రావం అయితేగాని ఉన్నా లేదా కడుపు నొప్పిగాని, ఆకలి లేకపోవడం గాని ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ ఎం. రజిని, కన్సల్టెంట్ అబ్స్టిట్రీషియన్ – గైనకాలజిస్ట్, మ్యాక్స్‌క్యూర్ సుయోష ఉమన్ – చైల్డ్ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్ -
చిన్న వ్యాయామం.. రోజుల ప్రయోజనం..
వ్యాయామంతో ఆరోగ్యానికి మేలు జరుగుతుందని మనం చాలాకాలంగా వింటున్నాం. కానీ ఎంత వ్యాయామానికి ఎంత? ఎలాంటి ప్రయోజనం జరుగుతుందన్నది మాత్రం సౌత్‌వెస్ట్‌ర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తమ తాజా పరిశోధన ద్వారా లెక్కకట్టారు. దీని ప్రకారం కేవలం ఒక్కసారి వ్యాయామం చేసినా జీవక్రియలపై దాని ప్రయోజనం కొన్ని రోజులపాటు కొనసాగుతుంది. కచ్చితంగా చెప్పాలంటే మెదడులోని న్యూరాన్లను ప్రభావితం చేయడం ద్వారా ఒక్క వ్యాయామం రెండు రోజుల పాటు జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయని అంటున్నారు కెవిన్ విలియమ్స్ అనే శాస్త్రవేత్త. ఎలుకలపై ప్రయోగాలు చేయడం ద్వారా తాము వ్యాయామం చేసిననప్పుడు పీఎంఓసీ, ఏజీఆర్పీ అనే రెండు న్యూరాన్లు ఎక్కువ విడుదలవుతున్నట్లు ఇవి రెండూ కలిసి మెలనోకార్టిన్స్ అనే రసాయనాలను విడుదల చేస్తున్నట్లు స్పష్టమైందని కెవిన్ చెప్పారు. ఈ మెలనోకార్టిన్స్ మనం ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తూంటుందని చెప్పారు. అరవై నిమిషాలపాటు ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తే పీఎంఓసీ న్యూరాన్ కారణంగా ఆకలి మందగించినట్లు తాము గుర్తించామని, అదేసమయంలో రక్తంలో చక్కెర మోతాదులు కూడా తగ్గాయని కెవిన్ వివరించారు. దీన్ని బట్టి నాలుగు రోజులకు ఒకసారైన ఓ మోస్తరు తీవ్రతతో వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని తెలుస్తున్నట్లు చెప్పారు. -
అప్పట్నుంచి గర్భం రావడం లేదు
నేడు ఐవీఎఫ్ డే నా వయసు 28 ఏళ్లు. పెళ్లయి రెండేళ్లు అవుతోంది. పెళ్లయిన రెండు నెలలకే నాకు గర్భం వచ్చింది. దురదృష్టవశాత్తు పిండం ట్యూబ్‌లో పెరగడం వల్ల లాపరోస్కోపీ చేసి, దాన్ని తొలగించారు. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకొని, గత నాలుగు నెలలుగా ప్రయత్నిస్తున్నాం. అయితే ఇప్పటికీ గర్భం రాలేదు. నా వైద్యచరిత్రను బట్టి నాకు స్వాభావికంగానే గర్భం వస్తుందా లేక డాక్టర్‌ను సంప్రదించాలా తెలపండి. – స్వప్న, విజయవాడ మీకు మున్ముందు స్వాభావికంగానే గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ మీకు కేవలం ఒకే ఫెలోపియన్ ట్యూబ్ మాత్రమే ఉన్నా... అప్పుడు కూడా గర్భం వచ్చే అవకాశాలు తగ్గడం చాలా స్వల్పం మాత్రమే. అయితే మీ ట్యూబ్స్ ఆరోగ్యంగానే ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు ఒకసారి హిస్టెరోసాల్పింగోగ్రామ్ (హెచ్ఎస్జీ) అనే పరీక్ష చేయించుకోండి. ఒకవేళ ట్యూబ్స్ నార్మల్‌గానే ఉంటే మరో 6–8 నెలల్లో మీకు నేచురల్‌గానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామందిలో ఇలా ట్యూబ్‌లో వచ్చే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నది ఒకసారి మాత్రమే వస్తుంది. అంతేగాని ఒకసారి వచ్చింది కదా అని మాటిమాటికీ అదే వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ ఉన్నా మీలో మరోసారి అది వచ్చే అవకాశం కేవలం 10 శాతం మాత్రమే. మరోసారి మీకు గర్భం వచ్చినప్పుడు యుటెరస్‌లో అది సరిగా పెరుగుతోందా లేదా అని తెలుసుకునేందుకు మీరు 6–8 వారాలప్పుడు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి. ఒకవేళ హెచ్ఎస్జీ పరీక్షలో మీ ట్యూబ్ మూసుకుపోయిందని తేలితే, లాపరోస్కోపీ చేయించాల్సి ఉంటుంది. అది చేశాక కూడా ట్యూబ్ తెరచుకోకపోతే అప్పుడు మీకు ఐవీఎఫ్ ప్రక్రియను సూచిస్తాం. ఐదేళ్లలో మూడు అబార్షన్లు... ఎందుకిలా అవుతోంది? నా వయసు 36 ఏళ్లు. పెళ్లయి ఆరేళ్లు అయింది. గత ఐదేళ్లలో మూడు అబార్షన్లు అయ్యాయి. అన్నీ రెండో నెలలోనే అయ్యాయి. ఇలా ఎందుకు జరుగుతోందో అని ఎంతో ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – లావణ్య, విశాఖపట్నం మీకు ఇలా కావడాన్ని రికటెంట్ ప్రెగ్నెన్సీ లాస్‌గా చెప్పవచ్చు. ఇలా జరగడానికి అనేక కారణాలుంటాయి. కొన్ని పరీక్షల ద్వారా మీకిలా జరగడానికి గల కారణాలను అన్వేషించాలి. పెరిగే వయసు, క్రోమోజోమల్ సమస్యలు, యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్, వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన సమస్యలు, హార్మోనల్ సమస్యలు (థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్, పీసీఓఎస్) తో పాటు సెప్టేట్ యుటెరస్ వంటి సమస్యల వంటివి కొన్ని ముఖ్యమైన కారణాలు కావచ్చు. మీ పరీక్షలను బట్టి మీకు ఎలాంటి చికిత్స ప్రక్రియ అవసరమవుతుందో చూడాలి. ఆ తర్వాత ఆ చికిత్సను అందించాలి. కొన్నిసార్లు వైద్యపరీక్షలు చేశాక కూడా సమస్యకు గల కారణాలు తెలియకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో సమస్యంతా అండం లేదా శుక్రకణాల్లో నాణ్యత లేకపోవడం కావచ్చు. ఇలాంటప్పుడు వారు ఐవీఎఫ్ వంటి ప్రక్రియలకు వెళ్లవచ్చు. రుతుక్రమం సక్రమంగా రావడం లేదు... ఎందుకు? ఏం చేయాలి? నా వయసు 26 ఏళ్లు. నా ఎత్తు ఐదడుగుల రెండు అంగుళాలు. బరువు 50 కిలోలు. నాకు మొదట్లో రుతుక్రమం సరిగా వచ్చేది కాదు. ఒక్కోసారి 2 – 3 నెలలకు ఒకసారి వచ్చేది. దాంతో కొన్నిసార్లు టాబ్లెట్లు కూడా వాడాల్సి వచ్చేది. నాకు రుతుక్రమం సక్రమంగా వచ్చేందుకూ, ఆ తర్వాత గర్భధారణ కూడా జరిగేందుకు ఎలాంటి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందో తెలపండి. – స్వాతి, కరీంనగర్ మీకు రుతుక్రమం సక్రమంగా రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది హార్మోన్లలో అసమతౌల్యత. దాని కారణంగా పీసీఓఎస్, థైరాయిడ్ సమస్యల వంటివి రావచ్చు. థైరాయిడ్ సమస్య కారణంగా ఇలా జరుగుతుంటే దాన్ని మందులతో తేలిగ్గా నయం చేయవచ్చు. పీసీఓఎస్ అయితే గర్భధారణ కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు హార్మోన్లను ఇస్తూ సమస్యను చక్కదిద్దాల్సి ఉంటుంది. అలాగే అండం పెరగడానికి కూడా మందులు వాడాల్సి ఉంటుంది. మీలాంటి సమస్య ఉన్నవారిలో చాలామంది కొన్ని ప్రాథమిక చికిత్సల తర్వాతే గర్భవతులు అవుతుంటారు. ఇక ఇలా రుతుక్రమం సక్రమంగా రాకపోవడానికి మరో కారణం అండాల సంఖ్య, నాణ్యతల్లో మార్పులు రావడం. సాధారణంగా మహిళల్లో 35 ఏళ్ల తర్వాత అండం నాణ్యత క్రమంగా తగ్గుతూ పోతుంటుంది. అయితే కొందరిలో అది 20 ఏళ్ల వయసప్పటి నుంచే తగ్గుతూ పోతుంటుంది. అందుకే ఇలాంటి వారు గర్భధారణకు ప్లాన్ చేసుకుంటే కొన్ని రకాల పరీక్షలు తప్పక అవసరమవుతాయి. పరీక్షలన్నీ నార్మల్... కానీ శుక్రకణాల్లో కదలికలు తగ్గాయంటున్నారు... నా వయసు 29 ఏళ్లు. నా భర్త వయసు 35 ఏళ్లు. గత రెండుళ్లుగా మేం సంతానం కోసం ప్రయత్నిస్తున్నాం. అన్ని పరీక్షలూ చేయించుకున్నాం. అన్నీ నార్మల్ అని తేలింది. అయితే నా భర్తకు డయాబెటిస్ ఉంది. దాంతో ఆయన శుక్రకణాల్లో కదలికలు తగ్గాయని తేలింది. దీనివల్ల నాకు గర్భం వచ్చే అవకాశాలు తగ్గుతాయా? నాకు తగిన సలహా ఇవ్వండి. –ఒక సోదరి, నెల్లూరు పురుషుల్లో రక్తంలోని చక్కెర అనియంత్రితంగా ఉన్నప్పుడు శుక్రకణాల నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో వాటి కదలికలు కూడా తగ్గడమే గాక, వాటి ఆకృతిలోనూ మార్పులు వస్తాయి. ఇలా డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్ఫెక్షన్లు వచ్చే రిస్క్ కూడా ఎక్కువే. ఇక కలయికకు సంబంధించిన కొన్ని సమస్యలు కూడా ఉండవచ్చు. వీటన్నింటి ప్రభావం గర్భధారణ అవకాశాల మీద పడుతుంది. అందుకే మీరు గర్భధారణ ప్లాన్ చేసుకునే ముందుగా మీ భర్త చక్కెర పరీక్షలు చేయించడం అవసరం. దాన్ని బట్టి తదుపరి కార్యాచరణను డాక్టర్లు నిర్ణయిస్తారు. - డాక్టర్ ప్రీతిరెడ్డి సీనియర్ కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, బర్త్ రైట్ బై రెయిన్బ, హైదరాబాద్ -
అప్పుడు బెణికిన కాలు ఇప్పటికీ నొప్పి... ఎందుకు?
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నేనొక అథ్లెట్‌ను. ప్రాక్టీస్‌లో ఆర్నెల్ల క్రితం నా కాలు స్లిప్ అయ్యి, నా చీలమండ బెణికింది. అప్పట్లో ప్లాస్టర్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు, నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం తర్వా కూడా ఇలా ఎందుకు నొప్పి వస్తోంది. – శ్రీదేవి, ఖమ్మం మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ ఎలాస్టిసిటీని కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత చిన్న వయసులోనే మోకాళ్లలో నొప్పి నా వయసు 29 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నేను రెండు మోకాళ్లోనూ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా వస్తోంది. నేను చాలా రకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఈ చిన్న వయసులోనే ఇలా కావడం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. – సాయి ప్రసాద్, ఏలూరు మీ సమస్యను నిశితంగా పరిశీలించినట్లయితే మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో వచ్చే సమస్యే ఇది. ఇది కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏదైనా బరువులు ఎత్తినప్పుడు దానిపై పడే అదనపు భారం వల్లనే ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇదేమీ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్య కాబోదు. కాబట్టి ఆందోళన పడకుండా మీకు ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. మోకాళ్లలో కిలూ బ్రికెంట్స్తో నొప్పి తగ్గుతుందా? నా వయసు 54 ఏళ్లు. నాకు రెండు మోకాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తోంది. దాదాపుగా ఏడాది నుంచి ఈ నొప్పి ఉంది. ఇది క్రమంగా పెరుగుతోంది. కుడి మోకాలి నొప్పి కాస్త భరించగలిగేట్లు ఉన్నా ఎడమ మోకాలిలో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఎడమ మోకాలిలో తీవ్రమైన ఆర్థరైటిస్ ఉందనీ, కుడి మోకాలిలో దాని తీవ్రత ఒకింత తక్కువగా ఉందని అంటున్నారు. ఈ మోకాళ్లలోకి కందెనలాగా (ల్యూబ్రికెంట్ పనిచేసే) అత్యంత ఆధునికమైన ఇంజెక్షన్లు ఇస్తామని అంటున్నారు. దాంతో ఆర్థరైటిస్ నొప్పులూ, మోకాళ్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు. ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు వాకబు చేస్తే కాస్త ఎక్కువే ఉంది. అంత ఖరీదైన ఇంజెక్షన్స్‌ను భరించే స్తోమత నాకు లేదు. అందుకే నాకు తగిన సలహా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి నాకు తగిన పరిష్కారం చెప్పండి. – కె. గోపాల్‌రావు, నిజామాబాద్ మీరు చెప్పిన కందెనలా పనిచేసే ల్యూబ్రెకెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అవి మరీ ఆధునికమైనవేమీ కాదు. గత 20 ఏళ్లుగా డాక్టర్లు వాడుతున్నవే. అవి కేవలం చాలా తక్కువ నుంచి ఒక మోస్తరు ఆర్థరైటిస్ ఉన్నవారికి మాత్రమే ఉపకరిస్తాయి. పైగా అవి లక్షణాల తీవ్రతను తగ్గించడం మాత్రమే చేస్తాయి. అంతేకాదు... ఆర్థరైటిస్ పెరగడాన్ని ఒకింత తగ్గిస్తాయి. మిగతా కార్టిలేజ్‌ను బలం పుంజుకునేలా చూస్తాయి. అంతేగానీ వాటివల్ల శాశ్వత పరిష్కారం రాదు. పైగా తీవ్రమైన ఆర్థరైటిస్ ఉన్నవారికి వాటి వల్ల ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్ ఉన్నవారికి అప్పటికే కార్టిలేజ్ దెబ్బతిని ఉంటుంద కాబట్టి వాటి వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. మీ విషయానికి వస్తే అది కుడి కాలికి కొంత ప్రయోజనం చేకూర్చవచ్చు. ఎడమకాలికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. అందుకే దానివల్లనే అంతా చక్కబడుతుందని అనుకోవద్దు. మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన వైద్యసహాయం పొందండి. క్యాల్షియమ్ తీసుకున్నా ఎందుకు నాకీ పరిస్థితి? నా వయసు 54 ఏళ్లు. ఏడేళ్ల క్రితం రుతుక్రమం ఆగిపోయింది. రుతుక్రమం ఆగిన వాళ్లంతా జీవితాంతం క్యాల్షియమ్ ఎక్కువగా తీసుకోవాలని ఎక్కడో చదివి, అప్పట్నుంచి క్యాల్షియమ్ మాత్రలు వాడుతున్నాను. వారం కిందట తీవ్రమైన వెన్నునొప్పితో డాక్టర్‌ను కలిశాను. ఆయన ఎక్స్‌రే తీయించి ఆస్టియోపోరోసిస్ అన్నారు. నేను క్యాల్షియమ్ వాడుతున్నా ఇలా ఎందుకు జరిగింది. – రాజేశ్వరి, సికింద్రాబాద్ క్యాల్షియమ్ తగ్గడం వల్ల ఎముకలు పెళుసుబారి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఎముకలు గుల్లబారడం ఆస్టియోపోరోసిస్‌లో ప్రధానంగా జరిగే ప్రక్రియ. మనందరిలోనూ వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతోకొంత ఆస్టియోపోరోసిస్ కనిపిస్తుంటుంది. అయితే మీరు చెప్పినట్లుగానే మహిళల్లో రుతుక్రమం ఆగిపోయాక ఆస్టియోపోరోసిస్ కనిపించడం సాధారణంగా కనిపించేదే. దీనికి కేవలం క్యాల్షియమ్ టాబ్లెట్లు తీసుకోవడం మాత్రమే సరిపోదు. దానితో పాటు ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకిపోయేలా క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం చేయకుండా కేవలం క్యాల్షియమ్ తీసుకుంటూ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు పోతూ ఉంటుంది. లేదా కొందరిలో అది మూత్రపిండాల్లో పోగుపడి కిడ్నీ స్టోన్‌గా కూడా పరిణమించవచ్చు. అందుకే మీరు క్యాల్షియమ్ తీసుకుంటూ ఉండటంతో పాటు వాకింగ్, జాగింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలలో మీకు అనువైన దాన్ని ఎంచుకొని, క్రమం తప్పకుండా చేస్తూ ఉండటం. ఇక మంచి పోషకాహారాన్ని అంటే... పాలు, పాల ఉత్పాదనలు, ఆకుకూరలు వంటి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే మీరు క్యాల్షియమ్ టాబ్లెట్స్ కూడా వాడాల్సిన పనిలేదు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఆస్టియోపోరోసిస్‌ను ఎక్స్‌రే ద్వారా నిర్ధారణ చేయరు. డాక్టర్లు ఆస్టియోపోరోసిస్‌ను అనుమానించినప్పుడు డెక్సా స్కాన్ (బోన్ డెన్సిటోమెట్రీ) చేయిస్తారు. ఇందులో ఎముక సాంద్రతను తెలుసుకోవచ్చు. మీరు మరోసారి మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్ -
రక్తంతో కథ రాయండి
‘నైన్.. ఎ మూవ్మెంట్’ పేరుతో మే 25న ఒక వెబ్సైట్ ప్రారంభం కాబోతోంది. గర్ల్స్.. ఇందులో మీరూ భాగస్వాములు కావచ్చు. మీ మెన్స్ట్రువల్ స్టోరీలను షేర్ చేసుకోవచ్చు. రుతుక్రమం ప్రారంభం అయ్యేనాటికి భోలీ వయసు పన్నెండేళ్లు. తొలిసారి తన ఒంట్లోంచి వచ్చిన రక్తపు చారికను చూడగానే భయపడిపోయి తల్లి దగ్గరకు పరుగు తీసింది. ‘నువ్వు పెద్దమనిషివి అయ్యావు. ఇక నుంచీ కుదురుగా ఉండాలి’ అని తల్లి చెప్పింది. భోలీ ‘హా!’ అంది. తల్లి ఆమెను గుండెలకు హత్తుకుంది. మెత్తటి ఎండు గడ్డిని తెచ్చి, పలుచటి గుడ్డలో చుట్టి ‘ఇదిగో.. దీనిని అదిమి ఉంచు. రక్తాన్ని పీల్చుకుంటుంది’ అని చెప్పింది. ‘‘ఐదు రోజులు నువ్వు ఇంట్లోకి రాకూడదు. ఆ గొడ్ల చావిడిలోనే ఉండాలి’’ అని చెప్పింది. ఇదంతా భోలీకి వింతగా తోచింది. గడ్డి.. గొడ్ల చావిడి ఆ తర్వాత మూడు నెలలు భోలీ ఇలాగే చేసింది. నెలసరి రాగానే గుడ్డలో చుట్టిన గడ్డిని అదిమి ఉంచడం, గొడ్లచావిడిలో ఉండటం! అయితే ఆ గడ్డిలోంచి ఒక పురుగు ఆమె జననాంగంలోకి వెళ్లిన సంగతి ఆమెకు తెలీదు. చివరికి ఇన్ఫెక్షన్ అయి, ఆమె గర్భసంచిని తొలగించవలసి వచ్చింది. భోలీ ఇక ఎప్పటికీ తల్లి కాలేదన్న చేదు నిజం తెలిసి, తల్లి కుదేలైపోయింది. ‘నెలసరి వయసు’లో ఉన్న బాలికలు, మహిళల సంఖ్య ఇండియాలో 35 కోట్ల 50 లక్షల మంది వరకు ఉంది. వీరిలో దాదాపు 82 శాతం మంది రుతుస్రావాన్ని ఆపడానికి పాత గుడ్డపేలికల్ని, ఇసుకను వాడుతున్నారు! చదువు లేకపోవడం, చెప్పేవాళ్లు లేకపోవడం, పేదరికం.. ఇలాంటి అనేక కారణాల వల్ల రుతుక్రమాన్ని ఆరోగ్యవంతంగా దాటడం అనే హక్కును వీళ్లు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఇప్పుడు ‘నైన్’ అనే ఉద్యమం మొదలైంది. నూటికి ఎనభై మంది ఇంతే! రుతుక్రమ పరిశుద్ధత కోసం ‘18 టు 82 బ్రిడ్జ్ ది గ్యాప్’ అనే నినాదంతో ‘నైన్’ ముందుకు వస్తోంది. పైన మీరు చదివిన భోలీ అనే బాలిక కథ నైన్ విడుదల చేసిన వీడియోలోనిదే. 18 అన్నది శానిటరీ నేప్కిన్లు వాడుతున్న మహిళల శాతం. 82 అన్నది.. భోలీలా అనారోగ్యకరమైన విధానాలు పాటిస్తున్న మహిళల శాతం. దేశంలోని మహిళలందరికీ మెరుగైన రుతుక్రమ ఆరోగ్యంపై అవగాహన కల్పించి.. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన ప్యాడ్లను అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో అమర్ తులసియన్ అనే సోషల్ ఆంట్రప్రెన్యూర్ ‘నైన్’ అనే ఈ ఉద్యమానికి రూపకల్పన చేశారు. ‘నైన్.. ఎ మూవ్మెంట్’ పేరుతో మే 25న ఒక వెబ్సైట్ ప్రారంభం కాబోతోంది. సైట్ హోమ్ పేజీలో కనిపిస్తున్న రెండు అందమైన కళ్లను బట్టి నైన్ అనే పేరును ‘నయన’అనే అర్థంలో వాడారని తెలుస్తోంది. గర్ల్స్.. ఇందులో మీరూ భాగస్వాములు కావచ్చు. మీ మెన్స్ట్రువల్ స్టోరీలను షేర్ చేసుకోవచ్చు. రుతుక్రమ పరిశుభ్రతపై సదస్సు మే 28 ‘మెన్స్ట్రువల్ హైజీన్ అవేర్నెస్ డే’. వచ్చే ఐదేళ్లలో రుతుక్రమ పారిశుద్ధ్యంపై అవగాహన కోసం తను ఏం చేయబోతున్నది ‘నైన్’ ఆ రోజున వెల్లడిస్తుంది. ‘ప్యాడ్‌మ్యాన్’ చిత్రంతో ఇదే అంశంపై అనేక ప్రచార ఉద్యమాల్లో పాల్గొన్న అక్షయ్ కుమార్‌తో పాటు ఇతర బాలీవుడ్ ప్రముఖులు, విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, ప్రభుత్వ అధికారులు, సామాజిక కార్యకర్తలు, పారిశ్రామికవేత్తలు, ఎన్జీవోలు, థాట్ లీడర్లు.. అంతా ఆరోజు జరిగే భారీ సదస్సులో మెన్స్ట్రువల్ హైజీన్ పై మాట్లాడతారు. ‘పైకి మాట్లాడదాం. పాత అలవాటును మాన్పిద్దాం’ అనే థీమ్‌తో ముంబైలో ఈ సదస్సు జరగబోతోంది. మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. ఇల్లు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మహిళను ఆరోగ్యంగా ఉంచే బాధ్యత ఇంటిదీ, సమాజానిదే. -
క్యాల్షియమ్ టాబ్లెట్లు తీసుకుంటున్నా ఆస్టియోపోరోసిస్ వస్తుందా?
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 53 ఏళ్లు. ఏడేళ్ల కిందట రుతుక్రమం ఆగిపోయింది. రుతుక్రమం తగ్గిన వాళ్లంతా జీవితాంతం క్యాల్షియమ్ ఎక్కువగా తీసుకోవాలని ఎక్కడో చదివాను. అప్పట్నుంచి క్రమం తప్పకుండా క్యాల్షియమ్ మాత్రలు వాడుతున్నాను. వారం రోజుల కిందట తీవ్రమైన వెన్నునొప్పితో డాక్టర్‌ను కలిశాను. ఆయన కొన్ని పరీక్షలు చేయించి ఆస్టిపోరోసిస్ అన్నారు. నేను క్యాల్షియమ్ వాడుతున్నా ఇలా ఎందుకు జరిగింది? – ఒక సోదరి, విజయవాడ క్యాల్షియమ్ తగ్గడం వల్ల ఎముకలు పెళుసుబారి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఎముకలు గుల్లబారడం ఆస్టియోపోరోసిస్‌లో ప్రధానంగా జరిగే ప్రక్రియ. మనందరిలోనూ వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతోకొంత ఆస్టియోపోరోసిస్ కనిపిస్తుంటుంది. అయితే మీరు చెప్పినట్లుగానే మహిళల్లో రుతుక్రమం ఆగిపోయాక ఆస్టియోపోరోసిస్ కనిపించడం చాలా సాధారణంగా జరిగేదే. దీనికి కేవలం క్యాల్షియమ్ టాబ్లెట్లు తీసుకోవడం మాత్రమే సరిపోదు. దానితో పాటు ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకిపోయేలా క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం చేయకుండా కేవలం క్యాల్షియమ్ తీసుకుంటూ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు పోతూ ఉంటుంది. లేదా కొందరిలో అది మూత్రపిండాల్లో పోగుపడి కిడ్నీ స్టోన్‌గా కూడా పరిణమించవచ్చు. అందుకే మీరు క్యాల్షియమ్ తీసుకుంటూ ఉండటంతో పాటు వాకింగ్, జాగింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలలో మీకు అనువైన దాన్ని ఎంచుకొని, క్రమం తప్పకుండా చేస్తూ ఉండటం. ఇక మంచి పోషకాహారాన్ని అంటే... పాలు, పాల ఉత్పాదనలు, ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు వంటివి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే మీరు క్యాల్షియమ్ టాబ్లెట్స్ వాడాల్సిన పని కూడా ఉండదు. ఇంకా నొప్పి తగ్గడం లేదెందుకు? నా వయసు 27 ఏళ్లు. ఈమధ్యే నేను బైక్‌పైనుంచి కింద పడ్డాను. మోకాలు కొద్దిగా వాచింది. దానిపై ఏమాత్రం భారం వేయలేకపోతున్నాను. డాక్టర్గారికి చూపిస్తే ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్ ఏమీ లేదని చెప్పారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. – ప్రమోద్‌కుమార్, ఖమ్మం మీకు బహుశా మోకాలిలో ఉన్న కీలకమైన లిగమెంట్లు చీరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి గాయాలు బైక్ యాక్సిడెంట్లలో చాలా సాధారణంగా జరుగుతుంటాయి. దీనికోసం ఎమ్మారై స్కాన్ అవసరం. ఇలాంటి గాయాలకు చాలా త్వరగా చికిత్స అందించాలి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... ఎలాంటి ఫ్రాక్చర్ లేదనే అపోహతో చికిత్స ఆలస్యం చేసినట్లయితే మీలాంటి యువకుల్లో అది భవిష్యత్తులో మరింత సమస్య కావచ్చు. మీరు వీలైనంత త్వరగా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించండి. ల్యూబ్రికెంట్ ఇంజెక్షన్‌తో ప్రయోజనం ఉంటుందా? నా వయసు 56 ఏళ్లు. నాకు గత కొంతకాలంగా రెండు మోకాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తూ అది క్రమంగా పెరుగుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఆర్థరైటిస్ అన్నారు. మోకాళ్లలోకి కందెనలాగా (ల్యూబ్రికెంట్ పనిచేసే) అత్యంత ఆధునికమైన ఇంజెక్షన్లు ఇస్తామని అంటున్నారు. వాటితో ప్రయోజనం ఉంటుందా? సలహా ఇవ్వండి. – సీతారామమోహన్‌రావు, విశాఖపట్నం మీరు చెప్పిన కందెనలా పనిచేసే ల్యూబ్రెకెంట్స్ చాలాకాలంగా అందుబాటులో ఉన్నావే. కాబట్టి అవి మరీ ఆధునికమైనవేమీ కాదు. దాదాపుగా గత 20 ఏళ్లుగా డాక్టర్లు వాడుతున్నవే. అయితే అవి కేవలం చాలా తక్కువ నుంచి ఒక మోస్తరు ఆర్థరైటిస్ ఉన్నవారికి మాత్రమే ఉపకరిస్తాయి. పైగా అవి లక్షణాల తీవ్రతను కొంతవరకు మాత్రమే తగ్గిస్తాయి. అంతేతప్ప వాటివల్ల శాశ్వత పరిష్కారం రాదు. ఇక మోడరేట్ ఆర్థరైటిస్ వారికే తప్ప సివియర్ ఆర్థరైటిస్ ఉన్నవారికి వాటి వల్ల ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్ ఉన్నవారికి అప్పటికే కార్టిలేజ్ దెబ్బతిని ఉంటుంది కాబట్టి వాటి వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. అందువల్ల ఆ ఇంజెక్షన్లతో అద్భుతాలు జరుగుతాయని ఆశించకండి. మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన వైద్యసహాయం పొందండి. నా వయసు 57 ఏళ్లు. నేను నాలుగేళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను కలిస్తే... నాకు ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పి, క్యాల్షియమ్ ప్రిస్క్రయిబ్ చేశారు. చాలాకాలంగా వాడుతున్నా నొప్పి తగ్గడం లేదు. దీర్ఘకాలికంగా క్యాల్షియమ్ వాడుతుంటే కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని నేను ఈ మధ్యనే చదివాను. అప్పట్నుంచి నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నాకు సలహా ఇవ్వగలరు. – ఆర్. మంజరి, సూళ్లూరుపేట ఆస్టియో ఆర్థరైటిస్‌లో మొదట ఎముకల చివరల (అంటే కీళ్ల ఉపరితలంలో) ఉండే చిగురు ఎముక (కార్టిలేజ్) క్రమంగా అరిగిపోతుంది. కార్టిలేజ్‌లో క్యాల్షియమ్ ఉండదు. బహుశా మీ డాక్టర్ క్యాల్షియమ్ ఇచ్చింది మీ ఆస్టియో ఆర్థరైటిస్‌కు అయి ఉండదు. మీ సంపూర్ణ ఆరోగ్యం కోసం మందులతో పాటు ఆయన క్యాల్షియమ్‌ను కూడా సూచించి ఉంటారు. ఆర్థరైటిస్‌కు కేవలం క్యాల్షియమ్తో గుణం కనిపించదు. మీ మోకాలి నొప్పి తగ్గదు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ‘ఆస్టియో ఆర్థరైటిస్’కు కాకుండా... ‘ఆస్టియో పోరోసిస్’ కండిషన్లో మీ ఎముకలు బలహీనం అయిపోకుండా చూడటానికి క్యాల్షియమ్‌ను డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తారు. మీరు మరోసారి మీ డాక్టర్ గారిని సంప్రదించండి. గాయం తగ్గింది... కానీ ఇప్పటికీ నొప్పి ఎనిమిది నెలల కిందట నా కాలు స్లిప్ అయ్యి, నా చీలమండ బెణికింది (ట్విస్ట్ అయ్యింది). అప్పట్లో ప్లాస్టర్ కూడా వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి వస్తూనే ఉంది. అప్పడప్పుడూ అక్కడ వాపు కూడా వస్తోంది. ఇంతకాలం తర్వాత కూడా ఇలా ఎందుకు నొప్పి వస్తోంది. – సుధారాణి, మాచర్ల మీ కాలు బెణికినప్పుడు మీ చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్ -
పావనీ.. ప్రెజెంట్ సార్.. యామినీ.. ప్రెజెంట్ సార్!
ఏడాదిలో ముప్పై రోజులకు పైగా బాలికలు స్కూలుకు రాకపోవడంపై పరిశీలన జరిపించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. అందుకు కారణం ‘రుతుక్రమం’ అని గుర్తించింది. వారి హాజరు శాతాన్ని పెంచేందుకు ‘అస్మిత’ అనే పథకాన్ని మార్చి ఎనిమిది నుంచి అమలుచేయబోతోంది. ఆ పథకంలో మీరూ పాలుపంచుకోవచ్చు. ఓ అనాథ బిడ్డను ఏడాది పాటు దత్తత తీసుకున్నాం అనుకోండి. దానర్థం.. ఒక ఏడాదిపాటు ఆ బిడ్డ పోషణకు అయ్యే ఖర్చును విరాళంగా ఇవ్వడం అన్నమాట. అలాగే ఒక విద్యార్థిని దత్తత తీసుకుంటే వారి చదువుకు ఏడాదికయ్యే ఖర్చును స్పాన్సర్ చెయ్యడం. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే ఫార్ములాను బాలికలలో ‘రుతుక్రమ పరిశుభ్రత’ కోసం అనుసరించబోతోంది. ప్రతి నెలా ‘పరీక్షా సమయమే’! గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే.. అమ్మాయిల సంఖ్య బాగా తక్కువగా ఉంటుంది. వారిలోనూ కనీసం ఐదవ తరగతైనా పూర్తి చేసే అమ్మాయిలు మరీ తక్కువ. అసలు వాళ్లు అక్కడి వరకు రావడమే పెద్ద విజయం అన్నట్లు ఉంటాయి బాలికలకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులు. ఐదవ తరగతిని కూడా దాటుకుని ఎనిమిది, తొమ్మిది క్లాసులకొచ్చేటప్పటికి వారి హాజరు శాతం మరింత పడిపోతోంది. ఏడాదిలో ముప్పై రోజులకు పైగా ఆ తరగతి బాలికలు స్కూలుకు రాలేకపోతున్నారు! ఈ పరిస్థితిపై పరిశీలన జరిపించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. అందుకు కారణం ‘రుతుక్రమం’ అని గుర్తించింది. మనసు బడిలో.. మనిషి ఇంట్లో.. పరిశుభ్రమైన పద్ధతుల్లో నెలనెలా రుతుక్రమాన్ని దాటుకుని రావడం గ్రామాల్లోని విద్యార్థినులకు ఒక సమస్యగా పరిణమిస్తోంది. డబ్బు పెట్టి ప్యాడ్స్ కొని వాడలేరు. దాంతో నెలకు నాలుగు రోజులు వారిని ఇంట్లోనే ఉంచేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ పరిస్థితిని గుర్తించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే ఓ కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. రుతుక్రమ పరిశుభ్రత గురించి తెలియజెప్పి ఊరుకుంటే సరిపోదు, అంతకు మించిన సహకారం బాలికలకు ఉండాలని భావించారు. ఫలితమే.. ‘అస్మిత’ ప్రోగ్రామ్. ప్రభుత్వమే ‘ప్యాడ్మాన్’ అయింది! గ్రామాల్లో అల్పాదాయ వర్గాల బాలికలకు ఏడాదికి దాదాపుగా 183 రూపాయలు రుతుక్రమ పరిశుభ్రత కోసం ఖర్చు చేయడం కష్టమైన పని. అందుకని ప్రభుత్వమే నామమాత్రపు ధరకు ప్యాడ్లను అందించాలని సంకల్పించింది. ఇందుకోసం ‘అస్మిత’ అనే పేరుతో ఒక పోర్టల్ ప్రారంభించబోతోంది. అందులో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల పేర్లు, వాటిల్లో చదువుకుంటున్న విద్యార్థినుల పేర్లు ఉంటాయి. వారందరికీ అస్మిత కార్డు ఇస్తారు. ఆ కార్డు ఉన్న అందరికీ ప్రతి నెలా... ఎనిమిది శానిటరీ ప్యాడ్స్ ఉన్న ప్యాకెట్‌ను ఐదు రూపాయలకే అందిస్తారు. వీటి పంపిణీ బాధ్యతను స్థానిక స్వయం సహాయక గ్రూపులు తీసుకుంటాయి. ప్యాడ్ల తయారీకి పాతిక నుంచి ముప్పై రూపాయలవుతుంది. ఐదు రూపాయలు పోగా మిగిలిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. మనమూ ప్యాడ్మాన్ కావచ్చు! గ్రామీణ బాలికలకు సహాయం చేయాలనుకునే వాళ్లు ఆన్లైన్లో అస్మిత పోర్టల్‌లోకి వెళ్లి ఒక బాలికకు ఒక ఏడాదికి అయ్యే ఖర్చు 183 రూపాయలను విరాళంగా ఇవ్వవచ్చు. ఈ స్కీమ్‌ని మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభిస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంలో మనం అరుణాచలం మురుగనాథమ్ సేవల్ని తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. ‘ప్యాడ్‌మ్యాన్’ చిత్ర దర్శక నిర్మాతలకు ప్రేరణనిచ్చిన నిజజీవితపు ప్యాడ్‌మ్యాన్ అరుణాచలం మురుగనాథమ్.. బాలికలలో రుతుక్రమ బిడియాన్ని పోగొట్టి, వారు చదువులో వెనుకబడకుండా తోడ్పాటునివ్వగలిగారు. – మంజీర -
రుతుసమయంలో శ్వాస అందడం లేదెందుకు?
నా వయసు 38 ఏళ్లు. గృహిణిని. నాకు రుతుసమయంలో శ్వాస అందదు. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి? – ఆర్. రజిత, ఖమ్మం రుతుసమయం కూడా ఒక కీలకమైన దశ. ఆ సమయంలో మీ భౌతిక, మానసిక, ప్రవర్తనల్లో ఎన్నో మార్పులు కనిపించవచ్చు. రుతుక్రమం మహిళల ఆరోగ్యం విషయంలో కీలక భూమిక పోషిస్తుంటుంది. తద్వారా అటు శరీరక, ఇటు మానసిక సమస్యలకు అది దారితీయవచ్చు.కెటామెనియల్ ఆస్తమాను రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్ ఆస్తమా)గా కూడా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం వంటి సందర్భాలూ ఉన్నాయి. పీరియడ్స్‌కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు. ఇక అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాజ్ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్‌కు ముందు ఇవే పాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్‌లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అలాగే రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే... రుతుక్రమం సమయంలో ఆస్తమా కనిపిస్తే దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం. ఇక మీకు ఏ అంశం ఆస్తమాను పేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్‌ను కలవండి. పాప్‌కార్న్ లంగ్ అంటే ఏమిటి? నా వయసు 47 ఏళ్లు. చాలా చిన్న వయసు నుంచే స్మోకింగ్ మొదలుపెట్టి కొంతకాలం కిందటే ఆ అలవాటు మానేశాను. అప్పట్నుంచి ఎలక్ట్రానిక్ సిగరెట్ మొదలుపెట్టాను. అయితే అది కూడా వద్దనీ, దానివల్ల పాప్‌కార్న్ లంగ్ రావచ్చని డాక్టర్ అయిన నా ఫ్రెండ్ చెబుతున్నారు. ఈ ‘పాప్‌కార్న్’ లంగ్ అంటే ఏమిటి?– నాగేశ్వర్రావు, హైదరాబాద్ పాప్‌కార్న్ లంగ్ అనేది చాలా ప్రమాదకరమైన, రివర్స్ చేయలేని సంక్లిష్టమైన సమస్య. దీన్ని నిర్ధారణ, చికిత్స... రెండూ కష్టమే. దీన్నే వైద్యపరిభాషలో బ్రాంకోలైటిస్ ఆబ్లిటేరన్స్ అంటారు. నేషనల్ జ్యూయిష్ హెల్త్ హాస్పిటల్స్ ప్రకారం కృత్రిమ వెన్నను దీర్ఘకాలం పాటు వాడినా, పొగతాగే అలవాటు ఉన్నా ఇది రావచ్చు. కృత్రిమ వెన్నలో తొందరగా ఆవిరయ్యే ‘డై అసిటైల్’ అనే ఒక రసాయన పదార్థం ఉంటుంది. సాధారణంగా దీన్ని ఆల్కహాలిక్ పానీయాల్లో ఉపయోగిస్తుంటారు. అలాగే కొన్ని ఆహారపదార్థాల్లోనూ కలుపుతుంటారు. పాప్‌కార్న్‌లను వెన్నలో బదులు దీనిలో వేపుతుంటారు. దాని కారణంగా ఊపిరితిత్తులకు వచ్చే సమస్య కాబట్టి ఈ జబ్బును సాధారణ పరిభాషలో ‘పాప్‌కార్న్ లంగ్’ అంటుంటారు. పొడిదగ్గు, పిల్లికూతలు, ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. వీటితో పాటు అలసట, జ్వరం, రాత్రివేళల్లో ఒళ్లు చెమటలు పట్టడం, ఆయాసం వంటివీ కనిపించే ఇతర లక్షణాలు. దీన్ని నిర్ధారణ చేయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఎక్స్–రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలతో పాప్‌కార్న్ లంగ్‌ను నిర్ధారణ చేయాలి. కానీ అవి మాత్రమే నిర్ధారణ పరీక్షలు కాదు. ఒకసారి ఇది వస్తే మళ్లీ మామూలుగా కావడం కష్టం. అది దాదాపు అసాధ్యం కూడా. అందుకే రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగే అలవాట్లు, కృత్రిమ వెన్న నుంచి దూరంగా ఉండాలి. దీనికి స్టెరాయిడ్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. వాళ్లలో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావాలి. ఒకవేళ అలా చేయలేకపోతే ఊపిరితిత్తుల మార్పిడి చేయడం ఒకే ఒక మార్గం. కాబట్టి ముందు నుంచే దీన్ని నివారించుకోవడం చాలా మేలు. అందుకోసం ఏ రూపంలో పొగతాగే అలవాటున్నా దాన్ని వదులుకోవడమే మేలు. ఏమిటీ ‘ఫంగల్ బాల్’? కొన్నేళ్ల క్రితం నాకు టీబీ వచ్చింది. అయితే కొద్దిరోజులుగా నేను తీవ్రంగా దగ్గుతున్నాను. రక్తం కూడా పడుతోంది. డాక్టర్‌కు చూపించుకుంటే కొన్ని పరీక్షలు చేసి ఊపిరితిత్తుల్లో ‘ఫంగల్ బాల్’ ఉందని చెప్పారు. నాకు ఆందోళనగా ఉంది. ఫంగల్బాల్ అంటే ఏమిటి? – వినయ్‌కుమార్, రాజమండ్రి ఫంగల్ బాల్ సమస్య ఊపిరితిత్తులోనే గాక మెదడు, కిడ్నీ, ఇంకా ఇతర ఏదైనా అవయవంలో ఏర్పడవచ్చు. మీ విషయంలో ఊపిరితిత్తులలోని ఖాళీ ప్రదేశంలో (లంగ్ క్యావిటీలో) యాస్పర్జిల్లస్ అనే ఫంగస్ ఒక ఉండలా ఏర్పడటం వల్ల ఈ సమస్య వచ్చింది. సాధారణంగా యాస్పర్జిల్లస్ ఫ్యూమిగేటస్ అనే రకానికి చెందిన ఫంగస్ మానవుల్లో పెరుగుతుంది. మానవుల్లోని వ్యాధి నిరోధకత కేవలం కణజాలానికే పరిమితం. లంగ్‌లో ఉండే ఖాళీ ప్రదేశాలలోకి (క్యావిటీస్లోకి) చొచ్చుకుపోలేకపోవడం వల్ల ఆ ప్రదేశాల్లో పెరిగే ఫంగస్‌ను మన ఇమ్యూనిటీ దాన్ని నిరోధించలేదు. దాంతో అక్కడ ఆ ఫంగస్ ప్రత్యుత్పత్తి జరుపుతూ, విపరీతంగా పెరుగుతూ ఒక ఉండలాగా ఏర్పడుతుంది. ఫలితంగా అక్కడి పరిసరాల్లోని కణజాలం మృతిచెందుతుండటం, మ్యూకస్ విపరీతంగా స్రవిస్తూ ఉండటం, ఇరతత్రా అంశాలు తోడవుతాయి. దాంతో ఈ ఉండ మరింతగా పెరుగుతుంటుంది. సాధారణంగా యాస్పర్జిల్లస్ అనే ఈ ఫంగస్ మొదట్లో ఆకులు, నిల్వ ఉంచిన ధాన్యం, పక్షి రెట్టలు, కుళ్లుతున్న చెట్ల భాగాలలో పెరుగుతుంటుంది. మనం పీల్చినప్పుడు శ్వాస ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి చేరుతుంటుంది. మిగతా ఆరోగ్యవంతులతో పోలిస్తే టీబీ, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఊపిరితిత్తుల్లో పొక్కులా పెరగడం (యాబ్సెస్), ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారిలో ఈ ఫంగల్ బాల్ మరింత తేలిగ్గా పెరుగుతుంది. కొంతమంది రోగుల్లో ఈ ఫంగల్బాల్ ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించకపోవచ్చు. మరికొందరిలో మాత్రం ఛాతీనొప్పి, దగ్గు, దగ్గినప్పుడు రక్తం పడటం జరుగుతుంది. కొందరిలో తీవ్రమైన నిస్సత్తువ, జ్వరం, బరువు తగ్గడం కనిపించవచ్చు. ఊపిరితిత్తుల నుంచి చిన్న ముక్క తీసి బయాప్సీ పరీక్షకు పంపడం, యాస్పిర్జిల్లస్ నిర్ధారణకు చేసే రక్తపరీక్ష, బ్రాంకోస్కోపీ, ఛాతీ ఎక్స్–రే, సీటీ స్కాన్, కళ్లె పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. ఎలాంటి లక్షణాలు లేకపోతే చికిత్స అవసరం లేదు. కానీ దగ్గు, రక్తం పడటం జరిగినప్పుడు రక్తస్రావం జరుగుతున్న ప్రదేశాన్ని గుర్తించడానికి అవసరమైన యాంజియోగ్రఫీ పరీక్ష చేసి, ఎంబోలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా అక్కడ రక్తస్రావాన్ని నివారిస్తారు. రోగికి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటే మాత్రం ఇక శస్త్రచికిత్స జరిపి, రక్తస్రావాన్ని ఆపాల్సి ఉంటుంది. - డా. రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ , కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్