ఇటీవల ఫిట్‌నెస్ మీద దృష్టిసారిస్తోంది యువత. అందుకోసమని యోగా, ఏరోబిక్, జిమ్ వంటి పలు రకాల సెంటర్‌లకి వెళ్లి మరీ వర్కౌట్లు చేస్తున్నారు. అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే.. ఆ జిమ్ సెంటర్ ఫేమస్? కాదా అన్నది చూస్తారు గానీ ఆ సెంటర్‌లో సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది గమనించారు. పాపం అలానే ఇక్కడొక మహిళ జిమ్ సెంటర్ పరిస్థితిని గమనించకపోవడంతో ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..ఇండోనేషియాలోని జిమ్‌లో 22 ఏళ్ల మహిళ మూడో అంతస్తులో ఉన్న ట్రెడ్‌మిల్‌పై నుంచి జారిపడి.. నేరుగా కిటికిలోంచి కిందపడి దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం ఇండోనేషియాలోని కాలిమంటన్‌లోని పోంటియానాక్‌లో జూన్ 18న చోటు చేసుకుంది. ఆ మహిళ ట్రెడ్‌మీల్‌పై నడుస్తూ ఉండగా అనూహ్యంగా బ్యాలెన్స్ కోల్పోయింది. అయితే వెనుక ఎంతో మేర ప్రదేశం లేకపోవడం ..దీనికి తగ్గట్టు అక్కడ ఉన్న గోడ మాదిరి అద్దంలాంటి విండో తెరిచి ఉండటంతో వెంటనే నేరుగా పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అయక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ప్రమాదం ఆమె తన ప్రియుడితో కలిసి జిమ్ చేసేందుకు వచ్చినప్పుడూ చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియ పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా..ట్రెడ్‌మిల్‌కి కిటికి మధ్య దూరం కేవలం 60 సెంటిమీటర్ల దూరం ఉన్నట్లు తేలింది. పోస్ట్‌మార్టం రిపోర్టు కూడా తలకు తీవ్ర గాయలవ్వడంతోనే మృతి చెందిదని పేర్కొంది. నిజానికి ట్రెడ్‌మిల్‌పై ఎవరైనా కిందపడిపోవటం కామన్ అని, అయితే తగురీతిలో అక్కడ భద్రత లేకపోవడమే బాధకరమని అన్నారు ఇండోనేషియా పోలీసులు.
అలాగే సదరు జిమ్ యజామనిని ఇలా ఎందుకు ఏర్పాట్లు చేశారని ప్రశ్నించగా..అద్దానికి వ్యతిరేకంగా చేస్తే దృష్టి మరలదని ఇలా ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. అలాగే విండోలు క్లోజ్ చేసేలా వ్యక్తిగత పర్యవేక్షకులు పరివేక్షిస్తుంటారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడూ ఒకరూ లీవ్‌లో ఉండటంతోనే ఇది జరిగిందని చెప్పాడు సదరు యజమాని. ప్రస్తుతం పొలీసులు సదరు జిమ్ నిర్వహణ అనుమతిపై కూడా విచారణ చేపడుతున్నారు.
(చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జాన్వీ స్టైలిష్ లుక్..గజగామిని మాదిరి..!)
Comments
Please login to add a commentAdd a comment