పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో జాన్వీ స్టైలిష్‌ లుక్‌..గజగామిని మాదిరి..! | Janhvi Kapoor Turns Mermaid For Rahul Mishra At Paris Haute Couture Week | Sakshi
Sakshi News home page

పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో జాన్వీ స్టైలిష్‌ లుక్‌..గజగామిని మాదిరి..!

Published Tue, Jun 25 2024 11:30 AM | Last Updated on Tue, Jun 25 2024 4:50 PM

Janhvi Kapoor Turns Mermaid For Rahul Mishra At Paris Haute Couture Week

పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ లుక్‌ ఓ రేంజ్‌లో ఉంది. ఆమె స్టైలిష్‌ లుక్‌ ఆహుతులని మైమరిచిపోయేలా చేసింది. ముఖ్యంగా ఆ డిజైనర్‌ దుస్తుల్లో నడిచి వచ్చే విధానం హాట్‌టాపిక్‌గా మారింది. పారిస్‌ హాట్‌ కోచర్‌ వీక్‌ 2024లో ప్రముఖ డిజైనర్‌ రాహుల్‌ మిశ్రాకు మద్దతు ఇచ్చేందుకు జాన్వీ పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొంది. ఆరా బ్రాండ్‌ హోలోగ్రాఫిక్ టోన్‌ డిజైనర్‌ వేర్‌తో పారిస్‌ ఫ్యాషన్‌ వేదికపైకి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది జాన్వీ. ఈడ్రెస్‌ ముదురు బ్లాక్‌క లర్‌లో అల్లికలతో డిజైన్‌ చేసిన మెర్మైడ్‌ స్కర్ట్‌లా ఉంది. 

అందుకు తగ్గట్లు స్ట్రాప్‌లెస్‌ బ్లౌజ్‌తో జత చేయడం ఆమె లుక్‌ని ఓ రేంజ్‌కి తీసుకుకెళ్లింది. దీనికి తగ్గట్టు ఆమె మేకప్‌, కేశాలంకరణ చాలా ఆకర్షణీయంగా ఉంది. చెప్పాలంటే అక్కడ ఉన్న వారందరీ చూపు అటెన్షన్‌తో జాన్వీపైనే దృష్టి సారించేలా ఆమె రూపు ఉంది. ఇక్కడ జాన్వీ వేదికపై ఓ మత్సకన్యా మాదిరిగా ఆమె స్టన్నింగ్‌ లుక్‌ ఉండటం విశేషం. నిజంగానే మత్స్య కన్యేనా అని భ్రమింప చేసేలా ఉంది జాన్వీ లుక్‌. ముఖ్యంగా ఆ వేదికపై నడిచి వచ్చిన విధానం మరింత ఆసక్తిని రేకెత్తించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

దీన్ని చూసిన నెటిజన్లు జాన్వీ స్టైలిష్‌ లుక్‌కి ఫిదా అవ్వతూ ఆమె నడిచే వచ్చే తీరు హీరామండి మూవీలో ది డైమండ్ బజార్ నుంచి గజగామినిలా నటించిన  అదితి రావ్ హైదరీ నడకలా ఉందని ఒకరూ, 'ధితామ్ ధితామ్ ధిన్‌'లా నాట్యం చేసేందుకు వెళ్తున్నట్లుగా ఉందని మెచ్చకుంటూ పోస్టులు పెట్టారు. ఇక ఫ్యాషన్‌ వీక్‌లో రాహుల్ మిశ్రాకు మద్దతుగా బాలీవుడ్‌ ప్రముఖ నటులు పాల్గొన్నారు. ఇంతకు మునుపు రాహుల్‌ మిశ్రాకు సపోర్ట్‌ చేస్తూ..బాలీవుడ్‌ నటి అనన్ యపాండే రంగురంగుల సీక్వెన్‌ డ్రెస్‌తో సీతాకోక చిలుక మాదిరిగా ఈఫ్యాషన్‌ షోలో ఎంట్రీ ఇచ్చింది. 

ఎవరీ రాహుల్‌ మిశ్రా.. 
రాహుల్ మిశ్రా ఢిల్లీకి చెందిన ప్రముఖ భారతీయ ఫ్యాషన్‌ డిజైనర్‌. పారిస్‌లోని హాట్ కోచర్ వీక్‌లో ప్రదర్శనకు ఆహ్వానం దక్కించుకున్న తొలి భారతీయ డిజైనర్‌ రాహుల్‌ మిశ్రా. ఆయన 2014లో మిలన్ ఫ్యాషన్ వీక్‌లో అంతర్జాతీయ వూల్‌మార్క్ బహుమతిని గెలుచుకున్నాడు. ఆయనకు మద్దతిచ్చేలా ఇలా బాలీవుడ్‌ ముద్దుగుమ్ములు అతడి డిజైనర్‌ కలెక్షన్‌లతో ఈ అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికపై సందడి చేశారు. మరీ ఈ అంతర్జాతీయ ఫ్యాషన్‌ షోలో జాన్వీ తదుపరి ముద్దుగుమ్మ ఎవరో వేచి చూడాల్సిందే. ఇక ఈ అంతర్జాతీయ ఫ్యాషన్‌ షో జూన్‌ 24 నుంచి జూన్‌ 27 వరకు పారిస్‌లో ఘనంగా జరుగుతాయి. 

 

(చదవండి: ఏడు పదుల వయసులో అందాల పోటీలో పాల్గొన్న మహిళగా రికార్డు!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement