Rahul Mishra
-
Fashion: ఫ్యాషన్ ఇలాకా.. ట్రిపుల్ ధమాకా..
సాక్షి, సిటీబ్యూరో: ఒకేరోజున ముగ్గురు ఆల్ ఇండియా టాప్ క్లాస్ ఫ్యాషన్ డిజైనర్లు తమ డిజైన్లతో నగరాన్ని పలకరించారు. తమదైన శైలికి చెందిన అంతర్జాతీయ దుస్తుల శ్రేణిని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చారు. దేశంలోనే అగ్రగామి డిజైనర్లుగా పేరొందిన ఢిల్లీకి చెందిన అబ్రహమ్, ఠాకూర్ ద్వయంతో పాటు రాహుల్ మిశ్రాలు హాజరయ్యారు.అదే విధంగా ప్రముఖ డిజైనర్ దుస్తుల బ్రాండ్ సత్యపాల్.. బంజారాహిల్స్ రోడ్ నెం1లో ఉన్న సత్వా సిగ్నేచర్ టవర్‌లో వరుసగా తమ స్టోర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఒకేరోజున వాటిని ప్రారంభించారు. సిటీ ఫ్యాషన్ సర్కిల్లో సందడి నింపిన ఈ అత్యాధునిక దుస్తుల స్టోర్ల ప్రారం¿ోత్సవం, లాంచింగ్ పారీ్టలకు సినీనటులు తమన్నా, నిహారికా, శోభితా దూళిపాళ్ల, సిరత్ కపూర్‌తో పాటు నగరంలోని పలువురు సెలబ్రిటీలు హాజరై డిజైనర్లకు అభినంధనలు తెలిపారు. ఈ సందర్భంగా హాజరైన అతిథులతో డిజైనర్లు తమ కలెక్షన్స్ గురించిన విశేషాలను పంచుకున్నారు. -
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మత్స్య కన్యలా జాన్వీ స్టన్నింగ్ లుక్..! (ఫొటోలు)
-
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జాన్వీ స్టైలిష్ లుక్..గజగామిని మాదిరి..!
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ లుక్ ఓ రేంజ్లో ఉంది. ఆమె స్టైలిష్ లుక్ ఆహుతులని మైమరిచిపోయేలా చేసింది. ముఖ్యంగా ఆ డిజైనర్ దుస్తుల్లో నడిచి వచ్చే విధానం హాట్‌టాపిక్‌గా మారింది. పారిస్ హాట్ కోచర్ వీక్ 2024లో ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రాకు మద్దతు ఇచ్చేందుకు జాన్వీ పారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొంది. ఆరా బ్రాండ్ హోలోగ్రాఫిక్ టోన్ డిజైనర్ వేర్‌తో పారిస్ ఫ్యాషన్ వేదికపైకి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది జాన్వీ. ఈడ్రెస్ ముదురు బ్లాక్క లర్‌లో అల్లికలతో డిజైన్ చేసిన మెర్మైడ్ స్కర్ట్‌లా ఉంది. అందుకు తగ్గట్లు స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌తో జత చేయడం ఆమె లుక్‌ని ఓ రేంజ్‌కి తీసుకుకెళ్లింది. దీనికి తగ్గట్టు ఆమె మేకప్, కేశాలంకరణ చాలా ఆకర్షణీయంగా ఉంది. చెప్పాలంటే అక్కడ ఉన్న వారందరీ చూపు అటెన్షన్‌తో జాన్వీపైనే దృష్టి సారించేలా ఆమె రూపు ఉంది. ఇక్కడ జాన్వీ వేదికపై ఓ మత్సకన్యా మాదిరిగా ఆమె స్టన్నింగ్ లుక్ ఉండటం విశేషం. నిజంగానే మత్స్య కన్యేనా అని భ్రమింప చేసేలా ఉంది జాన్వీ లుక్. ముఖ్యంగా ఆ వేదికపై నడిచి వచ్చిన విధానం మరింత ఆసక్తిని రేకెత్తించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు జాన్వీ స్టైలిష్ లుక్‌కి ఫిదా అవ్వతూ ఆమె నడిచే వచ్చే తీరు హీరామండి మూవీలో ది డైమండ్ బజార్ నుంచి గజగామినిలా నటించిన అదితి రావ్ హైదరీ నడకలా ఉందని ఒకరూ, 'ధితామ్ ధితామ్ ధిన్'లా నాట్యం చేసేందుకు వెళ్తున్నట్లుగా ఉందని మెచ్చకుంటూ పోస్టులు పెట్టారు. ఇక ఫ్యాషన్ వీక్‌లో రాహుల్ మిశ్రాకు మద్దతుగా బాలీవుడ్ ప్రముఖ నటులు పాల్గొన్నారు. ఇంతకు మునుపు రాహుల్ మిశ్రాకు సపోర్ట్ చేస్తూ..బాలీవుడ్ నటి అనన్ యపాండే రంగురంగుల సీక్వెన్ డ్రెస్‌తో సీతాకోక చిలుక మాదిరిగా ఈఫ్యాషన్ షోలో ఎంట్రీ ఇచ్చింది. ఎవరీ రాహుల్ మిశ్రా.. రాహుల్ మిశ్రా ఢిల్లీకి చెందిన ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్. పారిస్‌లోని హాట్ కోచర్ వీక్‌లో ప్రదర్శనకు ఆహ్వానం దక్కించుకున్న తొలి భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా. ఆయన 2014లో మిలన్ ఫ్యాషన్ వీక్‌లో అంతర్జాతీయ వూల్మార్క్ బహుమతిని గెలుచుకున్నాడు. ఆయనకు మద్దతిచ్చేలా ఇలా బాలీవుడ్ ముద్దుగుమ్ములు అతడి డిజైనర్ కలెక్షన్లతో ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై సందడి చేశారు. మరీ ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ షోలో జాన్వీ తదుపరి ముద్దుగుమ్మ ఎవరో వేచి చూడాల్సిందే. ఇక ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ షో జూన్ 24 నుంచి జూన్ 27 వరకు పారిస్‌లో ఘనంగా జరుగుతాయి. View this post on Instagram A post shared by DietSabya® (@dietsabya) (చదవండి: ఏడు పదుల వయసులో అందాల పోటీలో పాల్గొన్న మహిళగా రికార్డు!) -
లాంగా!
లాంగ్గా ఉండే లంగా నిండుగా ఉంటుంది. కంఫర్ట్‌గా ఉంటుంది.. డిగ్నిఫైడ్‌గా ఉంటుంది. లవ్లీగా ఉంటుంది! గాలికి కదులుతూ సాంగ్లా ఉంటుంది! సమ్మర్‌కి స్టైల్‌గా ఉంటుంది. మిడ్డీలు.. మినీలు.. మైక్రోలను ఈజీగా జయిస్తుంది. ఎప్పటి నుంచో మన కల్చర్‌లో ఉంది!! లాంగ్ లివ్ లంగా! అంతర్జాతీయ వూల్మార్క్ అవార్డ్ పొందిన ఏకైక ఫ్యాషన్ డిజైనర్. ప్రపంచ ఫ్యాషన్ నగరమైన ప్యారిస్ వేదికల మీద వినూత్న వస్త్ర శైలులను ప్రదర్శించి ఔరా! అనిపించిన డిజైనర్. ఈ ఏడాది సమ్మర్ లాక్మే ఫ్యాషన్ వీక్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరిచిన డిజైనర్ రాహుల్ మిశ్రా! ప్రసిద్ధ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్లలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న రాహుల్ ఢిల్లీకి చెందినవారు. భారతీయ సాంస్కృతిక కళా వైభవాన్ని ఫ్యాబ్రిక్స్ ద్వారా పరిచయం చేసే ఈ వినూత్న డిజైనర్ డెనిమ్, ఖాదీలతో పాటు సిల్క్, ఆర్గంజా, షిఫాన్.. మొదలైన ఫ్యాబ్రిక్స్తోనూ.. నీలం, తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు రంగులతో చేసే మ్యాజిక్‌ని ఊహించలేం. గ్రామీణ కళగా ఆకట్టుకునే బంధనీ డిజైన్స్‌ను లావిష్‌గా తీర్చిదిద్దడం, ఎంబ్రాయిడరీ పనితనం, త్రీడీ ఎఫెక్ట్స్ దుస్తుల మీదకు తీసుకురావడంలో రాహుల్ మిశ్రా ప్రత్యేకతే వేరు. ఈ డిజైనర్ ఇస్తున్న కొన్ని సూచనలు... ♦ ఆధునిక మహిళ ఏం కోరుకుంటోంది అనే విషయంపైన ఎక్కువ దృష్టిపెట్టాలి. నేనైతే దీంట్లో భాగంగానే దుస్తుల మీద ప్రాచీన సాంస్కృతిక కళ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇందులో సింప్లిసిటీ, ప్రత్యేకత ఏ మాత్రం మిస్ అవ్వను. ♦ మనవైన ఖాదీ, కాటన్ దుస్తులను ఎంత ఆధునికంగా చూపించగలమో అలాగే సిల్క్, షిఫాన్, నెటెడ్ ఫ్యాబ్రిక్‌తోనూ అంతే కంఫర్ట్ తీసుకురావచ్చు. దానికి తగినట్టుగా దుస్తులను డిజైన్ చేస్తే ప్రజల ఆదరణ కూడా బాగుంటుంది. ♦ ధరించిన దుస్తులు ఎంత ఖరీదైనవి అని కాదు, అవి సౌకర్యంగా ఉండటం ముఖ్యం.