లాంగా!
లాంగ్‌గా ఉండే లంగా నిండుగా ఉంటుంది. కంఫర్ట్‌గా ఉంటుంది.. డిగ్నిఫైడ్‌గా ఉంటుంది. లవ్లీగా ఉంటుంది! గాలికి కదులుతూ సాంగ్‌లా ఉంటుంది! సమ్మర్‌కి స్టైల్‌గా ఉంటుంది. మిడ్డీలు.. మినీలు.. మైక్రోలను ఈజీగా జయిస్తుంది. ఎప్పటి నుంచో మన కల్చర్‌లో ఉంది!! లాంగ్ లివ్ లంగా!
అంతర్జాతీయ వూల్‌మార్క్ అవార్డ్ పొందిన ఏకైక ఫ్యాషన్ డిజైనర్. ప్రపంచ ఫ్యాషన్ నగరమైన ప్యారిస్ వేదికల మీద వినూత్న వస్త్ర శైలులను ప్రదర్శించి ఔరా! అనిపించిన డిజైనర్. ఈ ఏడాది సమ్మర్ లాక్మే ఫ్యాషన్ వీక్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరిచిన డిజైనర్ రాహుల్ మిశ్రా! ప్రసిద్ధ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్‌లలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న రాహుల్ ఢిల్లీకి చెందినవారు. భారతీయ సాంస్కృతిక కళా వైభవాన్ని ఫ్యాబ్రిక్స్ ద్వారా పరిచయం చేసే ఈ వినూత్న డిజైనర్ డెనిమ్, ఖాదీలతో పాటు సిల్క్, ఆర్గంజా, షిఫాన్.. మొదలైన ఫ్యాబ్రిక్స్‌తోనూ..
నీలం, తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు రంగులతో చేసే మ్యాజిక్‌ని ఊహించలేం. గ్రామీణ కళగా ఆకట్టుకునే బంధనీ డిజైన్స్‌ను లావిష్‌గా తీర్చిదిద్దడం, ఎంబ్రాయిడరీ పనితనం, త్రీడీ ఎఫెక్ట్స్ దుస్తుల మీదకు తీసుకురావడంలో రాహుల్ మిశ్రా ప్రత్యేకతే వేరు. ఈ డిజైనర్ ఇస్తున్న కొన్ని సూచనలు...
♦ ఆధునిక మహిళ ఏం కోరుకుంటోంది అనే విషయంపైన ఎక్కువ దృష్టిపెట్టాలి. నేనైతే దీంట్లో భాగంగానే దుస్తుల మీద ప్రాచీన సాంస్కృతిక కళ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇందులో సింప్లిసిటీ, ప్రత్యేకత ఏ మాత్రం మిస్ అవ్వను.
♦ మనవైన ఖాదీ, కాటన్ దుస్తులను ఎంత ఆధునికంగా చూపించగలమో అలాగే సిల్క్, షిఫాన్, నెటెడ్ ఫ్యాబ్రిక్‌తోనూ అంతే కంఫర్ట్ తీసుకురావచ్చు. దానికి తగినట్టుగా దుస్తులను డిజైన్ చేస్తే ప్రజల ఆదరణ కూడా బాగుంటుంది.
♦ ధరించిన దుస్తులు ఎంత ఖరీదైనవి అని కాదు, అవి సౌకర్యంగా ఉండటం ముఖ్యం.