వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ట్రెడ్‌మిల్ కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. సమతుల్య వ్యాయామ నియమావళిలో భాగంలో ఏ వ్యాయామం బెటర్‌గా ఉంటుందనే ప్రశ్న అందరికి వచ్చే కామన్ సందేహం. ఈ విషయంలో ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే.
నడక అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వ్యాయామానికి సంబంధించిన అత్యంత సులభమైన వర్కౌట్. ఇది అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా గుండెజబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు, టైప్2 డయాబెటిస్ వంటి వివిధ సమస్యలను ఎదుర్కొనడంలో సహాయపడుతుంది.
శారీరక ప్రయోజనాలే కాకుండా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతేగాదు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మరి ఇలాంటి ప్రయోజనాలు ట్రెడ్‌మిల్‌పై నడిచినా లభిస్తున్నాయి కదా మరీ రెండింటిలో ఏది బెటర్ అనే సందేహం అందిరిలో మెదిలే ప్రశ్న. రెండు కూడా శరీరానికి మంచి ప్రయోజనాలే అందిస్తాయి. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటే బెస్ట్ అంటే..
ట్రెడ్‌మిల్‌పై నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు..
ట్రెడ్‌మిల్‌పై నడవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వైద్యులు ఏమంటున్నారంటే..
నియంత్రిత వాతావరణంలో ట్రెడ్‌మిల్‌పై నడవడం జరుగుతుంది. వర్షం, మంచు లేదా వేడి వాతావరణాల్లో బయటకు రానివాళ్లకు, లేదా పడనివాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్.
అదీగాక ఆధునిక ట్రెడ్‌మిల్‌లు వివిధ సెట్టింగులతో వస్తున్నాయి. ఇవన్నీ మంచి వర్కౌట్‌లకు అనుగుణంగా ఉన్నాయి. శరీరానికి తగిన వ్యాయామం లభించినట్లు అవుతోంది కూడా.
ట్రెడ్‌మిల్‌లు కుషన్డ్ ఉపరితలాలు కలిగి ఉంటాయి. అందువల్ల బహిరంగ ఉపరితలాలపై నడవడం కంటే దీనిపై నడవడం వల్ల కీళ్లకు మేలు చేస్తాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్లకు లేదా ఆర్థోపెడిక్ సర్జరీల నుంచి కోలుకుంటున్న వారికి ఈ ఫీచర్ కీలకం.
ముఖ్యంగా భద్రత ఉంటుంది. ఇంటిలోపలే ట్రెడ్‌మిల్‌పై నడవడం వల్ల ట్రాఫిక్ వంటి సమస్యలు ఎదురవ్వవు. ఎలాంటి ప్రమాదాలు ఎదురుకావు.
ఆరుబయట నడవడం వల్ల కలిగే లాభాలు..
ఆరుబటయ నడవడం వల్ల సహజమైన వాతావరణ వైవిధ్యం లభిస్తుంది. శరీరానికి ఆహ్లాదం తోపాటు చక్కటి వ్యాయామం లభిస్తుంది.
తాజాగాలి, సూర్యకాంతి, ప్రకృతికి బహిర్గతం అవుతాం. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పచ్చటి ప్రదేశాల్లో నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మానసిక స్థితి మెరుగుపడుతుంది. మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
బహిరంగంగా నడవడం వల్ల మన చుట్టు ఉన్నవాళ్లతో పరిచయాలు ఏర్పడతాయి. చక్కటి సామాజిక సంబంధాలు మానసిక ఉత్సాహాన్ని అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
అలాగే బయట నడవడం వల్ల ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.
ఏది మంచిదంటే..ట్రెడ్‌మిల్ లేదా ఆరుబయట నడవడం అనేది వ్యక్తిగత పరిస్థితులు, ప్రాధాన్యత ఆధారంగా ఇది నిర్ణయించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
భద్రతా సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ట్రెడ్‌మిల్ మంచిదని, ప్రకృతితో సాన్నిత్యం కోరుకునేవారికి, మానసిక ఆరోగ్యం కోసం అయితే బహిరంగంగా వాకింగ్ చేయడం సరియైనదని నిపుణులు సూచిస్తున్నారు.
(చదవండి: రక్తదానం చేయడం మంచిదేనా? ఏడాదికి ఎన్నిసార్లు చెయ్యొచ్చు..)
Comments
Please login to add a commentAdd a comment