జిమ్‌లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగ..పాపం..! ఇలా వర్క్‌ట్‌లు.. | Thief Who Came To Rob Made To Run On Treadmill In MP | Sakshi
Sakshi News home page

జిమ్‌లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగ..పాపం..! ఇలా వర్క్‌ట్‌లు..

Published Sat, Jun 8 2024 12:10 PM | Last Updated on Sat, Jun 8 2024 1:38 PM

Thief Who Came To Rob Made To Run On Treadmill In MP

ఓ దొంగ జిమ్‌లో చోరీ చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. ఏదో పట్టుకుపోదామనుకుని వచ్చి ఇలా దొరికిపోతానని ఊహించని దొంగను యజమాని ఏం చేశాడో వింటే షాకవ్వుతారు. పట్టుబడిన ఆ దొంగకు జిమ్‌ యజమాని ఎవ్వరూ ఊహించని ఓ శిక్ష వేసి మరీ పోలీసులకు అప్పగించాడు. ఇంతకీ ఆ జిమ్‌ యజమాని ఏం చేశాడంటే..

ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో చోటు చేసుకుంది. ఓ దొంగ జిమ్‌ సెంటర్‌లోకి వెళ్లి చోరీ చేయాలని అనుకున్నాడు. అక్కడ ఉన్న షట్టర్‌ని ఏదో విధంగా ఓపెన్‌ చేసి లోపలకి వెళ్లి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో ఇంట్లో ఉన్న జిమ్‌ యజమానికి అర్థరాత్రి హఠాత్తుగా మెలుకువ వచ్చి ఫోన్‌ చెక్‌ చేసుకుంటాడు. జిమ్‌ సెంటర్‌ సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించగా..అక్కడ ఓ దొంగ పచార్లు కొడుతున్నట్లు కనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా జిమ్‌కి వెళ్లి ఆ దొంగను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు యజమాని. 

దీంతో భయాందోళనకు గురైన దొంగ ఏం చేయాలో తోచక బిత్తరచూపులు చూశాడు. అయితే ఆ జిమ​ యజమాని దొంగని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తమంటూ శిక్ష విధించి మరీ పోలీసులకు అప్పగించాడు. పాపం దొంగలించడానికి వచ్చి ఇలా వర్క్‌ట్‌లు చేసి మరీ జైలుకి వెళ్తానని ఊహించి ఉండడు కదా..!.

 ఇలాంటి ఫన్నీ ఘటనే గతవారం ఉత్తరప్రదేశ్‌ లక్నోలో జరిగింది. ఓ దొంగ దొంగతనం చేయడానికి చవ్చి ఏసీ ఆన్‌ చేసుకుని మరీ నేలపై ప్రశాంతగా నిద్రపోయాడు. కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ పోలీసులు ఉండటంతో కంగుతిన్నాడు. అతడు మద్యం మత్తులో ఉండటంతో ఇలా నిద్రపోయాడని పోలీసులు చెప్పారు. 

(చదవండి: ద్రౌపది ముర్ము మోదీకి దహీ-చీనీని తినిపించడానికి రీజన్‌! ఏంటీ స్వీట్‌ ప్రాముఖ్యత)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement