
వ్యాయామం చేసేటప్పుడు మీలో చాలా మంది ట్రెడ్‌మిల్ చూసే ఉంటారు. రోడ్డు మీద పరిగెత్తే అవసరం లేని వాళ్లు ఈ ట్రెడ్‌మిల్‌ను ఉపయోగించి చెమటలు కక్కుతుంటారు. ట్రెడ్‌మిల్‌ను మనం ఎంత స్పీడ్ పెంచితే అంత వేగంగా పరిగెడతాం. అయితే ఇక్కడ మాత్రం ఒక అమ్మాయి ట్రెట్‌మిల్‌ను ఉపయోగించకుండా సైకిల్ తొక్కుతున్న మనుషులను ట్రెడ్‌మిల్‌గా చేసుకొని వారి మీద నుంచి పరిగెత్తడం ఆశ్యర్యం కలిగిస్తుంది. వీడియోలో స్లైక్లింగ్ చేస్తున్న వారిపై ఒక అమ్మాయి జీన్స్ వేసుకొని మెరుపువేగంతో పరిగెత్తడం కనిపించంది. దాదాపు 5 సెకండ్ల నిడివి ఉన్న ఈ క్లిప్ చూస్తే అచ్చం ట్రెట్‌మిల్ పైన పరిగెడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోనూ మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్‌మన్ ట్విటర్‌లో షేర్ చేశాడు. ' ప్రజలు నమ్మశక్యం లేకుండా ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తారు' అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఈ వీడియోను 1.4 మిలియన్ల మంది వీక్షించారు. ఇలాంటి సాహసాన్ని మునుపెన్నడు చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
People are absolutely insanely innovative and incredible... pic.twitter.com/kk2ZZBfAkh
— Rex Chapman🏇🏼 (@RexChapman) July 2, 2020
Comments
Please login to add a commentAdd a comment