'ఇక ట్రెడ్ మిల్ మీ బట్లలను ఉతికేస్తుంది'
'ఇక ట్రెడ్ మిల్ మీ బట్లలను ఉతికేస్తుంది'
Published Mon, Jun 16 2014 4:01 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM
వినియోగదారులకు ఆరోగ్యంతోపాటు, పరిశుభ్రతను అందించేందుకు ఓ కంపెనీ ట్రెడ్ మిల్ ను ఆవిష్కరించింది. ట్రెడ్ మిల్ పై పరిగెత్తడం ద్వారా ఎలాంటి అదనపు అలసట లేకుండానే మీ బట్టల్ని ఉతుక్కునే విధంగా దక్షిణ కోరియా ఉత్పత్తుల కంపెనీ ఓ ట్రెడ్ మిల్ ను తయారు చేసింది.
ఇతర వాషింగ్ మెషిన్ లో నింపే విధంగానే మురికి బట్టలు, వాషింగ్ పౌడర్, వాటర్ ను లోపలి భాగంలో ఉండే కనిస్టేర్స్ లో నింపే విధంగా ట్రెడ్ మిల్ ను సి హెయాంగ్ ర్యూ ఓ రూపొందించారు. కనిస్టెర్స్ సైజు, రూపం కారణంగా అధిక నీటిని తగ్గిస్తుందని కంపెనీ తెలిపింది.
జాగింగ్ చేసట్టప్పుడు కానిస్టెర్స్ తిరిగి.. బట్టల కుండే మురికి తొలగిస్తుంది. జాగింగ్ చేయని సమయంలో కూడా బట్టలు ఉతికే విధంగా.. ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్ ను బ్యాటరీలో నిక్షిప్తమయ్యే విధంగా కూడా సదుపాయాన్ని కల్పించారు.
జాగింగ్ చేసే వ్యక్తి ఆకారం కనిపించే విధంగా కూడా అద్దాలను ఏర్పాటు చేశారు. ది వీల్ పేరుతో ఈ ట్రెడ్ మిల్ 2014 ఎలక్టరోలక్స్ డిజైన్ ల్యాబ్ కాంపిటీషన్ కు వెళ్లనుంది.
Advertisement