Wash clothes
-
బట్టలుతికే చింపాంజీ వీడియో వైరల్
చాంగింక్ : చింపాంజీలు, మానవ చేష్టలను అనుకరించే తెలివైన జంతువులని తెల్సిందే. అయినప్పటికీ అప్పుడప్పుడు వాటి చేష్టలు చూస్తుంటే నవ్వు రావడమే కాకుండా, ఔరా అనేలా అబ్బురపరుస్తాయి. చైనా, చాంగింక్ రాష్ట్రంలోని ‘లెహే లెడు థీమ్ పార్క్’లో గత శుక్రవారం నాడు 18 ఏళ్ల యుహూ అనే చింపాజీ తన సంరక్షుడి తెల్లటి టీ షర్టును ఉతుకుతు కనిపించింది. నీళ్ల గుంట వద్ద కూర్చొని అచ్చం మనిషి వలనే చొక్కాకు సబ్బు పెట్టి, నీళ్లలో పదే పదే కుదించి, ఆ పక్కనే ఆరేయడం అబ్బురపరిచింది. ఈ తతంగాన్ని ఆ పక్కనే ఇనుప రాడ్లపై కూర్చున్న సోదరి చింపాంజీ ఎంజాయ్ చేసింది. ఆ సమయంలో చింపాంజీ సంరక్షుకుడు ఆ చింపాంజీల కోసం వంట తయారు చేస్తున్నారని, ఈ లోగా ఈ దృశ్యాలను చూసిన పార్క్ వర్కర్ ఒకరు దాదాపు 30 నిమిషాలపాటు కొనసాగిన చింపాజీ చేష్టలను వీడియో తీశారు. చింపాజీలు తమ పడకలను మనుషులకన్నా శుభ్రంగా ఉంచుకుంటాయని ఆ వర్కర్ తెలిపారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు వైరల్ అవుతోంది. -
'ఇక ట్రెడ్ మిల్ మీ బట్లలను ఉతికేస్తుంది'
వినియోగదారులకు ఆరోగ్యంతోపాటు, పరిశుభ్రతను అందించేందుకు ఓ కంపెనీ ట్రెడ్ మిల్ ను ఆవిష్కరించింది. ట్రెడ్ మిల్ పై పరిగెత్తడం ద్వారా ఎలాంటి అదనపు అలసట లేకుండానే మీ బట్టల్ని ఉతుక్కునే విధంగా దక్షిణ కోరియా ఉత్పత్తుల కంపెనీ ఓ ట్రెడ్ మిల్ ను తయారు చేసింది. ఇతర వాషింగ్ మెషిన్ లో నింపే విధంగానే మురికి బట్టలు, వాషింగ్ పౌడర్, వాటర్ ను లోపలి భాగంలో ఉండే కనిస్టేర్స్ లో నింపే విధంగా ట్రెడ్ మిల్ ను సి హెయాంగ్ ర్యూ ఓ రూపొందించారు. కనిస్టెర్స్ సైజు, రూపం కారణంగా అధిక నీటిని తగ్గిస్తుందని కంపెనీ తెలిపింది. జాగింగ్ చేసట్టప్పుడు కానిస్టెర్స్ తిరిగి.. బట్టల కుండే మురికి తొలగిస్తుంది. జాగింగ్ చేయని సమయంలో కూడా బట్టలు ఉతికే విధంగా.. ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్ ను బ్యాటరీలో నిక్షిప్తమయ్యే విధంగా కూడా సదుపాయాన్ని కల్పించారు. జాగింగ్ చేసే వ్యక్తి ఆకారం కనిపించే విధంగా కూడా అద్దాలను ఏర్పాటు చేశారు. ది వీల్ పేరుతో ఈ ట్రెడ్ మిల్ 2014 ఎలక్టరోలక్స్ డిజైన్ ల్యాబ్ కాంపిటీషన్ కు వెళ్లనుంది.