కాగితాలతో చిత్రవిచిత్రమైన ఆకృతులను రూపొందించే జపనీస్ కళ ఒరిగామి. ఒరిగామి కళ స్ఫూర్తితో తేలికగా మడిచిపెట్టి ఎక్కడికైనా తీసుకుపోయేందుకు అనువైన సోలార్ ప్యానల్స్‌ను రూపొందించింది ఇంగ్లండ్‌కు చెందిన బహుళజాతి సంస్థ ‘సెగో ఇన్నోవేషన్స్’.
ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఒరిగామి సోలార్ ప్యానల్’. ఆరుబయట పిక్నిక్‌లకు వెళ్లేటప్పుడు, విద్యుత్ సరఫరా లేని అడవుల్లో రాత్రివేళ బస చేయాల్సి వచ్చేటప్పుడు ఈ సోలార్ ప్యానల్స్ చక్కగా ఉపయోగపడతాయి.
వీటిని 20 వాట్, 50 వాట్, 100 వాట్, 400 వాట్ మోడల్స్‌లో ‘సెగో ఇన్నోవేషన్స్’ అందుబాటులోకి తెచ్చింది. వీటిని ప్రీ–ఆర్డర్లపై సరఫరా చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. గత జూన్ 6 నుంచి ప్రీ–ఆర్డర్లను స్వీకరించడం ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment