చాట్‌జీపీటీ! పరిచయం అక్కర్లేని పేరు. వినియోగంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి రోజూ నిత్యం వార్తల్లో నిలుస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్. ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే కారణంతో ఇప్పుడు ఈ టూల్‌ను వినియోగించేందుకు ప్రపంచ దేశాలు వెనకడుగు వేస్తున్నాయి.
ఈ తరుణంలో జపాన్ చాట్‌జీపీటీని సద్వినియోగం చేసుకోనేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. జపాన్‌కు చెందిన యోకొసుకా నగరంలో పాలనా పరమైన విధులు (అడ్మినిస్ట్రేషన్) నిర్వహించేందుకు సుమారు 4 వేల మంది మున్సిపల్ ఉద్యోగులు నెల రోజుల పాటు ఏఐ చాట్‌బాట్‌పై ట్రయల్స్ ప్రాతిపదికన దీనిని వినియోగించనున్నారు. ఈ ట్రయల్స్‌లో చాట్‌జీపీటీని స్పెల్లింగుల్లోని తప్పుల్ని సరిచేయడం, కొత్త ఐడియాల కోసం ఉపయోగించనున్నారు.
మిగిలిన దేశాలు చాట్‌జీపీటీ వినియోగాన్ని వ్యతిరేకిస్తున్నా జపాన్ ఉపయోగించుకోవడానికి కారణం అక్కడ ఉద్యోగులు కొరత వేధిస్తుంది. దీంతో పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఆ సమస్య నుంచి బయటపడేందుకే చాట్‌జీటీపీ వినియోగం తప్పని సరి అని తాము భావిస్తున్నట్లు యోకొసుకా డిజిటల్ మేనేజ్మెంట్ డిపార్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ప్రతినిధి తకాయుకి సముకావా(Takayuki Samukawa) తెలిపారు.
ఈ సందర్భంగా చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌ను ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విభాగంలో ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జనాభా క్షీణతతో ఉద్యోగుల సంఖ్య పరిమితమవుతోంది. ఉద్యోగుల స్థానంలో చాట్‌జీపీటీని వినియోగం తప్పని సరని సముకావా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment