
సాక్షి, ముంబై: రీటైల్ ద్రవ్యోల్బణం కొద్దిగా చల్లారింది. డిసెంబరునాటి 17 నెలల గరిష్టంతో పోలిస్తే జనవరిలో స్వల్పంగా తగ్గి 5.07శాతంగా నమోదైంది.అయితే రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా మధ్యస్థ లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగానే ఉంది. ముఖ‍్యంగా ఆహార, ఇంధర ధరల పెరుగుదలను దీన్ని ప్రభావితం చేసింది. మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం కొలమానం, సిపిఐ ఇండెక్స్ జనవరి నెలలో 5.07 శాతానికి పెరిగింది. డిసెంబరులో 5.21 శాతం నుంచి 5.14 శాతానికి తగ్గనుందని రాయిటర్స్ విశ్లేషకులు అంచనా వేశారు.
ఇంధనం, ద్రవ్యోల్బణం డిసెంబరులో 7.90 శాతంతో పోలిస్తే తాజాగా 7.58 శాతంగా నమోదైంది. గృహ ద్రవ్యోల్బణం గత నెలలో 8.25 శాతం నుంచి 8.33 శాతానికి పెరిగింది. జనవరి-మార్చి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5.1 శాతానికి చేరింది. అక్టోబరు-డిసెంబరులో 4.6 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ..ఫిబ్రవరి నెలలో బడ్జెట్లో ప్రకటించిన అధిక దిగుమతి పన్నుల ధరల ఒత్తిడి కారణంగా ఆహార, ఇంధన ధరలు పెరిగినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment