
జకార్తా: ఇండోనేసియాలోని జావా దీవిలో సోమవారం వచ్చిన భూకంపంలో మృతుల సంఖ్య 268కి పెరిగింది. మరో 151 మంది జాడ తెలియాల్సి ఉందని, 1,083 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వారిలో 300 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల్లో ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులేనని పశ్చిమ జావా గవర్నర్ చెప్పారు.
13 వేల నివాసాలు దెబ్బతిన్నాయని చెప్పారు. మరిన్ని ప్రకంపనలు సంభవించవచ్చనే భయాందోళనల మధ్య ప్రజలు రోడ్లపైనే చీకట్లో గడిపారు. మంగళవారం దేశాధ్యక్షుడు జోకో విడొడొ సియంజుర్‌లో పర్యటించారు.
చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. 38 మంది సజీవదహనం