death toll rise
-
Wayanad Landslides: ఎటు చూసినా వినాశనమే
వయనాడ్/తిరువనంతపురం: ప్రకృతి ప్రకోపానికి గురై శవాల దిబ్బగా మారిన కేరళలోని వయనాడ్ జిల్లా మారుమూల కుగ్రామాల వద్ద అన్వేషణ, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగు తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున కుంభవృష్టి వర్షాలతో నానిన కొండచరియలు పడటంతో బురదలో కూరుకుపోయిన ఇళ్ల శిథిలాల కింద పెద్ద సంఖ్యలో మృతదేహాలను ఆర్మీ, సహాయక బృందాలు వెలికితీశాయి. దీంతో మరణాల సంఖ్య 167కి పెరిగింది. 191 మంది జాడ తెలియాల్సి ఉంది. 219 మంది గాయపడ్డారు. చిధ్రమైన చాలా మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. వందలాది మందిని సమీప పట్టణాల ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ గ్రామస్థుల మరణాలతో వారి బంధువుల, ఆక్రందనలు, తమ వారి జాడ కోసం కుటుంబసభ్యుల వెతుకులాటతో ఆ ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. శిథిలాల కింద బ్రతికుంటే బాగుణ్ణు అని ఆశ, ఏ చెడువార్త వినాల్సి వస్తుందోనన్న భయాలతో వందలాది మంది ఆత్మీయులు, మిత్రుల రాకతో ఆ ప్రాంతాల్లో విషాధం రాజ్యమేలింది. కొండపై నుంచి వచ్చిన వరద, బురద ధాటికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో బుధవారం ఉదయం మాత్రమే పూర్తిస్తాయిలో సహాయక కార్యక్రమాలు మొదలుపెట్టగలిగారు. రెండ్రోజుల్లో 1,592 మందిని కాపాడినట్లు కేరళ సీఎం విజయన్ చెప్పారు.వేయి మందిని రక్షించిన ఆర్మీ: యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలతో రంగంలోకి దిగిన భారత సైన్యం దాదాపు 1,000 మందికిపైగా స్థానికులను సురక్షితంగా కాపాడింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, తీరగస్తీ దళాలు సంయుక్తంగా చేపడుతున్న రెస్క్యూ ఆప రేషన్లతో చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. హెలికాప్టర్లు, తాత్కాలిక వంతెనల సాయంతో ఘటనాస్థలి నుంచి వారికి జాగ్రత్తగా తీసు కొస్తున్నారు. కొందరు మానవహారంగా ఏర్పడి ఆ వలి ఒడ్డు నుంచి కొందరిని ఇటువైపునకు తీసు కొస్తూ సాహసంచేస్తున్నారు. డాగ్ స్క్వాడ్లతో పాటు స్థానికు తమ వంతు సాయం చేస్తున్నారు. శిబిరాలకు 8,017 మందిని తరలించారు.ఆదుకుంటున్న బెలీ వంతెనలు: 330 అడుగుల పొడవైన తాత్కాలిక బెలీ వంతెనలు నది ప్రవాహం ఆవలివైపు చిక్కుకున్న బాధితులను ఇటువైపు తీసు కొచ్చేందుకు ఎంతగానో ఉపయో గపడుతున్నాయి. 690 అడుగుల బెలీ వంతెనలను ఢిల్లీ కంటోన్మెంట్ నుంచి తెప్పి స్తున్నారు. మేప్పడి–చూరల్మల వంతెన నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపడు తున్నారు. నిఘా హెలికాప్టర్లు కొండప్రాంతాలు, నదీ ప్రవాహం వెంట తిరుగుతూ బాధితుల జాడ కోసం అన్వేషణ కొనసా గిస్తున్నాయి. పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీదిగ్భ్రాంతికర ఘటనలో సహాయక చర్యలు, పునరావాసం తదితర చర్యల పురోగతిపై ప్రధాని మోదీ సమీక్ష జరిపారు. కేరళకు పూర్తిస్థాయిలో కేంద్రం మద్దతిస్తోందని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ ఘటనాస్థలిని సందర్శించిన సందర్భంగా చెప్పారు.కుగ్రామాల్లో శ్మశాన వైరాగ్యంభారీ శిలలు పడి నేలమట్టమైన ఒక ఇంట్లో నాలుగైదు మంది కుటుంబసభ్యులు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని అలాగే బురదలో కూరుకుపోయిన విషాద దృశ్యం అక్కడి సహాయక బృందాలను సైతం కంటతడి పెట్టించింది. ముండక్కై జంక్షన్, చూరల్మల ప్రాంతాల్లో భీతావహ దృశ్యాలు అక్కడి ప్రకృతి విలయాన్ని కళ్లకు కట్టాయి. ‘‘ ముండక్కై గ్రామంలో ఘటన జరిగిన రోజు దాదాపు 860 మంది జనం ఉన్నారు. వాళ్లలో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో తెలీదు’ అని స్థానికులు వాపోయారు. ‘‘చెట్లను పట్టుకుని కొందరు, చెట్టు కింద పడి మరికొందరు, బురదలో కూరుకుపోయి ఇంకొందరు ప్రాణాలు కోల్పోయారు. కురీ్చలో కూర్చుని, మంచాల మీద పడుకుని ఉన్న మృతదేహాలను గుర్తించాం’’ అని సహాయక బృందాలు వెల్లడించాయి. ‘‘అంతా కోల్పోయా. అందర్నీ కోల్పోయా. నాకు ఇక్కడ ఇంకా ఏమీ మిగల్లేదు’ అంటూ ఒక పెద్దాయన ఏడుస్తూ కనిపించారు. ‘‘బురదలో కాలు పెట్టలేకున్నాం. మావాళ్లు ఎక్కడున్నారో’’ అంటూ ఒకరు కంటతడి పెట్టుకున్నారు. 10 శాతం ఇళ్లు మిగిలాయి ముండక్కైలో దాదాపు 500 ఇళ్లు ఉంటాయని ఓ అంచనా. విధ్వంసం తర్వాత 450 ఇళ్లు నేలమట్టమయ్యాయి. 49 ఇళ్లే మిగిలాయి. బాధితులు అంగన్వాడీ కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.ముందుగానే హెచ్చరించాం: అమిత్ షాకుంభవృష్టిపై వారం క్రితమే ముందస్తు హెచ్చరికలు చేశామని రాజ్యసభలో వయనాడ్ విషాదంపై తాత్కాలిక చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. ‘‘ ముందు జాగ్రత్తగా జూలై 23వ తేదీన ఎన్డీఆర్ఎఫ్ నుంచి 9 బృందాలను కేరళకు పంపించాం. వయనాడ్‌లో విలయం మొదలవగానే జిల్లా కలెక్టర్ నుంచి ఈ బృందాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వెంటనే వాళ్లంతా రంగంలోకి దిగారు. అన్వేషణ, సహాయ, పునరావాస కార్యక్రమాల్లో కేరళకు పూర్తి స్థాయిలో మోదీ సర్కార్ అండగా నిలుస్తుంది. ఆరు సంవత్సరాల క్రితమే ఇలాంటి కొండప్రాంతాల నుంచి జనాన్ని వేరేచోటుకు తరలించాలని ఢిల్లీ ఐఐటీ నిపుణులు హెచ్చరించారు. అయినా వారి సలహాను కేరళ సర్కార్ పెడచెవిన పెట్టింది. భారీ వర్షాలు పడొచ్చని జూలై 18న, 25న రెండుసార్లు హెచ్చరికలు పంపాం. 20 సెం.మీ. భారీ వర్షం పడి కొండచరియలు పడొచ్చని 26న హెచ్చరించాం. స్థానికులను ఎందుకు తరలించలేదు?’’ అని కేరళ సర్కార్‌ను అమిత్ ప్రశ్నించారు.పంపింది ఆరెంజ్ అలెర్ట్... అదీ 29న: విజయన్అమిత్ షా వ్యాఖ్యలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. ఈ మేరకు తిరువనంతపురంలో పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘‘ అమిత్ షా చెప్పేదంతా అబద్ధం. 28వ తేదీవరకు ఎలాంటి అలర్ట్ పంపలేదు. వర్షాలొస్తాయని భారత వాతావరణ శాఖ వయనాడ్ జిల్లాకు సాధారణ ఆరెంజ్ అలర్ట్‌ను 29వ తేదీన మాత్రమే పంపింది. 20 సెంటీమీటర్లలోపు వర్షాలకు ఆరెంజ్ అలర్ట్, 24 సెం.మీ.లోపు వర్షాలకు రెడ్ అలర్ట్ ఇస్తారు. కానీ వయనాడ్ జిల్లాలో అసాధారణంగా 572 మిల్లీమీటర్లకు మించి కుంభవృష్టి నమోదైంది. ఇంతటి భారీ వర్షసూచన వాతావరణశాఖ చేయలేదు. మంగళవారం కొండచరియలు పడ్డాక తీరిగ్గా ఉదయం ఆరుగంటలకు రెడ్ అలర్ట్‌ను పంపించారు. వరదపై హెచ్చరించాల్సిన సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఎలాంటి హెచ్చరిక రాలేదు. అయినా ఇది పరస్పర విమర్శలకు సమయం కాదు’’ అని అన్నారు. -
దద్దరిల్లిన దండకారణ్యం.. 13 మంది మావోయిస్టుల మృతి
చత్తీస్‌గఢ్: లోకసభ ఎన్నికల నేపథ్యంలో చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా పోలీసుల, భద్రతా బలగాల కుంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బీజాపూర్‌లో నిన్న( సోమవారం) జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగింది. కోర్చోలి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. నిన్న సాయంత్రం వరకు 10 మంది మావోయిస్టులు మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ఆపరేషన్ పూర్తైన అనంతరం మరో ముగ్గురు మావోయిస్టులు మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సుమారు 8 గంటల పాటు ఎదురు కాల్పులు కొనసాగాయి. కుంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్న డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బెటాలియన్, బస్తర్ ఫైటర్స్ పాల్గొన్నారు. ఇక.. దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పది రోజుల వ్యవధిలో నాలుగు ఎన్కౌంటర్లు జరిగాయి. ఇప్పటివరకు మొత్తం 25 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి -
అఫ్గాన్ భూకంపం..2,400కు చేరిన మరణాలు
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లోని హెరాట్ ప్రావిన్స్‌లో శనివారం సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మట్టిదిబ్బల్లా మారిన ఇళ్ల శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం స్థానికులు, సహాయక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. సోమవారం మరికొన్ని మృతదేహాలు బయటపడటంతో మృతుల సంఖ్య 2,445కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, క్షతగాత్రుల సంఖ్య గతంలో ప్రకటించిన 9,240 కాదన్నారు. 2వేల మంది మాత్రమే గాయపడ్డారన్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. హెరాట్‌లోని ఏకైక ప్రధాన ఆస్పత్రి వెలుపల బాధితుల కోసం బెడ్లు ఏర్పాటు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇక్కడ ప్రస్తుతం 500 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. సోమవారం మరోసారి భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురై రోడ్లపైకి చేరుకున్నారు. అఫ్గాన్ ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి అబ్దుల్ బరాదర్ సోమవారం హెరాట్ ప్రావిన్స్‌లో పర్యటించారు. ఇజ్రాయెల్ పరిణామాలపైనే ప్రపంచదేశాల దృష్టి కేంద్రీకృతం కావడంతో అఫ్గాన్‌లో భూకంపబాధితులకు సాయం నెమ్మదిగా అందుతోంది. దశాబ్దాలపాటు అంతర్యుద్ధంతో చితికిపోయిన అఫ్గానిస్తాన్ ప్రజలకు తాజాగా సంభవించిన భూకంపం మరింత కుంగదీసింది. అంతర్జాతీయ సమాజం స్పందించాలంటూ ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చినప్పటికీ చైనా, పాకిస్తాన్ వంటి కొన్ని పొరుగుదేశాలు మాత్రమే అఫ్గాన్లకు సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. అఫ్గాన్ రెడ్ క్రీసెంట్ సొసైటీకి చెందిన 20 బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. నీడ కోల్పోయిన వారికోసం తాత్కాలిక క్యాంపులను ఏర్పాటు చేసింది. -
ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. 24 గంటల్లో 24 మంది మృతి
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో గడిచిన 24 గంటల్లో 24 మంది మృత్యువాతపడటం తీవ్ర కలకలం రేపుతోంది. మరణించిన వారిలో 12 మంది నవజాత శిశువులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. నాందేడ్ జిల్లాలో శంకర్రావు చావన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘోరం వెలుగుచూసింది. అయితే ఆసుపత్రిలో మందులు, సిబ్బంది కొరత వల్లే ఈ విషాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెరుగుతున్న మృతుల సంఖ్య నాందేడ్ ప్రభుత్వ వైద్యశాలలో గత 24 గంటల్లో 24 మంది రోగులు మరణించారు. వీరిలో 12 మంది అప్పుడే పుట్టిన చిన్నారులు కూడా ఉండటం హృదయాలను కలచివేస్తోంది. మరోవైపు నాందేడ్ ఆసుపత్రిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దురదృష్టవశాత్తు మరో ఏడుగురు రోగులు మరణించారు. వీరిలో చనిపోయిన వారిలో 4గురు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో మంగళవారం ఉదయం నాటికి మరణించిన వారి సంఖ్య 31కు చేరింది. తాజా మరణాలకు సంబంధించి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఎక్స్‌లో పోస్ట్ ద్వారా తెలియజేశారు. नांदेडमध्ये मृत्यूचे थैमान सुरूच. शासकीय वैद्यकीय महाविद्यालयाच्या रुग्णालयात कालपासून आणखी ७ रुग्णांचा दुर्दैवी मृत्यू. मृतकांमध्ये ४ बालकांचाही समावेश. राज्य सरकारने जबाबदारी निश्चित करावी. — Ashok Chavan (@AshokChavanINC) October 3, 2023 మందుల కొరత వల్లే మరణాలు రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. మరణించిన 12 మంది చిన్నారుల్లో ఆరుగురు బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నారని ఆసుపత్రి డీన్ తెలిపారు. చనిపోయిన మిగతా పన్నెండు మంది పెద్దవారిలో పాము కాటుతో సహా వివిధ వ్యాధుల కారణంగా మరణించారని ఆయన పేర్కొన్నారు. 70-80 కి.మీలో ఏకైక ఆసుపత్రి ఆసుపత్రి తృతీయ స్థాయి కేర్ సెంటర్ మాత్రమేనని, కానీ చుట్టుపక్కల 70,80 కిలీమీటర్ల పరిధిలో ఉన్న ఏకైక హెల్త్ కేర్ సెంటర్ ఇదే కావడంతో వివిధ ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారని డీన్ తెలిపారు. ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య అధికంగా ఉందని అన్నారు. కొన్నిసార్లు పేషెంట్ల సంఖ్య ఆసుపత్రి బడ్జెట్‌ను మించిపోవడంతో మందుల కొరత ఏర్పడిందని తెలిపారు. చదవండి: ప్రాణం పోయేలా ఉందన్నా.. పడేసి పోయారు! సిబ్బంది బదిలీతోనూ ఇబ్బందులు హాఫ్కిన్ అనే సంస్థ నుంచి మందులను ఆసుపత్రి కొనుగోలు చేయాల్సి ఉందని, అయితే అది జరగడం లేదని అన్నారు డీన్. దీంతో రోగులు స్థానిక మెడికల్ షాపుల నుంచి మందులు కొనుగోలు చేసి తీసుకొచ్చిన తర్వాతే రోగులకు మందులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికితోడు అనేకమంది ఆసుపత్రి సిబ్బందిని బదిలీ చేయడం వల్ల రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. తల్లిదండ్రుల ఆవేదన.. మరోవైపు మృతుల్లో నవజాత శిశువులు కూడా ఉండటంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. తమ పిల్లల మరణాలకు ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమని, వైద్యులు సరిగా చికిత్స చేయడం లేదని ఆరోపిస్తున్నారు. తమ బిడ్డను చూడటానికి సిబ్బంది అనుమతించడం లేదని మరికొంతమంది చెబుతున్నారు. మా బిడ్డ క్షేమంగా ఉన్నాడో లేదో.. మాకు ఏమీ తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాల మండిపాటు ఇక ఈ ఘటన విషయంలో మహారాష్ట్రలోని శివసేన(షిండే వర్గం), బీజేపీ, ఎన్సీపీ(అజిత్ వర్గం) ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నాందేడ్ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 నవజాత శిశువులతో సహా 24 మరణాలు మందుల కొరత వల్ల మాత్రమే సంభవించలేదని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగాయని విరుచుకుపడ్డాయి. పండుగలు, పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వానికి, చిన్నారుల మందుల కోసం డబ్బులు కేటాయించకపోవడం సిగ్గు చేటని దుమ్మెత్తిపోస్తున్నాయి. బీజేపీ దృష్టిలో పేదల ప్రాణాలకు విలువ లేదని మండిపడుతున్నాయి. नांदेड़, महाराष्ट्र के सरकारी अस्पताल में दवाइयों की कमी से 12 नवजात शिशुओं समेत 24 लोगों की मृत्यु का समाचार अत्यंत दुखद है। सभी शोकाकुल परिवारों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं। भाजपा सरकार हज़ारों करोड़ रुपए अपने प्रचार पर खर्च कर देती है, मगर बच्चों की दवाइयों के लिए… — Rahul Gandhi (@RahulGandhi) October 2, 2023 విచారణకు ఆదేశం ఎన్సీపీ(శరద్ వర్గం) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను డిమాండ్ చేశారు. సంబంధిత మంత్రులను వారి పదవుల నుంచి తొలగించాలని అన్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోరారు. ఇక ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట కల్లా కమిటీ తన రిపోర్టు ఇవ్వనుందని మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ డైరెక్టర్ దిలీప్ మైసేకర్ తెలిపారు. -
USA: శతాబ్దంలోనే అతిపెద్ద విపత్తు.. 93కు చేరిన హవాయి మరణాలు
లహైనా: అమెరికాలోని హవాయి దీవుల్లో రేగిన కార్చిచ్చుతో లహైనా రిసార్ట్ నగరం ఒక బూడిద కుప్పగా మిగిలింది. మౌయి దీవిలో లహైనా పట్టణంలో మంగళవారం రాత్రి మొదలైన కార్చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉంది. వాతావరణం పొడిగా ఉండడంతో పాటు హరికేన్ ఏర్పడడంతో ద్వీపంలో బలమైన గాలులు వీచాయి. దీంతో శరవేగంతో మంటలు వ్యాపించి అందాల నగరాన్ని దగ్ధం చేశాయి. Footage of the initial start of the fires in Lahaina, Maui.#hawaii #wildfire No official cause has been released yet but class action lawsuits have already been opened by multiple law firms, suing the local utility and power companies for their roll in the tragedy. The class… pic.twitter.com/UGrDbqdEH2 — The Hotshot Wake Up (@HotshotWake) August 12, 2023 శతాబ్దంలోనే అతిపెద్ద విపత్తు.. హవాయిలో సంభవించిన భీకర కార్చిచ్చులో మృతుల సంఖ్య 93కు చేరుకుంది. మౌయి దీవిలో 93 మంది మృతి చెందినట్లు ఇప్పటి వరకు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మౌయిలో అన్వేషణ కొనసాగుతోందని చెప్పారు. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతం 5 చదరపు మైళ్లు కాగా కేవలం 3% మేర గాలింపు పూర్తయిందన్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. పశ్చిమ మౌయిలోని నివాసాల్లో 86% అంటే 2,200భవనాలు ధ్వంసమైనట్లు తేల్చారు. నష్టం 6 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. హవాయి కార్చిచ్చును ఈ శతాబ్దంలోనే అతిపెద్ద విపత్తుగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు.. కార్చిచ్చు కారణంగా హవాయిలో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ ఫ్యామిలీ దాదాపు 5 గంటల పాటు పసిఫిక్ మహా సమద్రంలో తలదాచుకున్నారు. A family from Lahaina on Maui, Hawaii survived the deadly wildfire by hiding in Pacific Ocean for 5 hours.https://t.co/40DjjD7rk0 pic.twitter.com/inpG9nLXu5 — Numberonepal🐝 (@numberonepal) August 14, 2023 చరిత్రలో భారీ కార్చిచ్చులు.. దేశం ఏడాది దగ్ధమైన అటవీ రష్యా 2003 2.2 కోట్ల హెక్టార్లు ఆ్రస్టేలియా 2020 1.7 కోట్ల హెక్టార్లు కెనడా 2014 45 లక్షల హెక్టార్లు అమెరికా 2004 26 లక్షల హెక్టార్లు 🚨🚨. Oregon: Level 1 and Level 2 evacuation orders have been issued by Lane County for the Bedrock Fire. Follow @CBKNEWS121 FOR MORE UPDATES #breakingnews #Hawaii #Hawaiifires #LahainaFires #MauiFires #wildfire pic.twitter.com/xreuMzvNJc — CBKNEWS (@CBKNEWS121) August 14, 2023 ఇది కూడా చదవండి: పాక్‌లో చైనీయులపై కాల్పులు.. జిన్‌పింగ్ ఆదేశాలు ఇవే.. -
Turkey-Syria earthquake: భూకంప మృతులు 35,000
అదియామాన్: తుర్కియే, సిరియాలో వారం రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటిదాకా 35,000 మందిపైగా మరణించారని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కొందరు శిథిలాల్లో చిక్కుకొని సజీవంగా బయటపడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా తుర్కియేలోని దక్షిణ హతాయ్ ప్రావిన్స్‌లో 13 ఏళ్ల బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. తుర్కియేలో ఉష్ణోగ్రత మైనస్ 6 డిగ్రీలకు పడిపోయింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు వాపోతున్నారు. భూకంపం వల్ల తుర్కియేకు 84.1 బిలియన్ డాలర్లకుపైగా నష్టం వాటిల్లినట్లు టర్కిష్ ఎంటర్ప్రైజ్ అండ్ బిజినెస్ కాన్ఫెడరేషన్ అంచనా వేసింది. -
పెళ్లిలో పేలిన సిలిండర్.. 32కు చేరిన మృతులు.. సీఎంపై బీజేపీ ఫైర్
జైపూర్: రాజస్థాన్ జోధ్‌పుర్‌లోని ఓ పెళ్లి వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 32కు పెరిగింది. శుక్రవారం మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. జోధ్‌పుర్‌లోని భుంగ్రా గ్రామంలో పెళ్లి వేడుక జరుగుతున్న ఇంట్లో డిసెంబర్ 8న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 50 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 32 మంది చనిపోయారు. మిగతా వారు జోధ్‌పుర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం అశోక్ గహ్లోత్ ఇంకా ఈ గ్రామాన్ని గానీ, ఆస్పత్రిని గానీ సందర్శించకపోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించాలని, గ్యాస్ కంపెనీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపించింది. పేలుడు జరిగిన గ్రామాన్ని సీఎం ఇంకా సందర్శించలేదని ధ్వజమెత్తింది. ఇంత విషాద సమయంలో కాంగ్రెస్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించిందని మండిపడింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జైపూర్‌లో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించింది కాంగ్రెస్. దీన్ని ఉద్దేశిస్తూ బీజేపీ గహ్లోత్ ప్రభుత్వంపై విమర్శలకు ఎక్కుపెట్టింది. రూ.2 లక్షలు పరిహారం.. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు పరిహారం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. గాయపడిన వారికి రూ.50 వేలు అందించనున్నట్లు పేర్కొంది. చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే.. -
ఇండోనేసియా భూకంపం.. 268కి చేరిన మృతులు
జకార్తా: ఇండోనేసియాలోని జావా దీవిలో సోమవారం వచ్చిన భూకంపంలో మృతుల సంఖ్య 268కి పెరిగింది. మరో 151 మంది జాడ తెలియాల్సి ఉందని, 1,083 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వారిలో 300 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల్లో ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులేనని పశ్చిమ జావా గవర్నర్ చెప్పారు. 13 వేల నివాసాలు దెబ్బతిన్నాయని చెప్పారు. మరిన్ని ప్రకంపనలు సంభవించవచ్చనే భయాందోళనల మధ్య ప్రజలు రోడ్లపైనే చీకట్లో గడిపారు. మంగళవారం దేశాధ్యక్షుడు జోకో విడొడొ సియంజుర్‌లో పర్యటించారు. చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. 38 మంది సజీవదహనం -
2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ వల్లే..
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలో మంగళవారం సంభవించిన శక్తివంతమైన పేలుడులో మృతుల సంఖ్య 135కు చేరిందని, 5,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని లెబనీస్ రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారి జార్జి కెటానెహ్ చెప్పారు. నగరంలో ఇటీవలి కాలంలో ఇదే అతి పెద్ద పేలుడని భావిస్తున్నారు. బుధవారం నగరంలో బీతావహ దృశ్యాలు కనిపించాయి. పోర్ట్ నుంచి ఇప్పటికీ పొగ వెలువడుతోంది. పరిసర ప్రాంతాలు బూడిద, వ్యర్థాలతో నిండిపోయాయి. పెద్దసంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. భవనాలు నేలమట్టమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. చిన్న మంటగా మొదలైన ఈ విస్ఫోటనం క్షణాల్లోనే భీకర రూపం దాల్చింది. ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. 1975–1990 మధ్య జరిగిన సివిల్ వార్‌లో, పొరుగు దేశం ఇజ్రాయెల్‌తో జరిగిన ఘర్షణల్లో, ఉగ్రవాద దాడుల్లో ఇలాంటి పేలుళ్లు కనిపించాయని స్థానికులు అంటున్నారు. ప్రాణాలు తీసిన అమ్మోనియం నైట్రేట్ 2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు లెబనాన్ మంత్రి మొహమ్మద్ ఫహ్మీ చెప్పారు. బీరుట్ పోర్ట్‌లోని ఓ గోదాములో దీన్ని నిల్వ చేసినట్లు తెలిసింది. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు జరిగిన వెంటనే ముదురు నారింజ రంగు మేఘం పుట్టుగొడుగు ఆకారంలో ఆకాశంలోకి ఎగిరిపోతున్న దృశ్యం కనిపించింది. విషపూరితమైన నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ విడుదలైంది. దీన్ని పీల్చడం వల్ల చాలామంది శ్వాస ఆడక ప్రాణాలొదిలారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి. ఆహార సంక్షోభం తప్పదా? చాలా చిన్న దేశమైన లెబనాన్‌లో ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుప్పకూలింది. సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. ప్రజల్లో అసంతృప్తిజ్వాలలు రగులుతున్నాయి. వారు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి లెబనాన్‌పై పంజా విసురుతోంది. ఆసుపత్రులు కరోనా బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేలుడు సంభవించి, 135 మంది అమాయక జనం చనిపోవడం పాలకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. లెబనాన్ 10 లక్షల మందికి పైగా సిరియా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది. విదేశాల నుంచి నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల దిగుమతికి బీరూట్ పోర్ట్ అత్యంత కీలకం. తాజా పేలుడు వల్ల ఈ ఓడరేవు చాలావరకు నామరూపాల్లేకుండా పోయింది. దిగుమతులన్నీ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఇకపై ఆహార సంక్షోభం తప్పదని వాదన వినిపిస్తోంది. భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి లెబనాన్‌లో పేలుడు సంభవించి, 135 మంది మరణించడం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మిన్నంటిన ఆక్రందనలు కూలిన భవనాలు, రేగుతున్న పొగలు, గల్లంతైన కుటుంబ సభ్యులు.. ఇదీ ప్రస్తుతం బీరుట్ లో పరిస్థితి. ఓ వైపు అంబులెన్స్ సైరన్లు మోగుతుంటే మరోవైపు బాధితుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. దారుణమైన ఈ పేలుడు నగరాన్ని ఛిద్రం చేసేసింది. రంగు రంగుల అద్దాలతో, అందమైన రాళ్ల నిర్మాణాలతో ఉన్న ప్రాంతమంతా మరుభూమిగా మారింది. తరాల పాటు నిర్మించిన భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. 1975 నుంచి 1990ల మధ్య జరిగిన సివిల్ వార్‌ను సైతం తట్టుకున్న భవనాలు, పేలుడు ధాటిని మాత్రం తట్టుకోలేక చరిత్రలో కనుమరుగయ్యేలా నేలకూలాయి. ఇంటి బాల్కనీలు రోడ్డు నడిమధ్యకు వచ్చి పడ్డాయి. రెస్టారెంట్లు, షాపుల్లోని కుర్చీలు ఎవరినీ రానివ్వద్దన్నట్టు తలకిందులుగా పడిపోయాయి. నేనెక్కడికెళ్లాలి ? నేనేం చేయాలి అంటూ కుప్పకూలిన ఓ ఇంటి ఎదుట యజమానురాలు బాధను వ్యక్తం చేస్తూ కనిపించింది. పసి పిల్లలు పేలుడు ధాటికి ఆస్పత్రుల పాలయ్యారు. ఇంతకు మించి వినాశనమంటూ ఉంటుందా అనే స్థాయిలో నగరం దిబ్బగా మారింది. ప్రస్తుతానికైతే కుయ్ మంటూ తిరిగే అంబులెన్సులు, రాళ్లెత్తి మరీ మనుషుల కోసం వెతుకుతున్న వాలంటీర్ల శ్రమ, అయినవారిని కోల్పోయి రోదిస్తున్న బాధితుల ఆక్రందనలు మాత్రమే కనిపిస్తున్నాయి. లెబనాన్‌కు వెల్లువెత్తుతున్న సాయం లెబనాన్‌కి అంతర్జాతీయ సమాజం నుంచి సహాయం వెల్లువెత్తుతోంది. లెబనాన్‌లో సంభవించిన పేలుడు అనంతరం క్షతగాత్రులను ఆదుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ విమానాల ద్వారా అవసరమైన మందులను పరికరాలను పంపిస్తున్నట్లు వెల్లడించింది. మందులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్‌లోని మానవతా సహాయ కేంద్రం నుంచి క్షతగాత్రులకు చేరవేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి తారిక్ జెసా రెవిక్ చెప్పారు. ఓడరేవు కేంద్రంగా జరిగిన భారీ పేలుడు ప్రభావంతో అనేక భవనాలు శిథిలమయ్యాయి. బీరుట్లో బీభత్సం సృష్టించిన ఈ పేలుడు ప్రభావంతో ప్రజా జీవనం ఛిన్నాభిన్నమైంది. యూరోపియన్ సమాజం, రష్యా, నార్వే, టర్కీ, నెదర్లాండ్స్, సైప్రస్, గ్రీక్, ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు ఇప్పటికే మందులు, వాహనాలు, హెలికాప్టర్లు, అంబులెన్సులు, వైద్య బృందాలు, రెస్క్యూ టీమ్‌లను తరలించడం ప్రారంభించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ లెబనాన్‌ను సందర్శించారు. దేశాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో అనేక విదేశీ రాయబార కార్యాలయాలు సైతం దెబ్బతిన్నాయి. కష్టాల్లో ఉన్నాం.. ఆదుకోండి ప్రపంచ దేశాలకు లెబనాన్ ప్రధాని వేడుకోలు ఆర్థిక సంక్షోభంతోపాటు బీరుట్లో పేలుడు వల్ల తాము కష్టాల్లో కూరుకుపోయామని, ప్రపంచ దేశాలు, మిత్ర దేశాలు వెంటనే స్పందించి, ఆదుకోవాలని లెబనాన్ ప్రధానమంత్రి హసన్ దియాబ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ప్రసంగం విడుదల చేశారు. పేలుడుకు పాల్పడి, అమాయకుల ప్రాణాలను బలిగొన్న వారు ఎప్పటికైనా మూల్యం చెల్లించకోక తప్పదని పేర్కొన్నారు. పేలుడులో గాయపడిన మహిళకు చికిత్స అందిస్తున్న ఆరోగ్య కార్యకర్త పేలుడులో గాయపడిన చిన్నారి పేలుడు వల్ల ఎగిసిపడుతున్న మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది -
కల్తీ మద్యం..18కి చేరిన మరణాలు
మెక్సికో : కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 18కు చేరుకుంది. సోమవారం ఒక్కరోజే 10 మంది మృత్యువాత పడగా, మరో 16మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెథనాల్ కలిపిన కల్తీ మద్యాన్ని తాగడంతోనే వీరి చనిపోయారని వైద్యాదికారులు పేర్కొన్నారు. వీరంతా ట్లాపా డి కామన్ ఫోర్డ్ పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల నివాసితులుగా గుర్తించిన అధికారులు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారని తెలిపారు. తక్కువ ధరకే మద్యం అందుబాటులో ఉండటంతో ఎక్కమంది దీనికి బానిసలుగా మారారు. (నేపాల్‌లో స్కూళ్ల నిర్మాణానికి భారత్ సాయం! ) 'రాంచో ఎస్కోండిడో' అని పిలిచే ఈ పానీయంలో విష పదార్థాలు కలవడంతోనే ప్రాణాలు విడిచారాని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలోని నాలుగు దుకాణాల నుంచి 505 కల్తీ మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక లాక్డౌన్ ప్రారంభం అయినపప్పటి నుంచి అన్నిరకాల మద్యం అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో తక్కువ ధరకే కల్తీ మద్యం దొరుకుతుందని చాలామంది నిరుపేదలు దీనికి అలవాటు పడ్డారు. ఫలితంగా దీని కారణంగా మే నెలలోనే 40 మంది చనిపోగా ప్రస్తుతం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. (మాజీ ప్రధాని, రైల్వే మంత్రికి కరోనా! ) -
కరోనా కలకలం : 2000కు చేరిన మృతుల సంఖ్య
బీజింగ్ : కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం కలవరం కలిగిస్తోంది. కొత్తగా పలు కేసులు వెలుగు చూస్తుండటం మృతుల సంఖ్య 2000కు చేరడం ఆందోళన రేకెత్తిస్తోంది. డెడ్లీ వైరస్ మందగించిందనేందుకు తగిన గణాంకాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో మృతుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. హుబేయి ప్రావిన్స్‌లో మృతుల సంఖ్య సోమవారం 93 కాగా మంగళవారం 132కు పెరగడం విశేషం. చైనా వ్యాప్తంగా కరోనా కేసులు ఇప్పటివరకూ 74,000 నమోదు కాగా మరణాల సంఖ్య 2000కు పెరిగిందని అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాప్తి అటు అంతర్జాతీయ వృద్ధి రేటును, కార్పొరేట్ల లాభాలనూ ప్రభావితం చేస్తుండగా చమురు రేట్లు, ఈక్విటీ మార్కెట్లు కుదేలయ్యాయి. చదవండి : యాపిల్‌కూ ‘వైరస్’ -
‘19 మంది మృతి..1100 మంది అరెస్ట్’
లక్నో : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన హింసాత్మక నిరసనల్లో యూపీలోనే అత్యధికంగా 19 మంది మరణించగా, 1000 మందికి పైగా అల్లర్ల కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ప్రార్ధనల దృష్ట్యా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి హింసాత్మక ఘటనలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భద్రతా బలగాలు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించాయి. మరోవైపు గతవారం జరిగిన హింసలో యూపీలో 19 మంది మరణించారని హోంశాఖ ప్రతినిధి వెల్లడించారు. పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనల్లో 288 మంది పోలీసులు గాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లతో సంబంధముందనే ఆరోపణలపై 1,113 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 327 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని హోంశాఖ ప్రతినిధి తెలిపారు. అల్లర్లు చెలరేగకుండా నిరోధించేందుకు 5,558 ముందస్తు అరెస్ట్‌లు జరిగాయని చెప్పారు. -
మంటల్లో రైలు
లాహోర్: రైలులో జరిగిన అగ్ని ప్రమాదంలో 74 మంది మృత్యువాత పడిన దారుణ ఘటన గురువారం ఉదయం పాకిస్తాన్లో చోటు చేసుకుంది. కరాచీ నుంచి రావల్పిండికి వెళ్తున్న తేజ్గామ్ ఎక్స్‌ప్రెస్‌లో కొందరు ప్రయాణీకులు ఉదయం గ్యాస్ స్టవ్‌లపై అల్పాహారం తయారు చేసుకుంటుండగా లియాఖత్పూర్ సమీపంలో ఒక్కసారిగా రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయని, క్షణాల్లో మంటలు వ్యాపించాయని, దాంతో మూడు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ బోగీల్లో పిల్లలు, మహిళలు సహా దాదాపు 200 మంది వరకు ఉన్నారని, వారిలో అత్యధికులు రాయివింద్ పట్టణంలో జరగనున్న మత ప్రబోధ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నవారేనని తెలిపారు. మృతుల్లో అత్యధికులు ఇస్లాం వ్యాప్తికి కృషి చేసే తబ్లీగీ జమాత్ సంస్థకు చెందినవారేనని పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వెల్లడించారు. ఆ సంస్థ ప్రధాన కార్యాలయం రాయివింద్ పట్టణంలో ఉందని, అక్కడ ప్రతీ సంవత్సరం తబ్లీజీ జితేమా అనే మత ప్రబోధ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ముస్లింలు, మత ప్రచారకులు వెళ్తుంటారని వివరించారు. పేలుళ్లు జరిగిన సమయంలో కొందరు ప్రయాణీకుల వద్ద కిరోసిన్ ఉండటంతో, మంటలు త్వరితగతిన వ్యాపించాయని తెలిపారు. మంటల భయంతో ప్రయాణీకులు వేగంగా వెళ్తున్న రైళ్లోంచి దూకేయడంతో ఎక్కువ మరణాలు సంభవించాయన్నారు. ప్రయాణీకులు గ్యాస్ సిలిండర్లు తీసుకువెళ్లకుండా అడ్డుకోలేకపోవడం రైల్వే సిబ్బంది పొరపాటేనని అంగీకరించారు. మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షలు, గాయపడినవారికి రూ. 5 లక్షలు పరిహారంగా ఇస్తామన్నారు. అయితే, తబ్లీగీ జమాత్ ప్రతనిధులు మాత్రం సిలిండర్లు పేలడం వల్ల ప్రమాదం జరిగిందన్న రైల్వే మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పేలుళ్లు జరిగాయని వారు తెలిపారు. వైర్లు కాలిన వాసన వస్తోందంటూ బుధవారం రాత్రే రైల్వే సిబ్బందికి తెలిపినా, వారు పట్టించుకోలేదని గాయపడ్డ పలువురు ప్రయాణీకులు ఆరోపించారు. ఈ ప్రమాద ఘటనపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదం గురించి సమాచారం తెలియగానే అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి, కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోనికి తీసుకువచ్చాయి. ఆస్పత్రికి తీసుకువచ్చిన మృతదేహాల్లో గుర్తించడానికి వీలులేని స్థితిలో ఉన్నవే ఎక్కువగా ఉన్నాయని లియాఖత్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు నదీమ్ జియా తెలిపారు. -
యూపీలో ధూళి తుపాను బీభత్సం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దుమ్ము తుపాను బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 26 మంది మృతి చెందగా, 57 మంది గాయపడ్డారు. తుపాను ధాటికి ఇంటి గోడలు కూలిపోగా, చెట్లు నేలకొరిగాయి. దీంతో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టినట్లు విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. మైన్‌పురిలో పలు చోట్ల గోడ కూలిన ఘటనలో అత్యధికంగా ఆరుగురు మృతి చెందారని విపత్తు కమిషనర్ తెలిపారు. అలాగే మైన్‌పురి జిల్లాలో 41 మంది గాయపడ్డారని, చెట్లు కూకటి వేళ్లతో సహా రహదారికి అడ్డంగా పడటంతో చాలా సేపటి వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పారు. ఆ సమయంలో ప్రజలు వారి ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో హఠాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందని, దీంతో ఇంటి గోడలు కూలి చాలావరకు గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. ‘ఇప్పటి వరకు మాకున్న సమాచారం ప్రకారం దుమ్ము తుపాను కారణంగా మైన్‌పురిలో ఆరుగురు, ఎటా, కాస్గంజ్ల్లో ముగ్గురు, ఫరూఖాబాద్, బారాబంకిల్లో ఇద్దరు, మొరాదాబాద్, బదౌన్, పిలిభిత్, మధుర, కనౌజ్, సంభాల్, ఘజియాబాద్, అమ్రోహ, బదౌన్, మహోబాల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు’అని కమిషనర్ పేర్కొన్నారు. కాగా, తాజా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తుపాను బాధితులకు సాయం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
చిగురుటాకులా వణుకుతున్న శ్రీలంక
కొలంబో : వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణుకుతోంది. విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకూ మొత్తం ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. హోటళ్లు, చర్చిల్లో విదేశీ యాత్రికులే టార్గెట్‌గా ఆత్మహుతి దాడులు జరిగాయి. కొలంబో సహా నెగొంబో, బట్టికలోవా నగరాల్లో ఆదివారం ఉదయం జరిగిన వరుస పేలుళ్లలో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, పెద్ద ఎత్తున గాయపడ్డారు. వరుస బాంబు పేలుళ్లలో 35మంది విదేశీయులు చనిపోయారు. ఈ పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తముందని శ్రీలంక ప్రభుత్వం భావిస్తోంది. చదవండి...(బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో) అయితే ఈ దాడుల్లో 185మంది చనిపోయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటికీ మృతుల సంఖ్య మరింతగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సుమారు 500మంది గాయపడినట్లు సమాచారం. కాగా ఆరు గంటల వ్యవధిలో ఎనిమిదిచోట్ల పేలుళ్లు జరిగాయి. తాజాగా దెహివాలా జులాజికల్ గార్డెన్‌లోని రిసెప్షన్ హాల్ వద్ద ఎనిమిదో పేలుడు జరగ్గా ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. చదవండి... (శ్రీలంకలో హైఅలర్ట్ : వదంతులు నమ్మరాదన్న విక్రమసింఘే) మరోవైపు శ్రీలంక భద్రతా సిబ్బంది అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. మరోవైపు ఇవాళ నుంచి సోమవారం సాయంత్రం వరకూ కర్ఫ్యూ విధించింది. అలాగే సోషల్ మీడియాపై కూడా లంక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక పాఠశాలలకు రెండు రోజులు సెలవు ప్రకటించింది. పేలుడు జరిగిన ప్రాంతాల్లో భద్రతా దళాలను మోహరించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ జులాజికల్ గార్డెన్‌ను మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా ఈ ఘటనలో మృతులు, క్షతగాత్రుల్లో భారతీయులు ఎవరూ ఉన్నట్టు వార్తలు రాకున్నా కొలంబోలోని భారత హైకమిషన్ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తోంది. చదవండి...(కొలంబో పేలుళ్లు : తృటిలో బయటపడ్డ సినీ నటి) -
బ్యాంకుల దోపిడీకి విఫలయత్నం
రియో డీ జనీరో: బ్రెజిల్లో బ్యాంకుల లూటీకి దొంగల ముఠా చేసిన యత్నం విఫలమయింది. ఈ సందర్భంగా ముఠా, పోలీసుల మధ్య∙కాల్పుల్లో ముఠా వద్ద బందీలుగా ఉన్నావారుసహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ఉన్నారు. బ్రెజిల్‌లోని మిలగ్రెస్ సిటీలో శుక్రవారం వేకువజామున ఈ ఘటన జరిగింది. సుమారు 30 మంది ఉన్న సాయుధ దొంగల ముఠా సభ్యులు రెండు బ్యాంకులున్న వీధికి అడ్డంగా ట్రక్కును ఆపారు. విషయం తెల్సుకున్న పోలీసులు రంగంలోకి దిగి కాల్పులు జరిపారు. దొంగలకు, పోలీసులకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. అదే సమయంలో అటువైపుగా వచ్చిన కారును దుండగులు అడ్డగించారు. అందులోని వారిని బందీలుగా ఉంచుకున్నారు. ఇరవై నిమిషాల పాటు కొనసాగిన ఎదురు కాల్పుల్లో బందీలుగా ఉన్న ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురూ చనిపోయారు. దుండగుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మిగతా వారు పరారయ్యారు. బందీల మృతికి కారణం పోలీసులా లేక దుండగులా అన్నది విచారణలో తేలుతుందని సియారా రాష్ట్ర గవర్నర్ తెలిపారు. -
‘గజ’ తుపాను మృతులు 59
సాక్షి ప్రతినిధి, చెన్నై: దక్షిణ తమిళనాడుపై గజ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. తుపాను కారణంగా చనిపోయిన వారి సంఖ్య అనధికారిక లెక్కల ప్రకారం శనివారం నాటికి 59కి చేరింది. కొండచరియలు విరిగిపడటంతో కొడైకెనాల్లో నలుగురు చనిపోయారు. దాదాపు ఏడు జిల్లాల్లో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది. గజ తుపాను నాగపట్నం–వేదారణ్యం మధ్యన శుక్రవారం తీరం దాటిన విషయం తెలిసిందే. తీరం దాటుతున్న సమయంలో అత్యంత తీవ్రతతో వీచిన ఈదురుగాలులు, వర్షాలు కడలూరు, తంజావూరు, తిరువా రూరు, నాగపట్నం, దిండు గల్లు, పుదుక్కోటై, రామనాధపురం జిల్లాల్లో పెను విధ్వంసం సృష్టించాయి. ఈ తుపాను కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని కారైక్కాల్ జిల్లాలోనూ తీవ్ర ప్రభావం చూపింది. తంజావూరు, నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో రూ. 10 వేల కోట్లు నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. కొడైకెనాల్ పరిసరాల్లో 50కి పైగా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోవడంతో, వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. 22 వేల ఇళ్లు పాక్షికంగాను, పూర్తిగాను దెబ్బతిన్నాయి. తుపానువల్ల తంజా వూరు, తిరువారూరు, నాగపట్నం, తదితర జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంటనష్టం సంభవించింది. కాగా, తుపాను సహాయ చర్యలను ప్రభుత్వం సమర్ధవంతంగా నిర్వహించడంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. కాగా, ఈ తుపాను వల్ల 36 మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. పుదుకోట్టైలో ఏడుగురు, కడలూరులో ముగ్గురు, నాగపట్నంలో నలుగురు, తంజావూరులో నలుగురు, తిరుచ్చిలో ఇద్దరు, దిండుగల్‌లో ఇద్దరు, శివగంగైలో ఇద్దరు సహా మొత్తం 36 మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ విపత్తు సహాయ దళం ప్రకటించింది. -
‘గజ’ తుపాను బీభత్సం
నాగపట్టణం/సాక్షి ప్రతినిధి, చెన్నై: భారీ వర్షాలు, ఈదురుగాలులతో విరుచుకుపడిన గజ తుపాను ధాటికి దక్షిణ తమిళనాడు, పుదుచ్చేరిలు శుక్రవారం అతలాకుతలమయ్యాయి. తమిళనాడులోనే 26 మంది మృతి చెందగా భారీ సంఖ్యలో ఆస్తినష్టం జరిగింది. వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇళ్లు కూలడం, పొలాల్లో పంటలు నాశనం కావడం తదితర ఘటనలు చోటుచేసుకున్నాయి. చాలాచోట్ల రోడ్లు కూడా దెబ్బతిని ఎన్నో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు కేంద్రం, రాష్ట్రం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. వందలకొద్దీ సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి దాదాపు 81 వేల మందిని శిబిరాలకు తరలించారు. జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు పడవలతో రంగంలోకి దిగి ఉధృతంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. తుపాను విషయమై సీఎం పళనిస్వామితో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. తుపాను కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యల గురించి పళనిస్వామి వివరించారు. తమిళనాడును ఆదుకుంటామనీ, అవసరమైన సాయం చేస్తామని మోదీ హామీనిచ్చారు. కాగా, తమిళనాడు రాష్ట్ర విపత్తు స్పందన దళం తుపానును ఎదుర్కోవడంలో మెరుగ్గా పనిచేస్తోందని ప్రతిపక్ష డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రశంసించడం గమనార్హం. వేకువజామున తీరం దాటిన తుపాను శుక్రవారం తెల్లవారుజామున నాగపట్టణం, వేదారణ్యంల మధ్య తుపాను తీరం దాటింది. ఆ సమయంలో గంటలకు 120 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. తమిళనాడులోని కడలూరు, నాగపట్టణం, రామనాథపురం, తంజావూరు, పుదుకోట్టై, తిరువారూరు, తిరుచ్చి జిల్లాలు, పుదుచ్చేరిలోని కరైక్కాల్, పాండిచ్చేరి జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. నాగపట్టణంలోని వేలాంకణి పట్టణంలో ఉన్న ప్రఖ్యాత చర్చి, అక్కడ ఉన్న జీసస్ విగ్రహం తుపాను ధాటికి దెబ్బతిన్నాయి. 7 జిల్లాల్లో మొత్తంగా 4,987 చెట్లు దాదాపు 1,700 ఇళ్లు/గుడిసెలు కూలిపోయాయి. తుపాను కారణంగా కొబ్బరి, అరటి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయనీ, రైతులకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని రైతు నేత పీఆర్ పాండ్యన్ డిమాండ్ చేశారు. లోటు వర్షపాతంతో సతమతమవుతున్న తమిళనాడు రైతాంగానికి వరంలా గజ తుపాను కారణంగా వర్షాలు కురిశాయని వాతావరణ విభాగం అధికారులు అంటున్నారు. పుదుచ్చేరి పరిధిలోని పాండిచ్చేరి, కరైక్కాల్ జిల్లాల్లో కూడా తుపాను కారణంగా తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. దీనిపై త్వరలోనే కేంద్రానికి నివేదిక పంపుతామని కైరక్కాల్‌లో సీఎం నారాయణస్వామి చెప్పారు. పుదుచ్చేరిలో మొత్తం 190 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి, దాదాపు 6,000 మందిని అక్కడకు తరలించామన్నారు. తంజావూరులో 10మంది మృతి తుపాను కారణంగా ఒక్క తంజావూరు జిల్లాలో ఓ చిన్నారి సహా 10 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. తిరువారూరులో ఐదుగురు, పుదుకోట్టై, కడలూరుల్లో ముగ్గురు చొప్పున, తిరుచ్చిలో ఇద్దరు, నాగపట్టణంలో ఒకరు, తిరువణ్ణామలై, శివగంగైల్లో ఒకరు చొప్పున మరణించారు. తుపాను కారణంగా 15 మంది చనిపోయారని సీఎం ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబీకులకు రూ. 10 లక్ష నష్ట పరిహారాన్ని అందజేస్తామన్నారు. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం సాక్షి, విశాఖపట్నం: నాగపట్టణం, వేదారణ్యంల మధ్య తీరం దాటిన అనంతరం గజ తుపాను వాయుగుండంగా మారిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. తిరుపతి, కోడూరు, గూడూరు తదితరప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయని చెప్పింది. ఆదివారం దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కూడా వాయుగుండంగా బలపడే అవకాశం ఉందనీ, దక్షిణ కోస్తా ఆంధ్ర, తమిళనాడులపై ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
శబరిమల అయ్యప్పస్వామి ఆలయం పరిసరాలలో వరద బీభత్సం
-
167కు చేరిన కేరళ వరద మృతులు
తిరువనంతపురం : కేరళలో వరదల కారణంగా చోటుచేసుకున్న మరణాల సంఖ్య 167కు పెరిగిందని సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా పలు ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పునరావస శిబిరాల్లో 2.23 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారని వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో తాజా పరిస్థితి గురించి ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో కేరళ సీఎం నేడు ఫోన్లో చర్చించారు. రాష్ట్రంలో వరద పరిస్థితి సమీక్షించేందుకు శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీ కేరళ చేరుకోనున్నారు. కాగా, వరద పరిస్థితి, సహాయ పునరావస కార్యక్రమాలపై కేరళ సీఎం పినరయి విజయన్‌తో ఫోన్లో చర్చించామని, తాను ఈ రోజు సాయంత్రం కేరళ వెళుతున్నానని, వరద పరిస్థితిపై పూర్థి స్ధాయి సమీక్ష చేపడతామని ప్రధాని ట్వీట్ చేశారు. -
ముజఫర్‌నగర్ హింస: మృతుల సంఖ్య 38
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో హింసాత్మక సంఘటనలు ఇంకా చల్లారలేదు. మృతుల సంఖ్య 38కి చేరింది. కర్ఫ్యూ ఇంకా పలు ప్రాంతాల్లో కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సైన్యం కవాతు చేస్తోంది. హింసాత్మక సంఘటనలలో ఇప్పటివరకు 366 మందిని ఈ కేసుల్లో అరెస్టు చేశారు. వివిధ జిల్లాల్లో జరిగిన సంఘటనలలో 38 మంది మరణించగా, వీరిలో ఒక్క ముజఫర్‌నగర్‌లోనే 32 మంది ప్రాణాలు కోల్పోయారని హోం శాఖ కార్యదర్శి కమల్ సక్సేనా తెలిపారు. మీరట్, హపూర్, సహరాపూర్, షామ్లి జిల్లాల్లో 81 మంది గాయపడ్డారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, కొత్తగా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదని హోంశాఖ కార్యదర్శి తెలిపారు. ముజఫర్‌నగర్ జిల్లాలోని సివిల్ లైన్స్, కొత్వాలీ, నయీ మండీ పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతోంది. అలాగే ముజఫర్‌నగర్, షామ్లి, మీరట్ ప్రాంతాల్లో సైన్యం కవాతు చేస్తోందని సక్సేనా తెలిపారు. నిషేధాజ్ఞలను కఠినంగా అమలుచేస్తున్నారు. బీజేఎల్పీ నాయకుడు హుకుమ్ సింగ్, ఎమ్మెల్యేలు సురేష్ రాణా, భర్తేందు, సంగీత్ సోమ్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హరేంద్ర మాలిక్ తదితరులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు వారిపై కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు ముజఫర్‌నగర్ వెళ్లడానికి ప్రయత్నించిన కేంద్ర మంత్రి అజిత్ సింగ్ సహా కొందరు సీనియర్ నాయకులపైనా కేసులు పెట్టారు. ముజఫర్‌నగర్ సంఘటనలతో తీవ్రంగా కలత చెందిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోమవారమే యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడారు. కేంద్రం నుంచి కావల్సిన అన్ని రకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.