తిరువనంతపురం : కేరళలో వరదల కారణంగా చోటుచేసుకున్న మరణాల సంఖ్య 167కు పెరిగిందని సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా పలు ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పునరావస శిబిరాల్లో 2.23 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారని వెల్లడించారు.
భారీ వర్షాల నేపథ్యంలో తాజా పరిస్థితి గురించి ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో కేరళ సీఎం నేడు ఫోన్‌లో చర్చించారు. రాష్ట్రంలో వరద పరిస్థితి సమీక్షించేందుకు శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీ కేరళ చేరుకోనున్నారు. కాగా, వరద పరిస్థితి, సహాయ పునరావస కార్యక్రమాలపై కేరళ సీఎం పినరయి విజయన్‌తో ఫోన్‌లో చర్చించామని, తాను ఈ రోజు సాయంత్రం కేరళ వెళుతున్నానని, వరద పరిస్థితిపై పూర్థి స్ధాయి సమీక్ష చేపడతామని ప్రధాని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment