బీజింగ్ : కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం కలవరం కలిగిస్తోంది. కొత్తగా పలు కేసులు వెలుగు చూస్తుండటం మృతుల సంఖ్య 2000కు చేరడం ఆందోళన రేకెత్తిస్తోంది. డెడ్లీ వైరస్ మందగించిందనేందుకు తగిన గణాంకాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో మృతుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. హుబేయి ప్రావిన్స్‌లో మృతుల సంఖ్య సోమవారం 93 కాగా మంగళవారం 132కు పెరగడం విశేషం. చైనా వ్యాప్తంగా కరోనా కేసులు ఇప్పటివరకూ 74,000 నమోదు కాగా మరణాల సంఖ్య 2000కు పెరిగిందని అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాప్తి అటు అంతర్జాతీయ వృద్ధి రేటును, కార్పొరేట్ల లాభాలనూ ప్రభావితం చేస్తుండగా చమురు రేట్లు, ఈక్విటీ మార్కెట్లు కుదేలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment