చత్తీస్‌గఢ్: లోకసభ ఎన్నికల నేపథ్యంలో చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా పోలీసుల, భద్రతా బలగాల కుంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బీజాపూర్‌లో నిన్న( సోమవారం) జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య పెరిగింది.
కోర్చోలి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. నిన్న సాయంత్రం వరకు 10 మంది మావోయిస్టులు మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ఆపరేషన్ పూర్తైన అనంతరం మరో ముగ్గురు మావోయిస్టులు మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
సుమారు 8 గంటల పాటు ఎదురు కాల్పులు కొనసాగాయి. కుంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్న డీఆర్జీ, సీఆర్‌పీఎఫ్, కోబ్రా బెటాలియన్, బస్తర్ ఫైటర్స్ పాల్గొన్నారు. ఇక.. దండకారణ్యంలో వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పది రోజుల వ్యవధిలో నాలుగు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇప్పటివరకు మొత్తం 25 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి
Comments
Please login to add a commentAdd a comment