Maui Hawaii Wildfires: Death Toll Rises To 93 - Sakshi
Sakshi News home page

USA: శతాబ్దంలోనే అతిపెద్ద విపత్తు.. 93కు చేరిన హవాయి మరణాలు

Published Mon, Aug 14 2023 7:48 AM | Last Updated on Mon, Aug 14 2023 8:48 AM

Death Toll From Maui Wildfires Hawaii Reached 93 On Sunday - Sakshi

లహైనా: అమెరికాలోని హవాయి దీవుల్లో రేగిన కార్చిచ్చుతో  లహైనా రిసార్ట్‌ నగరం ఒక బూడిద కుప్పగా మిగిలింది. మౌయి దీవిలో లహైనా పట్టణంలో మంగళవారం రాత్రి మొదలైన కార్చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉంది. వాతావరణం పొడిగా ఉండడంతో పాటు హరికేన్‌ ఏర్పడడంతో ద్వీపంలో బలమైన గాలులు వీచాయి. దీంతో శరవేగంతో మంటలు వ్యాపించి అందాల నగరాన్ని దగ్ధం చేశాయి.

శతాబ్దంలోనే అతిపెద్ద విపత్తు..
హవాయిలో సంభవించిన భీకర కార్చిచ్చులో మృతుల సంఖ్య 93కు చేరుకుంది. మౌయి దీవిలో 93 మంది మృతి చెందినట్లు ఇప్పటి వరకు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మౌయిలో అన్వేషణ కొనసాగుతోందని చెప్పారు. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతం 5 చదరపు మైళ్లు కాగా కేవలం 3% మేర గాలింపు పూర్తయిందన్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.  పశ్చిమ మౌయిలోని నివాసాల్లో 86% అంటే 2,200భవనాలు ధ్వంసమైనట్లు తేల్చారు. నష్టం 6 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. హవాయి కార్చిచ్చును ఈ శతాబ్దంలోనే అతిపెద్ద విపత్తుగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.   

మరోవైపు.. కార్చిచ్చు కారణంగా హవాయిలో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ ఫ్యామిలీ దాదాపు 5 గంటల పాటు పసిఫిక్‌ మహా సమద్రంలో తలదాచుకున్నారు. 

చరిత్రలో భారీ కార్చిచ్చులు..
దేశం          ఏడాది    దగ్ధమైన అటవీ
రష్యా           2003    2.2 కోట్ల హెక్టార్లు
ఆ్రస్టేలియా    2020    1.7 కోట్ల  హెక్టార్లు
కెనడా         2014    45 లక్షల  హెక్టార్లు
అమెరికా      2004    26 లక్షల హెక్టార్లు

ఇది కూడా చదవండి: పాక్‌లో చైనీయులపై కాల్పులు.. జిన్‌పింగ్‌ ఆదేశాలు ఇవే..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement