USGS
-
ఇండోనేషియాలో భారీ భూకంపం
సింగపూర్ : ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటివరకూ వార్తలు అంతలేదు. గోరోన్తొలోఫ్రావిన్స్కు దక్షిణాన 280 కిలోమీటర్ల దూరంలో 343 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జియోలాజికల్ సర్వే అధికారులు గుర్తించారు. ఈ ప్రకంపనలతో అక్కడ నివసించే వారు భయాందోళనకు గురై ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కాగా గత ఏడాది ఇండోనేషియా ఘోరమైన విపత్తును ఎదుర్కొంది. సులావెసీ ద్వీపంలో ఏర్పడ్డ రెండు భూకంపాలు, సునామీ కారణంగా 2700మంది మృతి చెందగా, సుమారు పదివేల మందికి పైగా గాయపడ్డారు. -
అమెరికాలో భారీ భూకంపం
-
అమెరికాలో భారీ భూకంపం
అమెరికాలో గురువారం రాత్రి(భారత కాలమానం ప్రకారం) భారీ భూకంపం సంభవించింది. కాలిఫోర్నియాలోని ఉత్తర ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. రిక్టర్ స్కేలుపై 6.9గా భూకంప తీవ్రత నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే డిపార్ట్ మెంట్ పేర్కొంది. సముద్రతీరానికి 102 మైళ్ల దూరంలో భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోపల భూమి కంపించినట్లు చెప్పింది. సునామీ సంభవించే అవకాశం లేదని తెలిపింది. దక్షిణ శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా భూమి కంపించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దాదాపు 20 సెకన్ల పాటు భూమి కంపించిందని ఓ వ్యక్తి ట్విట్ చేశాడు. అయితే, యూఎస్ జీఎస్ మాత్రం ధ్రువీకరించలేదు. -
ఫిజీలో భూకంపం
వెల్లింగ్టన్: ఫిజీలో ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదు అయిందని యూఎస్ భూకంప పరిశోధకులు వెల్లడించారు. అయితే సునామి వచ్చే అవకాశాలు లేవని పేర్కొన్నారు. స్థానిక కాలమాన ప్రకారం..ఉదయం 9.28 గంటలకు ఈ భూకంపం సంభవించిందని తెలిపారు. ఫిజీలోని ఎండోయి ఐలాండ్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే తన వెబ్ సైట్లో వెల్లడించింది. -
ఆఫ్ఘన్లో భూకంపం : 17 మందికి గాయాలు
కాబూల్ : ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్‌లోని పాకిస్థాన్ - కజికిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదు అయింది. ఈ భూకంప ప్రమాదంలో 17 మంది ప్రజలు గాయపడ్డారని యూఎస్ జియోలాజికల్ సర్వే శనివారం వెల్లడించింది. భూమి కంపించడంతో ఈ ప్రాంతంలోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని పేర్కొంది. రాత్రంతా భయకరమైన చలిలో రోడ్లపైనే ప్రజలు జాగారం చేశారని వెల్లడించింది. భూకంప కేంద్రాన్ని 203 కిలోమీటర్ల దూరంలో కనుగోన్నట్లు తెలిపింది. ఈ భూకంప ప్రభావం భారత్‌లో కనిపించింది. భారత్‌లోని హిమాలయా పర్వత ప్రాంతంలోని రాష్ట్రాలతోపాటు న్యూఢిల్లీలో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే చెప్పింది.