అమెరికాలో గురువారం రాత్రి(భారత కాలమానం ప్రకారం) భారీ భూకంపం సంభవించింది. కాలిఫోర్నియాలోని ఉత్తర ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. రిక్టర్ స్కేలుపై 6.9గా భూకంప తీవ్రత నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే డిపార్ట్ మెంట్ పేర్కొంది. సముద్రతీరానికి 102 మైళ్ల దూరంలో భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోపల భూమి కంపించినట్లు చెప్పింది. సునామీ సంభవించే అవకాశం లేదని తెలిపింది.