north california
-
ఏంట్రా ఇది: ఒక్కసారిగా వధూవరులు షాక్.. ఫన్నీ వీడియో!
Photographer Falls Into Pool While Recording: వివాహ వేడుక తాలూకు జ్ఞాపకాలను పదిలపరుచుకునేందుకు నేటితరం ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. పెళ్లిలోని ప్రతీ ఈవెంట్‌ను కెమెరాల్లో బంధించి చిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఫొటోలు, వీడియోలు తీయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఫొటోగ్రాఫర్లు పడే ‘తిప్పలు’ వర్ణనాతీతం. ప్రతీ మూమెంట్‌ను తూచా తప్పకుండా క్యాప్చర్ చేసేందుకు వారు చేసే ‘సాహసాలు’, ‘రిస్కులు’ ఒక్కోసారి నవ్వులు పూయిస్తాయి. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నార్త్ కాలిఫోర్నియాకు చెందిన ప్రఖ్యాత అపెరీనా స్టూడియోస్ ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో ప్రకారం.. విలాసవంతమైన విల్లాలో అట్టహాసంగా జరుగుతున్న భారతీయ పెళ్లి వేడుకను వివిధ కోణాల్లో ఫొటోగ్రాఫర్లు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో వధూవరులు చిరునవ్వులు చిందిస్తూ స్విమ్మింగ్ పూల్ వైపుగా నడుస్తూ వస్తున్నారు. ఆ మూమెంట్లను కెమెరాలో బంధిస్తున్న ఫొటోగ్రాఫర్ ఒక్కసారిగా పూల్‌లో పడిపోయాడు. ఇది చూసిన పెళ్లికుమారుడు, పెళ్లి కుమార్తె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే పక్కనే ఉన్న వ్యక్తి ఆ ఫొటోగ్రాఫర్‌ను బయటికి లాగాడు. జూలైలో జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘ నువ్వు కిందపడినా పర్లేదు.. కెమెరా లెన్స్ అయితే పాడైపోలేదు కదా.. ఎందుకంటే నీకు అన్నింటి కంటే అదే ముఖ్యం కదా. ఏదేమైనా వధూవరుల రియాక్షన్స్ సూపర్బ్. ఫొటోగ్రాఫర్ అంకితభావం కూడా’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఆ ఫోజుకు సిగ్గుపడి.. వరుడిని కొలనులో తోసేసింది -
ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం
కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియా తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 భూకంప తీవ్రత నమోదైంది. ఆదివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో అక్కడ భూమి కంపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. యురేకా పట్టణానికి దాదాపు 62 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ఉత్తర కాలిఫోర్నియాలో పలు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు సమాచారం. చదవండి : కోవిడ్ కేసులు లక్ష పైనే -
అమెరికాలో భారీ భూకంపం
-
అమెరికాలో భారీ భూకంపం
అమెరికాలో గురువారం రాత్రి(భారత కాలమానం ప్రకారం) భారీ భూకంపం సంభవించింది. కాలిఫోర్నియాలోని ఉత్తర ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. రిక్టర్ స్కేలుపై 6.9గా భూకంప తీవ్రత నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే డిపార్ట్ మెంట్ పేర్కొంది. సముద్రతీరానికి 102 మైళ్ల దూరంలో భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోపల భూమి కంపించినట్లు చెప్పింది. సునామీ సంభవించే అవకాశం లేదని తెలిపింది. దక్షిణ శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా భూమి కంపించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దాదాపు 20 సెకన్ల పాటు భూమి కంపించిందని ఓ వ్యక్తి ట్విట్ చేశాడు. అయితే, యూఎస్ జీఎస్ మాత్రం ధ్రువీకరించలేదు.