Viral Video : Wedding Photographer Falls Into Pool During Photo Shoot - Sakshi
Sakshi News home page

Viral Video: వధూవరులు షాక్‌; నువ్వు పడినా పర్లేదు.. కానీ

Published Mon, Aug 9 2021 9:52 AM | Last Updated on Mon, Aug 9 2021 11:35 AM

Viral Video: Wedding Photographer Falls Into Pool While Recording Entry - Sakshi

Photographer Falls Into Pool While Recording: వివాహ వేడుక తాలూకు జ్ఞాపకాలను పదిలపరుచుకునేందుకు నేటితరం ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. పెళ్లిలోని ప్రతీ ఈవెంట్‌ను కెమెరాల్లో బంధించి చిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఫొటోలు, వీడియోలు తీయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఫొటోగ్రాఫర్లు పడే ‘తిప్పలు’ వర్ణనాతీతం. ప్రతీ మూమెంట్‌ను తూచా తప్పకుండా క్యాప్చర్‌ చేసేందుకు వారు చేసే ‘సాహసాలు’, ‘రిస్కులు’ ఒక్కోసారి నవ్వులు పూయిస్తాయి. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నార్త్‌ కాలిఫోర్నియాకు చెందిన ప్రఖ్యాత అపెరీనా స్టూడియోస్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన వీడియో ప్రకారం.. విలాసవంతమైన విల్లాలో అట్టహాసంగా జరుగుతున్న భారతీయ పెళ్లి వేడుకను వివిధ కోణాల్లో ఫొటోగ్రాఫర్లు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో వధూవరులు చిరునవ్వులు చిందిస్తూ స్విమ్మింగ్‌ పూల్‌ వైపుగా నడుస్తూ వస్తున్నారు. ఆ మూమెంట్లను కెమెరాలో బంధిస్తున్న ఫొటోగ్రాఫర్‌ ఒక్కసారిగా పూల్‌లో పడిపోయాడు. ఇది చూసిన పెళ్లికుమారుడు, పెళ్లి కుమార్తె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

 వెంటనే పక్కనే ఉన్న వ్యక్తి ఆ ఫొటోగ్రాఫర్‌ను బయటికి లాగాడు. జూలైలో జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘ నువ్వు కిందపడినా పర్లేదు.. కెమెరా లెన్స్‌ అయితే పాడైపోలేదు కదా.. ఎందుకంటే నీకు అన్నింటి కంటే అదే ముఖ్యం కదా. ఏదేమైనా వధూవరుల రియాక్షన్స్‌ సూపర్బ్. ఫొటోగ్రాఫర్‌ అంకితభావం కూడా‌’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. 

చదవండి: ఆ ఫోజుకు సిగ్గుపడి.. వరుడిని కొలనులో​ తోసేసింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement