ప్రతీకాత్మక చిత్రం
కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియా తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 భూకంప తీవ్రత నమోదైంది. ఆదివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో అక్కడ భూమి కంపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. యురేకా పట్టణానికి దాదాపు 62 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ఉత్తర కాలిఫోర్నియాలో పలు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు సమాచారం.
చదవండి : కోవిడ్ కేసులు లక్ష పైనే
Comments
Please login to add a commentAdd a comment