వాషింగ్టన్ : కరోనా కల్లోలంతో విలవిల్లాడుతున్న అమెరికాను భారీ భూకంపం వణించింది. అమెరికా రాష్ట్రం ఇదాహోలో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. రాష్ట్రవ్యాప్తంగా బలమైన భూకంపం సంభవించిందని నేషనల్ వెదర్ సర్వీస్ ఒక ట్వీట్‌లో పేర్కొంది. మంగళవారం సాయంత్రం 20-30 సెకన్ల పాటు భూమి కంపించిందని తెలిపింది. రాష్ట్ర రాజధాని బోయిస్‌కు ఈశాన్యంగా ఒక మారుమూల పర్వత ప్రాంతంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే నివేదించింది. దీంతో భయంతో ప్రజలు వీధుల్లోకి పరుగులుతీసినట్టు తెలుస్తోంది. ట్విటర్ ద్వారా కొంతమంది తమ అనుభవాలను షేర్ చేశారు. దీనిపై మరిని వివరాలు అందాల్సి వుంది.
కాగా కోవిడ్-19 (కరోనా వైరస్) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 42,158మంది మరణించగా, అమెరికాలో మరణాల సంఖ్య నాలుగు వేలకు సమీపంలో వుంది. అయితే అమెరికాలో కరోనా వైరస్ వల్ల సుమారు లక్ష నుంచి రెండు లక్షల 40 వేల వరకు మరణాలు సంభవించవచ్చు అని ఆ దేశ వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న కొన్ని వారాల్లో ఈ మరణాల సంఖ్య నమోదు అవుతుందన్నారు. మరోవైపు దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఇదే అంశంపై దేశ ప్రజలను హెచ్చరించడం గమనార్హం.
Felt the earthquake from Idaho in Kelowna, BC! #earthquake pic.twitter.com/PukmQVi60A
— Kelly (@kellyrmcintosh) April 1, 2020
Comments
Please login to add a commentAdd a comment