భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఫిజీ చేరుకున్నారు.
సువా: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఫిజీ చేరుకున్నారు. మోదీ మంగళవారం ఫిజీ రాజధాని సువాకు వచ్చారు.
33 ఏళ్లలో ఫిజీని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే. మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ మయన్మార్, ఆస్ట్రేలియా సందర్శించిన సంగతి తెలిసిందే. ఫిజీ పర్యటన అనంతరం మోదీ స్వదేశం తిరిగిరానున్నారు.