arrive
-
ఢిల్లీలో భారీ వర్షం.. మండుటెండల నుంచి ఉపశమనం
దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు(గురువారం) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఎండ వేడిమి నుంచి ఢిల్లీవాసులకు ఉపశమనం లభించింది. ఈసారి ఢిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాడ్పులు కూడా అధికంగా వీచాయి.దేశంలోని తూర్పు రాష్ట్రాలలో రుతుపవనాలు ఇప్పటికే ప్రవేశించాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీలో వర్షాలు ప్రారంభమయ్యాయి. రానున్న కొద్ది రోజుల్లో ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోనుంది.స్కైమెట్ తెలిపిన వివరాల ప్రకారం ఈ వారం చివరి నాటికి రుతుపవనాలు ఢిల్లీకి పూర్తిస్థాయిలో వచ్చే అవకాశం ఉంది. రుతుపవనాలు సాధారణంగా జూన్ 27- 29 తేదీల మధ్య దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటాయి. గత ఏడాది జూన్ 26న రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ ఏడాది ఇప్పటికీ ఉత్తరాదిన హీట్‌వేవ్ కొనసాగుతోంది. జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఈ తరుణంలోనే వాతావరణశాఖ రుతుపవనాల రాకకు సంబంధించిన శుభవార్త చెప్పింది. #WATCH दिल्ली: राष्ट्रीय राजधानी के कई हिस्सों में बारिश होने से लोगों को गर्मी से राहत मिली।वीडियो राव तुला राम मार्ग इलाके से है। pic.twitter.com/mkJkJaloVd— ANI_HindiNews (@AHindinews) June 27, 2024 -
వెచ్చేనెల 22న హైదరాబాద్‌కు ప్రణబ్
-
హైదరాబాద్ చేరుకున్న సంకీర్త్ మృతదేహం
-
ఆస్ట్రేలియా చేరుకున్న భారత క్రికెట్ జట్టు
ముంబై: భారత క్రికెట్ జట్టు శనివారం ఆస్ట్రేలియా చేరుకుంది. ముంబై నుంచి బయల్దేరిన టీమిండియా సభ్యులు సింగపూర్ మీదుగా అడిలైడ్ చేరుకున్నారు. ప్రస్తుత భారత జట్టులో ఎక్కువగా యువ ఆటగాళ్లు ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 14న బ్రిస్బేన్‌లో తొలి టెస్టు ఆరంభంకానుంది. టెస్టు సిరీస్ ముగిశాక ఆసీస్, ఇంగ్లండ్‌లతో కలసి ముక్కోణపు వన్డే సిరీస్ ఆడనుంది. ఆ వెంటనే వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియాలో ప్రపంచ కప్ ఆరంభంకానుంది. భారత జట్టు సుదీర్ఘకాలం పాటు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. -
ఫిజీ చేరుకున్న మోదీ
సువా: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఫిజీ చేరుకున్నారు. మోదీ మంగళవారం ఫిజీ రాజధాని సువాకు వచ్చారు. 33 ఏళ్లలో ఫిజీని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే. మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ మయన్మార్, ఆస్ట్రేలియా సందర్శించిన సంగతి తెలిసిందే. ఫిజీ పర్యటన అనంతరం మోదీ స్వదేశం తిరిగిరానున్నారు. -
మయన్మార్ చేరుకున్న మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ మయన్మార్ చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం మయన్మార్ రాజధాని నే పీ తాకి వెళ్లిన మోదీకి ఘన స్వాగతం లభించింది. అక్కడి ప్రజలు సంప్రదాయ దుస్తుల్లో మోదీకి స్వాగతం పలికారు. మయన్మార్ అందమైన దేశమంటూ మోదీ ట్వీట్ చేశారు. దక్షిణాసియాకు వారథి వంటిదని అభివర్ణిస్తూ ట్విట్టర్లో ఫొటో పోస్ట్ చేశారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ తొలుత మయన్మార్ వెళ్లారు. -
ఇజ్రాయెల్ చేరుకున్న రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం రాత్రి ఇజ్రాయెల్ చేరుకున్నారు. గురువారం రాజ్‌నాథ్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యెహుతో సమావేశంకానున్నారు. ఉగ్రవాదంపై పోరాటం, భద్రతను పటిష్టం చేయడం తదితర ద్వైపాక్షిక అంశాల గురించి చర్చించనున్నారు. రాజ్‌నాథ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. రాజ్‌నాథ్ బుధవారం ఉదయమే ఇజ్రాయెల్ చేరాల్సివుంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా మొనాకొ నుంచి వెళ్లాల్సిన విమానం రద్దయ్యింది. దీంతో ఆయన పర్యటన ఆలస్యమైంది. -
శ్రీహరికోటకు చేరుకున్న ప్రధాని మోడీ
-
శ్రీహరికోటకు చేరుకున్న ప్రధాని మోడీ
చెన్నై: ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి దక్షిణాది పర్యటనకు వచ్చారు. పీఎస్ఎల్వీ సీ-23 రాకెట్ ప్రయోగాన్ని తిలకించేందుకు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ సెంటర్ కు చేరుకున్నారు. మోడీకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం ఉదయం పీఎస్ఎల్వీ సీ-23 రాకెట్ ప్రయోగాన్ని మోడీ వీక్షించనున్నారు. ఉపగ్రహ ప్రయోగం సందర్భంగా షార్ సెంటర్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మోడీ అంతకుముందు ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చి అక్కడి నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో శ్రీహరికోటకు వచ్చారు. చెన్నై విమానాశ్రయంలో తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత స్వాగతం పలికారు. -
మరో మూడు మెట్రో రైళ్లు వచ్చేశాయి..
మరో మూడు మెట్రో రైళ్లు నగరానికి వచ్చేశాయి. దక్షిణకొరియా నుంచి చెన్నై వరకు సముద్ర మార్గంలోను, అక్కడినుంచి హైదరాబాద్ నగరానికి రోడ్డు మార్గంలోను ఇవి చేరుకున్నాయి. ఒక్కో రైల్లో మూడేసి బోగీలున్నాయి. బోగీల లోపలి భాగం ఎలా ఉంటుందో ఈ చిత్రాల్లో చూడచ్చు. వీటిలో ఒక్కోదాంట్లో 330 మంది చొప్పున ఒక రైల్లో వెయ్యి మంది ఒకేసారి ప్రయాణం చేయచ్చని మెట్రో రైలు వర్గాలు తెలిపాయి. రైలు ఆగగానే తెరుచుకుని, ఆగగానే మూసుకుపోయే ఆటోమేటిక్ తలుపులు, లోపల మొత్తం ఏసీ, మొబైల్, ల్యాప్ టాప్ లను ఛార్జింగ్ చేసుకోడానికి పాయింట్లు, ఇలా అన్ని సౌకర్యాలు వీటిలో ఉంటాయి. భద్రతా పరమైన పరీక్షలన్నింటినీ పూర్తి చేసుకుని వచ్చే సంవత్సరం ఉగాది నాటికి ముందుగా నాగోల్ - మెట్టుగూడ మార్గంలో మొదటి మెట్రోరైలు ప్రయాణికులతో పరుగులు తీస్తుంది.