
మరో మూడు మెట్రో రైళ్లు వచ్చేశాయి..
మరో మూడు మెట్రో రైళ్లు నగరానికి వచ్చేశాయి. దక్షిణకొరియా నుంచి చెన్నై వరకు సముద్ర మార్గంలోను, అక్కడినుంచి హైదరాబాద్ నగరానికి రోడ్డు మార్గంలోను ఇవి చేరుకున్నాయి.
ఒక్కో రైల్లో మూడేసి బోగీలున్నాయి. బోగీల లోపలి భాగం ఎలా ఉంటుందో ఈ చిత్రాల్లో చూడచ్చు. వీటిలో ఒక్కోదాంట్లో 330 మంది చొప్పున ఒక రైల్లో వెయ్యి మంది ఒకేసారి ప్రయాణం చేయచ్చని మెట్రో రైలు వర్గాలు తెలిపాయి. రైలు ఆగగానే తెరుచుకుని, ఆగగానే మూసుకుపోయే ఆటోమేటిక్ తలుపులు, లోపల మొత్తం ఏసీ, మొబైల్, ల్యాప్ టాప్ లను ఛార్జింగ్ చేసుకోడానికి పాయింట్లు, ఇలా అన్ని సౌకర్యాలు వీటిలో ఉంటాయి. భద్రతా పరమైన పరీక్షలన్నింటినీ పూర్తి చేసుకుని వచ్చే సంవత్సరం ఉగాది నాటికి ముందుగా నాగోల్ - మెట్టుగూడ మార్గంలో మొదటి మెట్రోరైలు ప్రయాణికులతో పరుగులు తీస్తుంది.